Skip to content

ప్రజారాజ్యం బి జె పి లో కలిస్తే.

03/03/2009

 

ప్రజారాజ్యం పార్టీ ఆలస్యంగా ప్రారంభించడంవల్ల, ఇంతవరకూ ఏ ఎన్నికలలొను పోటీ చేయకపోవడం వల్ల ఆ పార్టీకి ఇంతవరకు ఎన్నికల గుర్తు కేటాయించలేదు. ఇకపై వస్తుందో రాదో తెలియదు. ఇందు కోసం వాళ్ళు ఏదో ఒక పార్టీని సుదూర ప్రాంతం నుండి తీసుకువచ్చి ఆ గుర్తుమీద పోటీ చేస్తారని అంటున్నారు. దీనివల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయో, ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారో తెలియదు.

ఎలాగు నవ తెలంగాణా పార్టీ ప్రజారాజ్యం లో విలీనం అయింది. అలాగే ప్రజారాజ్యం కూడా బి జె పి లో విలీనం అయితే ఎన్నికలగుర్తు సమస్య వుండదు. బి జె పి బలం కూడా తోడు అవుతుంది. చిరంజీవికి అద్వాని ఆశీస్సులున్నాయి కాబట్టి ఇదో మంచి ఏర్పాటు అవుతుంది.

దీనివలన ఎన్ డి ఎ కి కేంద్రంలో మద్దతు పెరుగుతుంది. చిరంజీవి వలన్ బిజెపి, బిజెపి వలన చిరంజీవి పరస్పరం లాభం పొందుతారు. తెలంగాణా ఎన్ డి ఎ ద్వారానే సాధ్యం కాబట్టి బహుశా టి ఆర్ ఎస్ కూడా ఈ కూటమిలో చేరవచ్చు. అది జరిగితే ఈ కూటమే మహాకూటమి అవుతుంది.

 

 

ప్రకటనలు
4 వ్యాఖ్యలు leave one →
  1. Srinivas permalink
    03/03/2009 11:43

    మరి చిరంజీవి గారు మాది సెక్యులర్ పార్టీ మాట తత్వ బె జే పి తో కలవము అన్నారు కదా
    ఇప్పుడు గుర్తు కోసం కలిస్తే అవకాశ వాదం అవుతుందేమో

  2. 03/03/2009 12:47

    తార్కికంగా చూస్తే మీ ఆలోచన సబబుగా అనిపిస్తోంది. రాష్ట్రానికి సంబంధించినంతవరకు ప్రరాపాయే ఆ కూటమికి పెద్దన్న అవుతుంది. కేంద్రంలో పలుకుబడీ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం.. పొత్తు పెట్టుకోడానికి బీజేపీ కంటే ఉత్తమమైన పార్టీ లేదీరోజున. (లోక్‌సత్తాకూ వీళ్ళకూ పడదు కాబట్టి)

    కాకపోతే, హిందూవాదం, మతవాదం లాంటి కాలం చెల్లిన పుచ్చు సిద్ధాంతాలను పట్టించుకోకుండా ఉండే రాజకీయ స్థైర్యం ప్రజారాజ్యపు నేతకు కావాలి.

  3. 03/03/2009 16:25

    నాకనిపిస్తోంది.., బిజెపి తో కలవకపోవటం చిరంజీవి చేస్తున్న వ్యూహాత్మక తప్పిదం అని. తన బలాన్ని అతిగా ఊహించుకుంటూ…, ఎవరితో కలవకుండా ఉంటే వస్తాయనుకున్న కొన్ని సీట్లు కూడ వచ్చేలాలేవు. చంద్రబాబు లా చిరంజీవి కూడ సంతుష్టీకరణ విధానమే తీసుకున్నట్లున్నాడు. అయితే అంతలా మార్పుని తీసుకొస్తానంటున్న చిరంజీవి, జయ ప్రకాష్ నారాయణ తో కలవకపోవటం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవటం తను మాట్లాడుతున్న మాటల్లోని డొల్ల తనమే కనపడుతోంది.

  4. bonagiri permalink
    04/03/2009 03:58

    మన దేశంలో నిజమైన లౌకికవాద పార్టీ ఒక్కటి కూడా లేదు. అన్నీ అవకాశవాద పార్టీలే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: