విషయానికి వెళ్ళండి

ఒక చిన్న ప్రయోగం

27/07/2009

మన దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళి బతికినా కరెంటు కోత తప్పదు.
కరెంటు పోయినప్పుడు చదువుకునే పిల్లలకు ఇంకా ఇబ్బంది.
గుడ్డి దీపాల వెలుగులో చదవనూలేరు, మాననూలేరు.
రీచార్జబుల్ లాంతరు ఉన్నా, దాని వెలుగు అంతంత మాత్రమే.
మా అమ్మాయి బాధలు చూసి నాకీ చిన్న ఐడియా వచ్చింది.
మా ఇంట్లో ఎప్పుడో కొన్న డెస్క్ టాప్ కంప్యూటర్ ఉంది.
దానికి యు పి ఎస్ కూడా ఉంది.
లాప్ టాప్ వచ్చాక డెస్క్ టాప్ పెద్దగా వాడింది లేదు.
నేను ఒక టేబుల్ లాంప్, దానికి 20 వాట్ల సి ఎఫ్ ఎల్ బల్బు కొన్నాను.
ఈ టేబుల్ లాంపుని యు పి ఎస్ కి కనెక్ట్ చేసాను.
ట్యూబ్ లైటు కన్నా ఎక్కువ వెలుగు వచ్చింది.
యు పి ఎస్ ని అప్పుడప్పుడు చార్జ్ చేసుకుంటే,
కరెంటు పోయిన గంటా, గంటన్నరసేపు ఇబ్బంది లేకుండా చదువుకోవచ్చు.
రీచార్జబుల్ లాంతరు వంటగదిలో ఉపయోగించుకోవచ్చు.
ఎలా ఉందండీ ఈ చిన్న ప్రయోగం?
మీలో ఎవరైనా ఇప్పటికే ఈ విధంగా చేసి ఉండవచ్చుననుకొంటున్నాను.

6 వ్యాఖ్యలు leave one →
 1. 28/07/2009 17:38

  bagundi mee idea. tenth class exams appudu ilantide okati maa uncle chesi pettaru maa intlo. tarvata chandrababu punyama ani hyd lo current kota ettesaru.

  naaku assalu idea leedu kaani india lo ooo chinna solar power generator enta autundi meekemaina telusa? munde cehptunna naaku teleekunda adugutunna.

 2. 29/07/2009 23:26

  super.
  You could also invest in a small solar lantern, available in your local NEDCAP shop.

 3. bonagiri permalink
  30/07/2009 10:09

  శశాంక్, థాంక్స్. నాకు కూడా సౌరశక్తి మీద ఆసక్తి ఉంది కాని ఇంకా స్టడీ చేయాలి.
  కొత్తపాళీ గారి సలహా పాటించండి.
  కొత్తపాళీ గారు, ధన్యవాదాలు.

 4. Mohana permalink
  28/09/2009 14:18

  very good idea.

 5. 18/10/2009 16:06

  భోనగిరిగారూ… మీ ప్రయోగానికి అభినందనలు,
  దీపావళి శుభాకాంక్షలు మీకూ ,మీ కుటుంబ సభ్యులందరికున్నూ .
  నామీదా నా బ్లాగు మీదా చాలా రోజులుగా సీతకన్నేశారు. చదపురుగుల తరువాత నా వంకే తిరిగి చూడ లేదు..
  మీరు చెసిన ప్రయోగం పై చర్చనాకు ఎంతో యిష్టమైనది.
  మీ ప్రయోగం బాగుంది. సాంప్రదాయేతర విద్యుత్ వుత్పాదనలో సోలార్ ఎనర్జీ నిరంతరాయమైనది,సురక్షితమైనదీ, అనంతమైనదీనూ.
  యువత ముఖ్యంగా యువ శాస్త్రవేత్తలు,యువ పారిశ్రామిక వేత్తలు, స్పందించి, సోలార్ ఎనెర్జీ విషయంలో సాంకేతిక వనరులు ,సమచేకూర్చే దిశగా , ప్రభుత్వం పై వత్తిడి తేవాలి. ప్రతియింటా సోలారు ఎనెర్జీ వినియోగం పెరిగితే పవర్ గ్రిడ్లపై వత్తిడి తగ్గి ,పవర్ కట్లు తగ్గుతాయి .యిది ప్రభుత్వానికే వెసులుబాటు. యేరోజుకైనా ప్రపంచం మొత్తం డీ సెంట్రలైజెడ్ మెధడ్ లో సోలార్ ఎనర్జీని వినియోగించుకోవలసిందే.
  ఆ రంగంలో విద్యుదుత్పత్తి,…..ఎవరంతకు వారే వుత్పాదకులు,. కన్జ్యూమర్లున్నూ. తదనుగుణంగా ప్రభుత్వం సరయిన సాంకేతిక వనరులు కల్పించి ప్రతి యింటికీ ఆర్ధిక సాంకేతిక ప్రోత్సాహాలనందిస్తె, ప్రభుత్వం క్రొత్త విద్యుథ్ ప్రాజెక్టులు పై మరింతగా వెచ్చించ వలసిన అవసరం సగానికి సగం తగ్గుతుంది. ఆ మిగిలిన మూల ధనాన్ని యీ దిశగా మళ్ళించి సోలార్ ఎనెర్జీ ఆలోచనకు జవసత్వాలు యివ్వవలిసిన అవసరం ప్రభుత్వం పై ఎంతయినా వుంది.
  శ్రేయొభిలాషి…..నూతక్కి రాఘవేంద్ర రావు.

 6. bonagiri permalink
  19/10/2009 12:08

  నూతక్కి రాఘవేంద్ర రావు గారూ మీ అభిమానానికి కృతజ్ఞతలు.
  సౌరశక్తి గురించి బాగా చెప్పారు. ఇంకా వివరంగా ఒక టపా వ్రాయవలసిందిగా కొరుతున్నాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: