Skip to content

రైల్ నీరు

08/11/2009

ఇటీవల మన భారతీయ రైల్వేల యొక్క పాసింజర్స్ అమినిటీస్ కమిటీ వాళ్ళు ప్రయాణికులకు సరఫరా చేసే రైల్ నీరు అంటే తాగు నీరు బాటిల్ 5 రూపాయలకే ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం 10 లేదా 12 రూపాయలకు దొరుకుతున్న బాటిల్ ఇకముందు 5 రూపాయలకే దొరకడం శుభవార్తే. కాని వేల కోట్ల రూపాయలు నిల్వలు ఉన్నాయని చెపుతున్న రైల్వే వారు సామాన్య ప్రయాణికులకు కనీసం మంచినీటిని కూడా ఉచితంగా ఇవ్వలేరా?

ఇప్పుడు కొన్ని రైల్వే స్టేషన్లలో వాటర్ ప్లాంట్లు పెట్టి తక్కువ ధరకు మంచినీటిని రీఫిల్ చేస్తున్నారు. ఈ విధంగా ఇచ్చే తాగునీటిని రైల్వే వారు ఉచితంగా ఇవ్వవచ్చుకదా! ఉచితంగా ఇస్తే అందరూ ఈ నీటినే ఉపయోగిస్తారు. ఇలా రీఫిల్ చేయడం వల్ల కోట్లాది కొత్త ప్లాస్టిక్ బాటిళ్ళ వినియోగం అరికట్టి పర్యావరణానికి మేలు చేయవచ్చు.

వేసవికాలంలో ఇంచుమించు అన్ని దూరప్రాంత రైళ్ళ లోను సామాన్య ప్రయాణికులు ఏదైనా స్టేషను వచ్చినపుడల్లా కిందకు దిగి మంచినీటి కోసం ప్లాట్ ఫారం మీద పరుగులు తీస్తూ ఉంటారు. ఈ హడావిడిలో కొంతమందికి రైలు తిరిగి ఎక్కడం కూడా కష్టం అవుతూ ఉంటుంది.

ఈ ప్రయాస తగ్గించడానికి అన్ని ట్రైనుల్లోని పాంట్రీ కార్లలో డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు (ప్యూరిఫైరు / కూలరు) ఏర్పాటు చేసి మంచినీరు ఉచితంగా ఇస్తే ప్రయాణికులు మంచినీటికోసం రైలు దిగే అవసరం ఉండదు.

ఎన్నో వేలకోట్ల రూపాయల బడ్జెట్ ఉండే రైల్వేలకి ఈ తాగునీటి ఏర్పాటు పెద్ద ఖర్చేమీ కాదు. ప్రయాణికుల ఆరోగ్యం పాడవకుండా ఉండడమే కాకుండా కోట్లాది ప్లాస్టిక్ బాటిళ్ళ వినియోగం తగ్గడంవల్ల దేశ పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.

ప్రకటనలు
One Comment leave one →
  1. alapati ramesh babu permalink
    08/11/2009 18:41

    no minimum rate is essential. if any this service given by irtc authorties public can’t use properley and one more thing maintaince cahrges againest these plan become burden to railway. so minimum rate is essential

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: