విషయానికి వెళ్ళండి

క్రికెట్ క్రీడా శిఖరం – సచిన్ టెండూల్కర్

25/02/2010

The only person in the country or even in the whole world, who can make a Billion people smile not just once but many times is none other than Sachin Ramesh Tendulkar.

క్రికెట్ ఆటలో ఎవరూ అధిరోహించని శిఖరాలు ఎన్నో ఎక్కిన సచిన్ టెండూల్కర్ ఇంతకాలం ఎందరినో ఊరిస్తూ వస్తున్న వన్ డేలలో డబుల్ సెంచరీని కూడా సాధించి తనకు సాటి మరెవరూ లేరని నిరూపించాడు.

సచిన్ వయసయిపోయింది ఇక సేహ్వాగ్ మాత్రమే డబుల్ సెంచరీ చెయ్యగలడని అనుకున్నారు.

తనలో ఇంకా పవర్ తగ్గలేదని సచిన్ మరో కొత్త రికార్డ్ సృష్టించి చూపాడు.

ఇరవయ్యేళ్ళపాటు ఒక ఆటలో ఉన్నతస్థాయి ప్రతిభ ప్రదర్శించడం అంటే మాటలు కాదు

ఆఫీసుల్లొ కూర్చుని పని చెసేవాళ్ళే ఇరవయ్యేళ్ళ సర్వీసు తరవాత నీరసంగా కనపడతారు.

టెస్ట్ క్రికెట్ లో డాన్ బ్రాడ్ మెన్ గ్రేట్ అయితే వన్ డేలలో సచినే గ్రేట్.

ఎన్ని సెంచరీలు, ఎన్ని అర్థ సెంచరీలు, ఎన్నెన్ని వేల పరుగులు?

ఇవన్నీ మానవమాత్రుడికి సాధ్యమేనా అనిపించే రికార్డులు.

ఇక సచిన్ సాధించవలసింది వరల్ద్ కప్ మాత్రమే.

అది కూడా సంపాదించి ఆ దారిలో మరిన్ని రికార్డులు సృష్టిస్తాడని ఆశిద్దాం.

ఈ సందర్భంలొ 1983 వరల్డ్ కప్ విజేత కపిల్ దేవ్ చేసిన 175 నాటవుట్ గురించి కూడా గుర్తు చేసుకోవాలి.

చేసింది జింబాబ్వేమీదే అయినా అప్పటికి అది చాలా గొప్ప రికార్డు.

సచిన్ ఎన్ని రికార్డులు సాధించినా, ఎన్నిసార్లు భారత్ ని గెలిపించినా కొంతమంది విమర్శకులు మాత్రం సచిన్ ని వదిలిపెట్టడంలేదు.

రికార్డులకోసమే ఆడతాడని, డబ్బుకోసమే ఆడతాడని ఎన్నొ విమర్శలు.

కొంతమంది అయితే క్రికెట్ ఆడడం, చూడడం వృధా అని సెలవిస్తారు.

వీళ్ళంతా తామేదొ మేధావులమని, పత్తిత్తులని అనుకుంటారు.

అతితెలివితేటలు ప్రదర్శించడం మానేసి సామాన్యులలా క్రికెట్ ని ఎంజాయ్ చేస్తే వాళ్ళ జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది.

ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే కోట్లాదిమందిని ఆనందింపచేయగలిగేవాడు సచిన్ ఒక్కడే.

One Comment leave one →
  1. 16/03/2010 04:26

    బోనగిరి గారూ !
    మీకు శ్రీ వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో…

    శిరాకదంబం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: