Skip to content

డిసెంబరు 26

27/12/2009

డిసెంబరు 26 గురించి చెప్పమంటే ఇప్పటి తరం వాళ్ళు సునామి వచ్చిన రోజు అనో, బాక్సింగ్ డే అనో చెపుతారు. కాని ఇరవయ్యొక్కేళ్ళ క్రితం అంటే 1988 లో విజయవాడలో ఉన్న వాళ్ళని అడిగితే విజయవాడకి అదొక బ్లాక్ డే అని చెపుతారు. ఒక్క విజయవాడే కాదు పక్కనున్న జిల్లాలన్ని ఆ రొజు, తరువాత కొన్ని రోజులూ, కనీ వినీ ఎరుగని విధ్వంస దృశ్యాలు చూసాయి.

అంతకుముందు కర్ఫ్యూ అంటే హైదరాబాదులో పాతబస్తీలోనే అనుకునే నేను ఊహ తెలిసాకా మొదటిసారి కర్ఫ్యూ అంటే ఏమిటో చూసాను. ఎంతో ప్రశాంతంగా ఉండే మా గోదావరి జిల్లాలు ఈసారి ప్రకృతికి కాకుండా మనిషికి భయపడ్డాయి.

నాకు ఇప్పుడు ఆ సంఘటనలు గుర్తురావడానికి కారణం ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకాండే.

అప్పుడు నేను విజయవాడలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. వన్ టౌనులోని ఇరుకుసందుల్లో ఉన్న మా అన్నయ్య ఇంట్లో ఉండేవాడిని. ఆరొజు ఉదయం రోజూలానే కాలేజీకి వెళ్ళడానికి తయారవుతుంటే మెయిన్ రోడ్డులో ఏదో గొడవలు అవుతున్నాయని చెప్పారు.

అప్పుడు ఇప్పటిలా 24 గంటల వార్తా చానల్సు లేవు. దూరదర్శన్ మాత్రమే ఉండేది.

సరే ఏమిటో చూద్దామని నేను మెయిన్ రోడ్డు మీదకు వచ్చాను. అప్పుడు తెలిసింది నగరం లో ప్రముఖ నేత, ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యే తెల్లవారుఝామున హత్య చేయబడ్డాడని. మెయిన్ రోడ్డులో ఉన్న చిన్న మార్కెట్ దగ్గర అధికార పార్టీకి చెందిన జెండా స్థంభం ఉంది. కొంతమంది ఆందోళనకారులు ఆ జెండాని పీకేసి, స్థంభాన్ని, దిమ్మని ధ్వంసం చేసారు.

నగరంలో సినిమాహాళ్ళు భగ్గుమన్నాయి. షాపులు లూటీ అయ్యాయి.

ఇంటికి వచ్చి మేడమీదకు వెళ్ళి చూస్తే ఎటు చూసినా పొగలే కనపడుతున్నాయి. మేడమీదకు వచ్చిన వాళ్ళలో మెయిన్ రోడ్డులోని మార్కెట్టులో చిన్న గంప పెట్టుకుని కూరగాయలు అమ్ముకునే ఒక ముసలామె కూడా ఉంది. ఆమె చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి.

“వాళ్ళూ, వాళ్ళూ బాగానే ఉంటారు. కూరగాయలు అమ్ముకోకపోతే నాకు రోజు ఎలా గడుస్తుంది? ఇప్పుడు అక్కడ జెండా స్థంభం కూలగొట్టారు. ఏ పార్టీది అయినా మళ్ళీ అది కట్టడానికి నేను కూడా 3 రూపాయలు చందా ఇవ్వాలి. ఆ డబ్బులు ఎక్కడినుంచి తేవాలి?”

ఇదే మాటలు ఇప్పుడు కూడా ఎంతొమంది అనుకుంటూ ఉంటారు కదూ.

ఈ విధ్వంసం ఆగేది ఎప్పుడో?

రాజకీయ చదరంగంలో పావులు ఎప్పుడూ ప్రజలే. వాళ్ళు ఎప్పుడూ గెలవరు.

గెలిచేది, ఓడేది ఆట ఆడే నాయకులే.

ప్రకటనలు
4 వ్యాఖ్యలు leave one →
 1. 27/12/2009 21:28

  ఆ రోజులు నాకు గుర్తే ఎందుకంటే మా బజార్ లోనే సదరు నాయకుల ఇళ్ళుఉండేవి మా వీధిలో చాల మంది చాలాకాలం కనబడలేదు .అధికార పార్టీ ఆఫీసు కూడా వుండేది. రెండు మూడు నెలల క్రితం హత్య కాబడ్డ నాయకుడి ఇల్లూ వుండేది ,అప్పట్లో అతను ఒక స్కూల్ నడుపుతుండేవాడు అప్రకటిత కర్ఫ్యూ ఏర్పడింది చాల రోజులు .అప్పటినుండే రాజకీయాల్ని ఆసక్తిగా గమనించడం మొదలెట్టాను .

 2. 28/12/2009 09:57

  అవును. నాకు కూడా గుర్తే. అలాంటి విధ్వంసాల్ని మర్చిపోదామన్నా మర్చిపోలేము.
  కల్పనారెంటాల

 3. 26/04/2013 11:41

  రంగా హత్యానంతరం జరిగినది కుల కల్లోలం. మామూలుగా మతకల్లోలాకు నిలయమైన హైదరాబాదుకు భిన్నంగా, విజయవాడలో కుల కల్లోలం జరిగింది. రెండు కులాల మధ్య విపరీతమైన పోటీ, అసూయా ద్వేషాల మూలంగా ఈ గొడవ జరిగింది. కోట్ల రూపాయల విలువైన వ్యాపారాలు నాశనమైపొయ్యాయి. బాంకులు కూడా తగలపెట్టారు. అలంకార్ థియేటర్ పూర్తిగా కూలగొట్టారు. అదే థియేటర్‌ను 1966లో విశాఖ ఉక్కు ఉద్యమం సందర్భంగానూ (హాలులోంచి పోలీసులు కాల్పులు చేశారు అందుకని) 1973 ప్రత్యేక ఆంధ్ర ఉద్యమ సందర్భంలోనూ అప్పుడు కూడా ఇదే హాలు వారు పోలీసులకు సహకరించారని, ఆందోళనకారులు ధ్వంసం చేశారు. 1988 లో జరిగిన విధ్వంసకాండలో (ఈ హాలు యజమానులు వేరే కులం వారుట అందుకని) థియేటర్ ను పూర్తిగా కూలగొట్టేశారు. ఇప్పుడు అదే చోటులో పెద్ద వ్యాపార కూడలి ఉంది కాని, అలంకార్ థియేటర్ ఉన్నప్పటి కళ ఆ కూడలికి ఇప్పుడు లేదు.

  మా ఇంటి దగ్గర (సత్యనారాయణపురం), ఒక చిన్న బడ్డీకొట్టు పెట్టుకుని పైకి వచ్చిన అప్పారావు అనే అతను (రంగా కులం వాడే మరి), అతను తెలుగు దేశంలో ఉన్నాడని అతని కొట్టు పూర్తిగా ధ్వంసం చేసి, పాక్షికంగా తగులపెట్టి అందులో ఉన్న వస్తువులు అన్నీ ఎత్తుకుపొయ్యారు. ఎవ్వరో దొంగలు, రయటర్స్ కాదు. సామన్య గృహిణులు, మామూలు మధ్యతరగతి వ్యక్తులు కూడా.

  అవకాశం, పట్టుబడమన్న ఒక ధీమా మనిషి చేత ఎంతటి వెధవ పనైనా చేయిస్తుంది అని మరొకసారి బాధాపూర్వకంగా అనుకోవలిసి వచ్చింది.

 4. 28/12/2015 13:27

  మొదట్లో రెడ్డి,కమ్మ కులాలు పోటీ పదేవి,కాపు కులం కూడా కొత్తగా రంగంలోకి దిగింది.

  మొదట్లో గూండాలు తమ రౌదీఇజానికి రంజిని పెంచుకోవడానికి చేసే యుధ్ధాలుగా ఉన్ననతకాలం ప్రమాదం తక్కువగానే ఉండేది. వాళ్ళు రౌదీలుగా ఉన్నంత వరకూ వాళ్ళలో వాళు కొట్టుకు చచ్చేవాళ్ళు.కానీ రాజకీయం నేర్చుకుని అందులోకి కులాన్ని తీసుకొచ్చేసరికి పై స్థాయిలో ఉన్నవాళ్ళు బాగానే ఉంటున్నారు,మధ్యలో వాళ్ళు చస్తున్నారు.

  చచ్చేవాళ్ళు చచ్చాక తెరచాటున అటువైపువాళ్ళూ ఇటువైపువాళ్ళూ తీరిగ్గా వాటాలు పంచుకుంటూ ఉంటే జనం ఎక్స్గ్రేషియాల కోసం యేడ్చే యేడుపుల్లో మునిగి పోతున్నారు.

  అసలు రహస్యం తెలియాల్సిన వాళ్లకి తెలిసేవరకూ అవి ఆగవు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: