విషయానికి వెళ్ళండి

తిరుమల

18/02/2009

 

తిరుమలలో అన్యమత ప్రచారం నిరోధించడమే కాకుండా ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి.

ముందుగా తిరుమల కొండపై నుండి ప్రైవేటు వ్యక్తులను, సంస్థలను కొండ కిందకు సాగనంపాలి. తిరుమల కొండలన్నీ శ్రీనివాసునివైనట్లే తిరుమల, ఆలయ పరిసరాలు మొత్తం శ్రీనివాసునికే చెందాలి. అంటే తిరుమలలోని ప్రైవేటు ఆస్థులన్నింటికి తగిన నష్టపరిహారం చెల్లించి, దేవస్థానం అధీనంలోకి తీసుకురావాలి. తిరుమలలో స్వఛ్ఛమైన ఆధ్యాత్మిక ప్రశాంతత నెలకొనేలా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. హడావిడి, రణగొణ ధ్వనులు తగ్గించాలి. కొండపై ఎటువంటి వ్యాపారం జరుగకుండా చూడాలి. భక్తులకు సాత్వికమైన భోజనం, పిల్లలకు పాలు మొదలైనవి దేవస్థానం ఉచితంగా అందచేయవచ్చును.

తిరుమల కొండపై భక్తులు తలనీలాల సమర్పణ, మరియు స్వామి వారి దర్శనం వంటి పవిత్ర కార్యాలు మినహా వేరే వాటికి కొండపైకి రాకుండా చూడాలి. అంతె కాకుండా రాత్రులు ఎవరూ కొండపై నిద్రించే అవసరం రాకుండా చూడాలి. కొండపై ఉన్న షాపింగు కాంప్లెక్సులన్నింటిని కిందకు తరలించాలి. అన్ని సంస్థలకు చెందిన సత్రాలూ, గెష్టు హౌసులూ మూసివేయాలి. కొండపై ప్రస్తుతం ఉన్న క్వార్టర్లన్నీ కూలగొట్టాలి. కేవలం ఆధునికమైన వెయిటింగు లాంజులు వంటివి మాత్రమే నిర్మించాలి. కాంక్రీటు జంగిలులా ఉన్న తిరుమలలో అందమైన ఉద్యనవనాలతో ప్రకృతి రమణీయత పెంచాలి. అలాగే తిరుమలలోని వీధులన్నింటికి పైకప్పు నిర్మిస్తే భక్తులు ఎండల్లో, వానల్లొ ఇబ్బంది పడకుండా వుంటారు.

తిరుమలకు వచ్చే భక్తుల బస కోసం కొండ కింద తిరుపతిలో ఒక పెద్ద టౌనుషిప్పు నిర్మించవచ్చును. ఇందులో సుమారు పాతిక వేల గదులతో భక్తులకు వసతి సౌకర్యం కల్పించాలి. ఇక్కడే భక్తులు వేచివుండి వాళ్ళకు కేటాయించిన సమయంలో కొండపైకి వెళితే తిరుమలలో రద్దీ తక్కువవుతుంది. ప్రశాంతంగా వుంటుంది.

తిరుమల యాత్ర శ్రీనివాసుని దర్శనానికేగాని విహార యాత్ర కాదు. ఇప్పటికే అనేకమంది అనవసర వ్యక్తులు వచ్చి తిరుమల పవిత్రతతను పాడుచేస్తున్నారు. ఎంతో మంది దళారులు భక్తులను వేధిస్తూ మోసగిస్తున్నారు. వీళ్ళని తిరుమలనుండి వెళ్ళగొట్టి దేశం నలుమూలలనుండి పెద్ద ఎత్తున వాలంటీర్లను ఆహ్వానించాలి.

తిరుమలకి రావడానికి ప్రస్తుతం ఆర్ టి సి బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలను కూడా అనుమతిస్తున్నారు. వీటి వలన ప్రమాదాలు జరగడంతో పాటు కాలుష్యం, రణగొణ ధ్వనులు తిరుమల ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నాయి. రోపువే నిర్మాణం చెపట్టనున్నారని అంటున్నారు. రోపువే కంటే సురక్షితంగా, సౌకర్యంగా వేగంగా కొన్ని వందలమందిని ఒకేసారి తీసుకువెళ్ళగల ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి. మోనోరైలు, లైటురైలు లేదా ఎస్కలేటర్లు వంటి ప్రత్యామ్నాయ్యాలు బహుశా రోపువే కంటే మెరుగైనవి కావచ్చును. సాంకేతికంగాను, ఆర్ధికంగాను మరియు ఇతరత్రా వీటి సాధ్యాసాధ్యాలను పరిశిలించాలి. దిగువ తిరుపతిలోని టౌనుషిప్పులో మోనోరైలు లేదా లైటురైలు స్టేషను నుండి భక్తులు నేరుగా కొండపైకి వెళితే కొండపై భద్రతాచర్యలు సులభమవుతాయి. భక్తులు కూడా తక్కువ సామానుతో వస్తారు.

ఇంకో ప్రత్యామ్నాయం ఏమిటంటే కొండ కిందనుండి పైకి ఒకదాని తరువాత ఒకటి వరుసగా ఎస్కలేటర్లు నిర్మించడం. వీటిని మెట్లదారికి సాధ్యమైనంత దగ్గరగా నిర్మిస్తే భక్తులకు వీలుగా ఉంటుంది.

తిరుపతిలోని టౌనుషిప్పులో ఢిల్లీలోని అక్షరధాం లో వలె తిరుమల విశేషాలతో మల్టీమీడియా ప్రదర్శనలు, పార్కులు ఏర్పాటు చేస్తే తిరుమల యాత్ర భక్తుల మదిలో చిరస్మరణియంగా ఉండిపోతుంది.

 

 

10 వ్యాఖ్యలు leave one →
 1. 18/02/2009 06:11

  మంచి ఆలోచనలు. అమలుపరుస్తారని ఆశిద్దాం.

 2. చిలమకూరు విజయమోహన్ permalink
  18/02/2009 11:20

  మంచి ఆలోచనలు,కానీ వీటిని అమలుపరచేందుకు ఎవరూ సిద్ధంగా లేరు

 3. krishna rao jallipalli permalink
  18/02/2009 14:29

  చాలా మంచి ఆలోచన. కార్య రూపం దాల్చితే బాగుంటుంది. కాని… కొంతమంది అక్రమార్కులు, రాజకీయ నాయకులూ (కమిషన్లు కొట్టే వాళ్లు) పడనీయరు వాళ్ళ అక్రమ ఆదాయానికి గండి పడుద్దని.

 4. R Vemuri permalink
  18/02/2009 14:51

  తిరుపతి కొండ మీద క్రైస్తవుల చర్చి ఒకటి కట్టించటానికి ప్రయత్నం చేస్తున్నారని ఎవ్వరో చెప్పగా విన్నాను. ఇదెంతవరకు నిజం? ఎవ్వరికైనా తెలుసా?

 5. bharathi permalink
  09/04/2009 16:59

  chala manchi aalochanalu.kani evanni amalu parachadaniki service oriented mind vunna nayakulu kavali. dabbu kosam kakunda oka pavitramayina devastanam ga marchenduku emi cheyalo alochinachali.

 6. 17/04/2009 12:18

  బోనగిరి గారు – మంచి ఆలోచనలే కాని ఒక్క చిక్కు. కొండ మీద సిగరెట్టు తాగడం నిషేదం. కాని ఎంతో మంది దొంగ చాటుగ తాగుతారు. కొండ మీద నుండి మీరన్నట్టు షాపులని తీసేసినా దొంగ వ్యాపారం జరుగుతుందండి. నేను చెప్పేదెంటంటే 1000 లో ఒక 900 మంది భక్తి తో వచ్చినా మిగిలిన 100 మంది మాత్రం వెంకన్న మీద భక్తి తో రారు. అలాంటి వాళ్ళ వళ్ళే అంత స్వచ్చమైన దేవాలయం కలుషితమౌతోంది. అసలు గుడి లోకి హిందువుల తప్ప ఇంకెవ్వరికి అనుమతి లేదు, అలాంటిది సోనీయా వెళ్ళింది.. తను హిందు ధార్మాన్ని పాటిస్తున్నట్టు ఖాతీబు ఇవ్వకుండా. ఆ ఏం చేస్తాడు లే వేంకటేశ్వరుడు అన్న అభిప్రాయం వాళ్ళది – కలియుగ దైవం అన్నమాట మరిచి. బ్రహ్మం గారు చెప్పారు కదండి కాలజ్ఞాణం లో.

 7. 27/08/2009 21:21

  మన సౌకర్యాలు పక్కనపెడితే అసలు సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరుని సొత్తుకే భద్రత లేకుండా పోయింది . ఇప్పటికైనా తిరుమల తిరుపతి దేవస్థానం వారు కళ్ళు తెరిచి ప్రజలు భక్తి తో సమర్పించిన శ్రీవారి నగల లెక్కల్ని తరుచుగా సంబంధిత అధికారులు చేత తనికి చేసి ఆ వివరాలన్నీ ప్రజలకి తెలియచేస్తూ ఉంటె కానుకలు సమర్పించిన భక్తుల కు సంతోషం గ ఉంటుంది

 8. 02/03/2010 13:29

  మీ ఆలోచన స్వాగతించదగినదే. కాని స్వార్ధం కమ్మేసిన మన నాయకులు బంగారు బాతులాంటి ఆలయాన్ని వదులుతారా. లడ్డూ పరిమాణం తగ్గి ధర పెరిగింది. స్వామి దర్శనం విలువ పెరుగుతోంది. సామాన్యులకు దైవ దర్శనం అతిగొప్ప విషయం. వి.ఐ.పి లకైతే రాచమర్యాదలు. అసలు ఎవరు వి.ఐ.పి లో తేల్చాలి. ప్రతివాళ్ళు ఏదో ఒక రిఫరెన్స్ తో రావడం. సామాన్యులకు అడ్డుపడటం. మీరన్నట్టు కాటేజ్లు, దుకాణాలు క్రింద తిరుపతిలో కడితే మేలు. పైన రద్దీ తగ్గి ప్రశాంతంగానే ఉంటుంది. స్వామి దర్శనానంతరం ఇతర తీర్ధాలు కూడా చూసి భక్తులు కొండ దిగి వెళ్ళిపోవచ్చు. తిరుపతికి వెళ్ళడం విహార యాత్రలా కాకుండా ఆధ్యాత్మిక యాత్రలా అయితే బాగుంటుంది.

Trackbacks

 1. తిరుమల గిరిలో కిరి కిరిల పై బోనగిరి | సాంబారు గాడు
 2. దశ వసంతాలు | ఆలోచనాస్త్రాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: