విషయానికి వెళ్ళండి

అమ్మ కావాలి

24/06/2009

అమ్మ కావాలి.
ఔను నాకు అమ్మ కావాలి.
అమ్మ విలువ ఇప్పుడే బాగా తెలుస్తోంది. ఎవరైనా మనకు దూరమైనప్పుడే కదా వాళ్ళ విలువ తెలిసేది. అందుకు అమ్మ కూడా మినహాయింపు కాదేమో. అమ్మ ఇక లేదు అని నమ్మడానికి చాలా బాధగా ఉంది. ఇన్నాళ్ళూ అటువంటి ఊహనే భరించలేని నేను ఇప్పుడు ఆ నిజాన్ని ఎలా జీర్ణించుకోవాలి? అందుకే ఈ ప్రపంచంలోని మాతృమూర్తులందరిని అర్థిస్తున్నాను. మీలో ఎవరైనా నాకు మాతృప్రేమని అందించగలరా? ఎందుకంటే అమ్మ లేకుండా నేనుండలేను. దయచేసి మీలో ఎవరైనా నన్ను మీ బిడ్డగా స్వీకరించవలసినదిగా వేడుకొంటున్నాను.

మాకు అస్థిత్వాన్ని ప్రసాదించి, మమ్మలని ప్రయోజకులని చేసి, తాను అనంతలోకాలకు చేరుకుంది మా అమ్మ.
ఎక్కడో గోదావరి తీరంలో ఆమె, ఇక్కడ యమునా తీరంలో నేను.
కనీసం అమ్మని కడసారి చూసే అవకాశం కూడా నాకు లేదు.
అయినా పరవాలేదు. అమ్మ నిర్జీవ రూపం నా మనస్సులో ఆమె చివరి ఙాపకంగా ఉండటం నేను భరించలేను. నా మనస్సులో ఆమె రూపం ఎల్లప్పుడూ సజీవంగానే ఉండాలి. ఇంకా ఆమె ఎక్కడో దూరంగా ఉందని, ఎప్పుడో సెలవుల్లో తనను నేను కలుస్తానని ఇన్నాళ్ళూ అనుకుంటున్నట్లుగానే ఇకముందు కూడా అనుకుంటాను. అయినా ఏదో ఒకనాటికి నేను కూడా అమ్మని కలవాలిసిందే కదా.

మా అమ్మ ప్రపంచంలోని అందరి తల్లులకంటే గొప్పదని నేను చెప్పను. కాని అందరి అమ్మలలానే గొప్పదని చెప్పగలను. ఎందుకంటే అందరి తల్లులలానే ఆమె మమ్మలని ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది. ఎన్నీ సమస్యలున్నా అందరినీ చదివించి ప్రయోజకులను చేసింది. తనకు వీలైనంతలో చాలామందికి సహాయం చేసింది.

అమ్మతో ఎన్ని ఙాపకాలు? అసలు ఎవరికైనా అమ్మతో ఉన్నన్ని మధురమైన ఙాపకాలు మరెవరితోనైనా ఉంటాయా? ఇప్పుడు ఆమె ఒకో ఙాపకం ఒకో అశృబిందువై విలపిస్తున్నాను.
కార్తీక మాసంలో తెల్లవారు ఝామునే గోదావరిలో దీపాలు వదలడానికి అమ్మకు తోడుగా వెళ్ళేవాడిని. అమ్మ గుడికి వెళ్ళినా, ఏదైనా ఊరికి వెళ్ళినా నేను ఎప్పుడూ అమ్మకు తోడుగా ఉండేవాడిని. తనకు నేను దూరంగా ఉంటున్నానని ఇంటికి వెళ్ళినప్పుడల్లా నాకు ఇష్టమైన వంటలు చేసేది. చిన్నప్పుడు నాకు ఒంట్లో బాగోలేక నెలరోజులు అసుపత్రిలో ఉంటే నిద్రాహారాలు మాని సేవలుచేసిన తనకు నేనేమి చేయగలిగాను? ఆమె సొంత ఇంటి కలను నిజం చేసేలోపే అమ్మ అకస్మాత్తుగా మమ్మలని విడిచి వెళ్ళిపోయింది.

ఈ దేహం, ఈ జీవం, ఈ ఙానం, ఈ జీవితం అంతా అమ్మ పెట్టిన భిక్షే కదా. అమ్మే కదా మనలని సృష్టించిన బ్రహ్మ. చల్లని అమ్మ ఒడిలో వటపత్రసాయిలా శయనిస్తాము. ఆమె ఇచ్చిన క్షీరామృతాన్ని ఒక జన్మకి సరిపడ అమృతంలా సేవిస్తాము. ఏమిచ్చి అమె ఋణం తీర్చుకోగలం? అయినా కొంతమంది తమ అమ్మానాన్నలని ఎందుకు సరిగా చూసుకోరు? అసలు మనకంటూ ఏదైనా ఉంటే అదంతా అమ్మ, నాన్న, దేవుడు ఇచ్చిందే కదా. మరి వాళ్ళిచ్చినదాంట్లో కొంత వాళ్ళకి ఖర్చు పెట్టడానికి కొంత మంది కొడుకులు, కూతుళ్ళు ఎందుకు అలోచిస్తారు? నిజానికి కొంతయినా ఋణం తీర్చుకోగలిగే అదృష్టం కలిగినందుకు సంతోషించాలి. తమ బిడ్డలు అవిటివాళ్ళయినా, పిచ్చివాళ్ళయినా తల్లిదండ్రులు వాళ్ళని ప్రేమతో పెంచగలిగినప్పుడు ముసలితనంలో తల్లిదండ్రులను పిల్లలు ఎందుకు ఆదరించలేరు? ఈ అదృష్టం అమ్మా, నాన్న ఉన్నంతవరకే కదా. ఆలస్యం చేస్తే ఆ అవకాశం మళ్ళీ దక్కదు. తరువాత మన పిల్లలకే దక్కుతుంది. మనలని ఎంతగానో ప్రేమించి పెద్దచేసిన అమ్మానాన్నలకంటే రేపు మనలని చూస్తారో చూడరో తెలియని పిల్లలమీదే శ్రధ్ధ ఎందుకు ఎక్కువో?

mother

నేపధ్యం: సరిగ్గ పదేళ్ళ కిందట అంటే 24-06-1999 తారీఖున పై ఫొటోలో ఉన్న మా అమ్మగారు శ్రీమతి బోనగిరి పుణ్యవతి గారు ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆ రోజు, ఆ తరువాత కొన్నాళ్ళూ, నా మదిలో చెలరేగిన భావాలూ, నేను డైరీలో వ్రాసుకున్న విషయాలే ఈ టపా. ఆ తరువాత కొన్నాళ్ళకి నేనూ అందరిలానే రొటీనులో పడిపోయాను. అయితే మా అమ్మగారు చనిపోయిన తరువాత నాలో ఒక మార్పు వచ్చింది. అంతకు ముందు నాకు తెలిసినవాళ్ళు ఎవరైనా చనిపోయినా, సినిమాలలో ఎంత విషాదకరమైన సన్నివేశం చూసినా, నా కళ్ళు చెమర్చేవి కావు. మామూలుగానే ఉండేవాడిని. మా అమ్మగారు చనిపోయిన తరువాత మాత్రం కళ్ళు చెమర్చకుండా ఉండలేవు. సాగరసంగమం సినిమాలో కమలహాసన్ తల్లి చనిపోయే దృశ్యం, స్వాతిముత్యం సినిమాలో రాధిక చనిపోయే దృశ్యం చూసినా, గజల్ శ్రీనివాస్ గారు అమ్మ గురించి పాడుతున్నప్పుడు విన్నా కన్నీళ్ళు అపుకోలేను.

ప్రకటనలు
10 వ్యాఖ్యలు leave one →
 1. 24/06/2009 02:27

  మీకు నా సానుభూతి తెలుపుకుంటున్నాను. మా అమ్మగారు కూడా 6సం. క్రితం వెళ్ళిపోయారు, కానీ నాలో సజీవంగా వుండిపోయారు. మానసికంగా మరింత చేరువైపోయారు. అమ్మని అందరిలో దర్శించగలగటం ఆమె మీలో కలిగించిన వ్యక్తిత్వం.

 2. 24/06/2009 04:16

  sir
  amma anede vaka madhura anubhoothi adi feel aayee vari ki matame telusthunde. varu doorami nappodo kani varu dooram ga vunnapudo kani vari viluva anantham.

 3. neeharika permalink
  24/06/2009 05:04

  అమ్మని అందరిలో దర్శిస్తున్నారంటే మీ దగ్గర అమ్మ ఉన్నట్లే. మీ జీవితం లో ఆమె లేని లోటు కన్పించకూడదని కోరుకుంటున్నాను.

 4. చిలమకూరు విజయమోహన్ permalink
  24/06/2009 10:53

  ‘అమ్మ’కు నివాళులర్పిస్తున్నా.

 5. 25/06/2009 07:44

  పెదవే పలికే మాటల్లోని తీయని మాటే అమ్మ.. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ‘అమ్మ’ గారికి నివాళులు

 6. bonagiri permalink
  26/06/2009 04:00

  ఉష గారు, రమేష్ బాబు గారు, నీహారిక గారు, విజయ మోహన్ గారు, రమణి గారు,
  అందరికీ కృతఙతలు.

 7. 09/07/2009 02:40

  మీ మదిలో అమ్మ ఎప్పుడూ సజీవంగా గూడుకట్టుకొని సదా మిమ్మల రక్షిస్తుంది.అమ్మ ఆత్మకు శాంతి కలగలాని ప్రార్థిస్తూ..

 8. 22/07/2009 00:27

  Amma mana manasulo eppudu sajivamgane untundhi . Ammanu thaluchukuntene manaku odharpu labhistundhi. Ee prapancham lo evaru sasvatham kadhu. Kani amma prema nithya noothanamai manaku naithika balanni isthundhi,mana jeevithanni sajavuga nadipisthundhi.
  Manamuu pedhavallamayyam jevithamloni aatupotluku chelinchakunda nibbaranni alavatuchesukovali appudu samasyalu mabbulu laga vidipothai,manasu thelika avuthundhi.

  – ASEESULATHO MEE AKKA DEVI.

 9. ajjarapu satya narayana permalink
  20/08/2009 21:08

  neenu eppude nee blogloni AMMA KAVAALI chadivanu. adi nannu chaala kadilinchindi.Iam sorry neenu chaala latega neeku naa santapam chebutunnaanu. nee bhavaluto neenu eekibhavistunnanu.Immediatega neenu respond kaaraavalanukoni raastunna.tappulunu mannichu.acha telugulo mariyu englishlo type neerchukoni raastanu.

 10. B.Rama rao permalink
  03/09/2009 21:25

  Amma antene Devudu.Amma runamu theerchukolenidi.Matru Devo Bhava annru.Thanuvu nitturu thallithandrulu,yemi ichina theerunu vari runamu.Manamu cheyagaliginadi chetanaina sahayamu cheyatame.Amma asayalanu nijamu cheyali.Ee lokamulo yevaru saswathamu kadu.Brathikinantha varaku andaramu kalisi undamu.andarilonu aa bhagavanthuni darsiddamu.Prema ye manavulaku (ante manasunna varu)paramavadhi. Ye ye janmala lo mana sambandalu yemito manaku teliyadu. Ee janmalo manavulamu andaramu vakariki marokaru sayamu chesukondamu. Sarve jana sukhino bhavanthu.Every one should try for Brahma Jnanamu.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: