విషయానికి వెళ్ళండి

గాంధీ మార్గం

02/10/2009

మానవజాతి చరిత్రలోని వేల కోట్లమంది మనుషుల్లో ప్రపంచంలోనే ఎక్కువమందికి తెలిసిన వ్యక్తి ఎవరు అంటే బహుశా గాంధీయే కావచ్చు.

మన దేశాన్నే కాకుండా ప్రపంచాన్నంతా అంతగా ప్రభావితం చేసిన మహానుభావుడాయన. అంత నిరాడంబర జీవితాన్ని ఈ నాటి నాయకులు, అధికారులూ కనీసం ఊహించగలరా?

ఊహతెలిసినప్పటినుండి మనం విన్న, చదివిన విషయాల వల్ల మనకి మహాత్ముని పట్ల గౌరవభావం, భక్తి కలిగాయి. నా చిన్నప్పుడు అయిదో తరగతిలో అనుకుంటా ఒక పాఠం ఉండేది. అందులో గాంధీ గారు ఏదో పరీక్ష వ్రాస్తున్నప్పుడు ఆయనకి ఒక ప్రశ్నకి సమాధానం తెలియకపోతే పక్కవానివద్ద చూసి వ్రాయమని టీచర్ చెపుతాడు. కాని గాంధీజీ అందుకు ఒప్పుకోడు.

గాంధీజీయే కాదు మరెంతోమంది నిస్వార్ధపరులు, దేశభక్తులు కలిసి ఈ దేశాన్ని బానిస సంకెళ్ళనుండి విముక్తం చేసారు. వీళ్ళంతా దేశానికి అత్యంత అవసరమైన కాలంలో ఒకేసారి ఎలా జన్మించారు? మరిప్పుడు అలాంటి వాళ్ళు ఏమైపోయారు?

అలా గాంధీమార్గంలో నడిచే వాళ్ళు మన సంఘంలో నిర్ణయాత్మక, ఉన్నత స్థానాల్లో ఉన్నప్పుడే మన దేశం గాంధీ పుట్టిన దేశం అని సగర్వంగా చెప్పుకోగలుగుతుంది.

ఆనాడు వినోబా భావే లాంటి మహానుభావులు భూదానోద్యమం చేస్తే, ఈనాటి మన నాయకులు భూకబ్జా ఉద్యమం చేస్తున్నారు.

ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించి ఆ మహానుభావులు నిష్క్రమించారు. మనకి రాజకీయ స్వాతంత్రం వచ్చింది కాని ఆర్ధిక స్వాతంత్రం అందరికీ రాలేదు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళయినా, మనకున్న వనరులని సద్వినియోగం చేసుకుని దేశాన్ని వేగంగా అభివృధ్ధి చేసేలా మన నాయకులు పాలించట్లేదు.

నా చిన్నప్పటినుంచి అంటే పాతికేళ్ళనుంచి ఒకే మాట వింటున్నాను. మనది ‘అభివృధ్ధి చెందుతున్న దేశం’ అని. ఇంకా ఎన్నాళ్ళు మనం అభివృధ్ధి చెందుతున్న దేశంగానే ఉంటాం? ఎప్పటికీ అభివృధ్ధి చెందిన దేశం అనిపించుకోమా?

మనం గాంధీజీని, ఆయన మార్గాన్ని నిజంగానే గౌరవిస్తున్నామా? మన రాజకీయ నాయకులు ఆయన పేరు చెప్పుకుని విచ్చలవిడిగా అధికారం చెలాయిస్తున్నారు. మరొవైపు కొంతమంది కుహనా మేధావులు గాంధీజీ జీవితంలోని చిన్న చిన్న తప్పులు ఎత్తి చూపుతూ ఆయనని కించపరుస్తున్నారు. అసలు ఈ ప్రపంచంలో గాంధీజీని విమర్శించే అర్హత ఎంతమందికి ఉంది? పురాణాల్లో దేవుళ్ళే తప్పులు చేసారు. అయినా వాళ్ళని మనం పూజించట్లేదా? మానవమాత్రుడు గాంధీజీ కూడా కొన్ని తప్పులు చేసి ఉండచ్చు. అయినా ఆయన తప్పులు ఎత్తిచూపడం కంటే ఆ మహాత్ముని గొప్పతనాన్ని ప్రచారం చేస్తే భావి తరాలకు కూడా ఒక ఆదర్శమూర్తి ఉంటాడు.

సబ్ కో సన్మతి దే భగవాన్.

2 వ్యాఖ్యలు leave one →
  1. 02/10/2009 16:55

    very nice

  2. 25/10/2009 17:48

    very very good……

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: