విషయానికి వెళ్ళండి

నరసాపురం వంతెన

06/04/2009

 

మా ఊరు నరసాపురం వద్ద వశిష్ట గోదావరి పై వంతెన నిర్మిస్తామని ఆనాటి ఎన్.టి.ఆర్ నుండి నేటి వై.యస్ దాకా అందరూ వాగ్దానాలే కాదు శంఖుస్థాపనలు కూడా చేసారు. కాని ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. నాకు ఊహ తెలిసినప్పటినుంచి అది మా అందరి కల.  

ఒకసారి అనుమతి లభించినా వంతెనని నరసాపురం నుండి పాలకొల్లు దగ్గరున్న చించినాడకి జోగయ్య గారు తరలించుకుపోయారని అంటారు. ప్రస్తుతం ఆయన చిరంజీవినే పాలకొల్లుకి తరలించుకుపోయారు.

మా ఊరు వంతెనకి, బందరు పోర్టుకి చాలా పోలికలున్నాయి. రెండూ ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల కలలు. విచిత్రంగా ఈ రెండు ప్రాజెక్టులని ఒకే కంపెనీకి వై. యస్. గారు బి ఒ టి ప్రాతిపదికన ఇచ్చారు.

ప్రైవేటు రంగం కదా ఇప్పటికైనా మా ఊరుకి వంతెన వస్తుందని అందరూ అనుకున్నారు.

కాని ఆ కంపెనీ కాస్త కుదేలవడంతో పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది.

తరువాత ఏమవుతుందో బహుశా ఎన్నికల తరువాతే తెలియవచ్చు.

పాపం బాలయోగి గారు బతికుంటే రోడ్డు బ్రిడ్జే కాదు నరసాపురం, కోటిపల్లిని కలుపుతూ రైల్వే లైను కూడా వచ్చేదంటారు.

మా ఊరివాడైన చిరంజీవైనా మా ఊరి వాళ్ళ కల నిజం చేస్తాడేమో చూడాలి. చిరంజీవి గారికి నా విఙప్తి  ఏమిటంటే రొడ్డు బ్రిడ్జితో పాటు నరసాపురం కోటిపల్లి రైల్వే లైను కోసం రైలు బ్రిడ్జి కూడా కావాలి కాబట్టి ఏకంగా రైలు కం రోడ్డు బ్రిడ్జి  నిర్మించటానికి ప్రయత్నించండి.

నరసాపురం వాసులారా ఏమంటారు ఇది అత్యాశేనా?

 

 

 

 

 

 

గమనిక.

పై టపాకి సంబందించి 08-04-2009 ఈనాడు పాంచజన్యంలో వచ్చిన వార్త ఇది.

 

 narasapuram-vantena

5 వ్యాఖ్యలు leave one →
 1. 22/07/2009 00:16

  Narapuram vanthena kala kadhu nijam avuthundhani neelage asisthunnanu.
  – tirumala devi ,narsapuram.

 2. RAJANIKANTH.YERRAMSETTY permalink
  25/04/2012 17:29

  NARASAPURAM VANTHENA RAVALANTE EDHO ADBHUTHAM JARAGAALI.YE OKKA NAYAKUDU EE PRTHIPADHANANI KARYAROOPAM CHEYALERU. MANA OORIVAARANDHARU..TELANGANA UDHYAMAMLA UDHYAMISTHE THAPPA EE VANTHENA NIRMANAM JARAGADHU.PRASTHUTHAM EDHI MANANDHARI ATHYASE ANUKUNTUNNANU.
  RAJANIKANTH.
  rajanikanth100@yahoo.com

 3. KRISHNA MOHAN permalink
  10/05/2012 19:22

  Narsapuram vantena raavadam ante adi ippatlo jarige panila anipinchadam leadu. Bahusa mana manavala kaalam ravalemo.

 4. bonagiri permalink
  11/05/2012 20:12

  @రజనీకాంత్, కృష్ణమోహన్, మీ కామెంటుకు ధన్యవాదాలు.
  నాకు తెలిసిన సమాచారం ప్రకారం, మైటాస్ కంపెనీ తరువాత ఈ వంతెన నిర్మించడానికి మరో కంపెనీ ముందుకు వచ్చింది. ఆ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి CABLESTAY BRIDGE నరసాపురం వద్ద వచ్చేది. కాని మళ్ళీ ఏవో ఆరోపణలు రావడంతో ఆ ప్రతిపాదన వెనక్కి పోయింది.

 5. murthy permalink
  04/02/2013 21:18

  We can’t see in our life. Hope next generation will see.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: