ALL HAPPIES పరిష్కారం ?
01/01/2010
ఒకప్పుడు
“తెలుగుజాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది” అని అన్న ఎన్ టి ఆర్ అన్నాడు.
ఇప్పుడు
“తెగులు జాతి మనది నిండుగ మునుగు జాతి మనది” అన్నట్టు అయ్యింది మన పరిస్థితి.
“కలిసి ఉంటే కలదు సుఖం” కాని విడాకుల లాయరు వీరప్ప మొయిలీ సౌజన్యంతో చిదంబరం పెట్టిన చిచ్చుతో రాష్ట్రం విడిపోయే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. విడిపోయే పరిస్థితే వస్తే అన్ని ప్రాంతాల సమస్యలను ఒకేసారి పరిష్కరించాలి.
1. గ్రేటర్ హైదరాబాదు ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలి. దీన్ని చంఢీగఢ్ లా కేంద్రపాలిత ప్రాంతంలా కాకుండా ఢిల్లీ లా సిటీ స్టేట్ చెయ్యాలి. దీనికి ముఖ్యమంత్రిగా చంద్ర బాబు కరక్టు.
2. మిగిలిన తెలంగాణా ప్రాంతాన్ని తెలంగాణా రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలి. దీనికి వరంగల్ రాజధాని, ముఖ్యమంత్రి కె సి ఆర్.
3. రాయలసీమతో పాటు వీలైతే బళ్ళారి, కోలార్ ని కూడా కలిపి రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చెయ్యవచ్చు. దీనికి కర్నూలు రాజధాని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. (బళ్ళారి పోతే యెడ్యురప్ప హేపీ..)
4. కోస్తా ఆంధ్రని ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యవచ్చు. దీనికి రాజధాని విజయవాడ, ముఖ్యమంత్రిగా ప్రస్తుతానికి రోశయ్య. (చిరంజీవి రాజకీయాలలో ఇంకా ఓనమాలు చదువుకుంటున్నాడు కాబట్టి. ఆయన కనీసం అయిదో తరగతి పాసయితే అప్పుడు అలోచించవచ్చు.)
5. ఇది కాక తిరుమల-తిరుపతి పుణ్య క్షేత్రాన్ని వాటికన్ లా స్వతంత్ర దేశంలా అవసరంలేదు కాని కేంద్రపాలిత “హిందూ” ప్రాంతంగా ప్రకటించాలి. తిరుమలని ఎలా అభివృధ్ధి చేయవచ్చో నా గత టపా తిరుమల ని ముఖ్య పుట లో చూడండి.
షరా. మిగతా రాజధానులలో అన్ని సదుపాయాలు నిర్మించేవరకు, మూడు నాలుగేళ్ళు అందరికి హైదరాబాదు రాజధానిగా ఉండవచ్చు.
15 వ్యాఖ్యలు
leave one →
పరిష్కారాలు బాగున్నాయండి. తిరుమలను మా రాయలసీమకు దూరం చెయ్యడమే నాకు నచ్చలేదు. 😦 తిరుమల నుంచి శ్రీశైలం వరకు ఉన్నదంతా “లక్ష్మీకొండ” అన్న విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. అదంతా ఒకటే కొండ. మమ్మల్ని ఆదుకునేది ఆ “లక్ష్మీకొండ” నే అని మా ప్రగాఢ నమ్మకం.
>>”బళ్ళారి పోతే యెడ్యురప్ప హేపీ” 😉
బళ్ళారి వస్తే మేము కూడా ఫుల్లు హ్యాపీ. మా ప్రాంతంలో నీటి కష్టాలు తొలగిపోయి, మాది మళ్ళీ “రతనాల సీమ” అవుతుంది. 😛 😛 😛
ప్రాంతాల్ని భాషా పరంగా విడగొట్టటం కన్నా, పరిపాలనా సౌలభ్య పరంగా విడగొట్టటం ఉత్తమం. అంటే కావేరి లాంటి జలవివాదాలు రాకుండా, అందరికీ అన్నీ సక్రమంగా ఉండే విధంగా అన్నమాట. దురదృష్టవశాత్తూ, ప్రస్తుతానికి మనం ఆ స్టేజిని దాటిపోయాం. 😦 😦 😦
బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు,
ఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని, మనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ మీ కోసం భద్రాచల నరసింహ క్యాలండర్ -2010
ఈ కింది లింకులో
http://bhadrasimha.blogspot.com/2010/01/2010.html
ధన్యవాదములు
– భద్రసింహ
బేసిగ్గా
కుక్కలు చింపిన విస్తరి చెయ్యాలంటారు.
chavakiran gaaru – okka saari telagana iste kukkalu chimpine vistareee..
అలాగే హైద్రాబాద్ ఓల్డ్ సిటీని కేంద్రపాలిత ముస్లిం ప్రాంతంగా, ఇంకేదన్నా కేంద్రపాలిత క్రిస్టియన్ ప్రాంతంగా, ఇంకా అలా అలా అన్ని మతాలకు ప్రాంతాలు కెటాయిస్తే ఇంకా అన్ని సమస్యలు ఒక్కసారే తీరతాయేమో.
పైన అన్నిటిలో నాకు నాచ్చింది
“మిగిలిన తెలంగాణా ప్రాంతాన్ని తెలంగాణా రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలి. దీనికి వరంగల్ రాజధాని, ముఖ్యమంత్రి కె సి ఆర్.” ఈ పాయంట్. kcr మాత్రమే తెలంగణా రాష్ట్రాన్ని, తెలంగాణా ప్రజలకు సరిపోయిన నాయకుడు. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆయన హ్యాపీ, వాళ్లూ హ్యాపీ.
ఇక మీరు చెప్పినదానికి పొడిగించటానికి, ఏటూ కుక్కలచింపిన ఇస్తరి చేస్తున్నప్పుడు, గంజాం లాంటి ఒరిస్సా జిల్లాలలో మనతో కలుస్తాం అనే ప్రాంతాలను కలపటం అవసరమయితే ఉత్తరాంద్ర (గంజాం, చీకాకులం, ఇజియనగరం,విసాఖపట్టణాలతో ఓ రాష్ట్రం ఉత్తరాంద్ర అని పెడతం తప్పేలేదు)
దానికి ముఖ్యమంత్రి గా ఎప్పటినుండొ తువ్వాలు ఏసుకొని తిరుగుతున్న సత్తిబాబు సరిపోతాడు. ఎటూ కుటుంబం అంతా M.P. లో, MLA లో, ఎకంగా గా రాష్ట్రం ఇచ్చి, ఆయన్ను ముఖ్యమంత్రి గా పంపిస్తే, పాపం ఉత్తరాంధ్ర వాళ్ల చిరకాల కోరిక తీరినట్లు ఉంటుంది. అన్ని M.P. లు, MLA లతోపాటు వాళ్ల సత్తిబాబు ముఖ్యమంత్రి అయ్యి “డబ్బులు పోయినాయి, ఏటి సేత్తాం అంటే” వాళ్లూ ఫుల్ హ్యాపీస్.
ఇక ఖమ్మం లాంటి జిల్లలలో అక్కడి ప్రజలు ఆకాన్షకు తగ్గట్టుగానే ఆయా ప్రాంతాలను, ఆయా రాష్ట్రాలలో (ఆంధ్రా, తెలంగాణా) లలో కలపమంటె గొడవ ఉండదు. (ఉ. దా. మధిర,సత్తుపల్లి లాంటి ప్రాంతాలు ఆంధ్రాలో కలవటానికే ఇష్టపడుతున్నాయి కాబట్టి)
సొ ఫైనల్ గా, మన రాష్ట్రం మొత్తం
1. హైదరాబాద్ స్టెట్
2. తెలంగాణా స్టెట్
3. ఉత్తరాంద్ర స్టెట్
4. ఆంధ్ర స్టెట్
5. రాయలసీమ స్టెట్
6. స్వయం ప్రతిపత్తి ఉన్న, తిరుమలతిరుపతి హిందూ స్టెట్
ఇంకో రెండు ముక్కలు అయితే సుబ్బరంగా ఇటాలియన్ పిజ్జాలో సహజం గా ఉండే 8 ముక్కలు మన ఇటాలియన్ దేవత, మన Itaaliyan of East స్టెట్ ను చేసినట్లు అవుతుంది, ఇంకెవరయినా ఇంకో రెండు ముక్కలు చేయటానికి అవుడియాలు ఇచ్చి పుణ్యం కట్టుకోండి బాబు, అప్పుడు లెక్క తేలతుంది. ప్లీజ్ .
ఇక అప్పులు పంచుకోవటం మాత్రం 1956 నుండి ఏడ ఏడ ఎంత ఎంత ఖర్చు పెట్టారో దానిప్రకారమే సుమా!! అంతే కాని “దున్నేటప్పుడు దూడలలో, మేసేటప్పుడు ఏడ్లలలో” అంటే అస్సలు కుదరదు. ఇక నీటి వాటాలు విడిపోయే రోజున ఉన్న ఆయకట్టు మాత్రం (grandfather rule) అలానే ఉంచి, భవిషత్తు నీళ్లకు వాటాలు సుబ్బరం గా వేసుకోవచ్చు, పైన ఉన్న మారాష్ట్ర, కర్నాటక వాళ్లెమయిన దయచూపి వదిలే అడుగు బొడుగు నీళ్లలో వాటాలు మాత్రం వేసుకోవాల్సిందే (అవి ఎటూ ఎవ్వరూ పట్టించుకోరు భవిష్యత్తులో అని తెలిసినా 🙂 )
ఆరు సూత్రాల ప్రకారం రాష్ట్రంలో ఆరుజోనులు ఏర్పడ్డాయి.కానీ రెవిన్యూ డిపార్ట్ మెంట్ లాంటి కీలక శాఖలకు పోలీసు శాఖలోలాగా జోనల్ ఆఫీసులు ఏర్పడనందున ప్రతి చిన్నపనికీ హైదరాబాదు వెళ్ళాల్సి వస్తోంది.వాస్తవానికి కోస్తా రాయలసీమలవారే దూరాభారాలతో ప్రయాణ ఖర్చు(అనుత్పాదక ఖర్చు) ఎక్కువగా మోస్తున్నారు.హైకోర్టు గుంటూరునుండి తరలిపోయింది .కనీసం యాభై ఏళ్ళకాలంలో బెంచి కూడా ఏర్పాటు చేయలేదు.విజయవాడ,రాజమండ్రి,,తిరుపతి,నంద్యాల,మంచిర్యాల,భద్రాచలం లాంటి కొత్తజిల్లాలు కూడా ఏర్పడలేదు.రాజధాని నగరానికి తరలించి ఒకేచోట పోగుపెట్టిన అభివృద్ధి కేంద్రాలను ఇప్పటికైనా రాష్ట్రంలోని ఆరు జోన్లకూ తరలించాలి.
bagundi
@ నాగప్రసాద్: తిరుపతి విషయంలో సారీ అండి. కాని ఏం చేస్తాం దేవుడికి రాజకీయాలు అంటకూడదని. గత కొన్నేళ్ళుగా చూస్తున్నారుగా, రోజూ వివాదాస్పద వార్తలే.
@ శరత్ కాలం: అంత కోపం ఎందుకండీ, తిరుపతిని వాటికన్ లా చేయాలన్న డిమాండ్ ఎప్పటినుండో ఉంది కదా. పై వివరణ కూడా చూడండి.
@ చావా కిరణ్: విడిపోక తప్పనిసరి పరిస్థుతులలోనే ఇదంతా. కలిసి ఉంటే కలదు సుఖం అన్నాను కదా.
@ శశాంక్, కృష్ణ, రహంతుల్ల, కృష్ణగీత : థాంక్స్.
తిరుమలను వాటికన్ తరహాగా మార్చాలన్న మీ ఆలోచన బాగానే ఉంది. కాని రాజకీయాలలో రాటుతేలిన మనవాళ్ళు అక్కడ కూడా రాజకీయం చేసేస్తారు.
శ్రీవాసుకి గారు, ధన్యవాదాలు.
ముఖ్యపుటలోని తిరుమల వ్యాసం కూడా చదివి మీ అభిప్రాయం చెప్పవలసినదిగా కోరుతున్నాను.
any new posts for us asap.
యానాం ను మనరాష్ట్రం లో కలపాలని కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ చాలా కాలం క్రితమే తీర్మానించింది. అక్కడి ప్రముఖులు మల్లాడి,వాసిరెడ్డి,మాజేస్టి,మొదలైనవారంతా ఒక భాష మాట్లాడే వాళ్ళంతా ఒక రాష్ట్రంగా ఉండటం,లేదా భౌగోళీకంగా సమీప ప్రాంతాలు ఒక రాష్ట్రంగా ఉండటం అనే ఏదో ఒక ప్రాతిపధికను అంగీకరించాలి.