Skip to content

బెజవాడ జంక్షన్

01/06/2009

ఆంధ్ర ప్రదేశ్ లోని ముఖ్యమైన రైల్వే జంక్షన్లలో విజయవాడ జంక్షన్ ఒకటి. అలాగే ముఖ్యమైన బస్ స్టేషన్లలో కూడా విజయవాడ ఒకటి. విజయవాడ చుట్టుపక్కల ఉన్న కనీసం అర డజను జిల్లాలవాళ్ళు దేశవిదేశాలలోని ఎక్కడికి వెళ్ళాలన్నా విజయవాడ బస్ స్టేషనుకి, రైల్వే స్టేషనుకి వెళ్ళాల్సిందే.

నిత్యం అనేకమంది ప్రయాణికులు ఈ రెండింటి మధ్య తిరుగుతుంటారు. వీరిలో చాలా మంది సామాన్యులు, పాదచారులు. వీళ్ళు పిల్లా పాపలతో, సామాన్లుతో ఎండల్లో వానల్లో అవస్థలు పడుతు ట్రాఫిక్ మధ్య రోడ్డుకి అడ్డం పడుతూ వెళుతుంటారు.

ఇలాంటి అనేకమంది ప్రయాణికులకు ఉపయోగపడేలా రైల్వే స్టేషను నుండి బస్ స్టాండుని కలుపుతూ ఒక ఫుట్ బ్రిడ్జిని నిర్మిస్తే అందరికీ సౌకర్యంగా వుండడంతోపాటు ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి.

ఈ ఫుట్ బ్రిడ్జిని రైల్వేస్టేషనులోని ఒకటో నంబరు ప్లాట్ ఫారం మీద వున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి నుండి అదే ఎత్తులో ప్రారంభించి ఏలూరు కాలువ, గవర్నమెంటు హాస్పిటలు, పోలీస్ కంట్రోలు రూం మీదుగా బస్ స్టేషనుకి కలపవచ్చు.

ఈ విధంగా ప్రయాణికులు రోడ్డుపైకి రాకుండా నేరుగా వెళ్ళడం వలన వాళ్ళ విలువైన సమయం ఆదా అయి రైళ్ళు బస్సులు తప్పిపోకుండా త్వరగా వారి వారి గమ్యాలు చేరుకుంటారు. అంతే కాకుండా ఆర్ టి సి ప్రయాణికులని ప్రైవేటు వాహనాలవాళ్ళు హైజాక్ చేయలేరు.

ఈ ఫుట్ బ్రిడ్జి మీద ఎయిర్ పోర్టులలోలా లగేజి ట్రాలీలు ఏర్పాటు చేస్తే పోర్టర్ల అవసరం కూడా తగ్గుతుంది. వృధ్ధులకు, వికలాంగులకు వ్హీల్ చైర్లు ఏర్పాటు చేస్తే వాళ్ళు క్షేమంగా వెళ్ళగలుగుతారు.

బస్సు స్టాండులో ఈ ఫుట్ బ్రిడ్జినుండి కిందనున్న ప్లాట్ ఫారాలు చేరుకోవడానికి లిఫ్టులు, ఎస్కలేటర్లు, రాంపులు నిర్మించవచ్చు. బస్సు స్టాండు వైపు రైల్వే ఎంక్వయిరీ, రైల్వే స్టేషను వైపు బస్ ఎంక్వయిరీ మరియు డిస్ ప్లే బోర్డులు పెట్టాలి. రైల్వే స్టేషను వైపు అదే ఎత్తులో బుకింగు కౌంటరు, వెయిటింగు రూములు ఉంటే ప్రయాణికులు అక్కడే టిక్కట్టు కొనుక్కొని నేరుగా ప్లాట్ ఫారం కి వెళ్ళిపోవచ్చు.

ఇప్పటికే ఇలాంటి ఫుట్ బ్రిడ్జిలని ముంబయి వంటి నగరాలలొ ముఖ్యమైన రోడ్ల కూడళ్ళు దాటడానికి ఏర్పాటు చేస్తున్నారు. వీటిని ఆకర్షణీయంగా రూపొందించి SKYWAY / SKYWALK అని అంటున్నారు.

ప్రకటనలు
7 వ్యాఖ్యలు leave one →
 1. 01/06/2009 06:54

  Nice idea.

  There is one such in Bangalore – I think.

 2. 01/06/2009 06:54

  Chakkani soochana….amaluparusthe baguntundi…..

 3. Harekrishna permalink
  01/06/2009 09:25

  ikkada skywalk lu 3 vunnayi..okati bandra,migatavi lalbagh,vikhroli lo..bandra skywalk largest
  okkokkadaaniki 12 crores kharchu ayyindi mana andhra lo polititions cheyyi vesthe aa 2 lane flyover 1 lane chesina ghanata mana bejawada di

  skywalk tho vache disadvantage ante luggage antha ettuki moyadam chaala kastam
  manchi alochana nijayithi ga amalu paristhe prayojankaramga vuntundi

 4. సుబ్బారావు permalink
  01/06/2009 11:06

  చాలా మంచి ఆలోచన. నేను విజయవాడ లో చదువుకునేటప్పుడు, నాకు ఇటువంటి ఆలోచనే వుండేది, కాని అప్పుడు ఎవరికీ చెప్పాలో తెలియదు, మీరు మీ ఆలోచన ఇక్కడ చెప్పి మంచి పని చేసారు, ఇంకా చాలా సూచనలు ఇచ్చారు. ఈ బ్లాగ్ ఎవరైనా అధికారులు చదివి, మీరు చెప్పినటువంటి నిర్మాణం జరుగుతుంది అని ఆశిస్తూ… 🙂
  సుబ్బారావు.

 5. bonagiri permalink
  02/06/2009 07:34

  చావా కిరణ్ గారు, థాంక్స్. బెంగుళూరులో సబ్ వే ద్వారా లేదా రోడ్డు దాటుకుని వెళ్ళాలి. అక్కడ కూడా స్టేషనులోని ఫుట్ బ్రిడ్జికి బస్ స్టాండులోని ఫుట్ బ్రిడ్జిని కలపవచ్చు.

  ఓహ్ మై రూట్స్ గారు థాంక్స్.

  హరే కృష్ణ గారు, లగేజి ట్రాలీలు పెట్టమన్నది అందుకే.

  సుబ్బారావు గారు, థాంక్స్. మీరు కూడా బ్లాగులో వ్రాయండి.

 6. Bhaskar permalink
  22/06/2009 12:51

  Benz circle lo oka Flyover kattalanna alochana raada Vijayawada MP ki. Adi oka national high way kooda, central funds raavatam kooda kashtam kaadu. Gelipinchina Viajayawada meeda kaasthanna prema undaali.

 7. 02/10/2009 16:57

  This is a very good idea. Both stations are physically very close, but due to the circuitous roads, canals and bridges, it takes 30 minutes to reach one from the other.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: