విషయానికి వెళ్ళండి

మద్య యజ్ఞం

12/06/2010

మన నాయకులకి జలయజ్ఞం బోరుకొట్టిందో లేక అందులో జలం ఇంకిపోయిందో తెలియదు కాని ప్రస్తుతం మద్య యజ్ఞం మొదలుపెట్టారు.
రానున్న రెండేళ్ళ కాలానికి మద్యం వ్యాపారులు ఒక్కో మద్యం దుకాణాన్ని కోట్ల రూపాయలకు పాడుకుని రాష్ట్ర ఖజానాకి వేలకోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తున్నారు.
ఒక్క లోక్ సత్తా మినహా మిగిలినవారెవరూ ఈ తతంగాన్ని పెద్దగా వ్యతిరేఖించిన వార్తలు లేవు.

ఆనాడు ముఖ్యమంత్రి NTR మొండివాడు కాబట్టి కష్టమైనా, నష్టమైనా మద్యనిషేదాన్ని అమలు చేసాడు.
కాని తరువాత వచ్చినవాళ్ళు మద్యం మీద వచ్చే ఆదాయం అవసరమని, మద్యనిషేదం అసాధ్యమని, ప్రవాహానికి గేట్లు ఎత్తేసారు.
అప్పుడు రాష్ట్ర ఆదాయం తక్కువేమో కానీ ఇప్పుడు లక్షకోట్ల బడ్జెట్ ఉంది.
మరి ఇప్పుడు కూడా ఆ నీచ ఆదాయం అవసరమా?
ప్రభుత్వం మద్యనిషేధం అమలుచేయలేకపోయినా, కనీసం మద్యపానాన్ని క్రమంగా నియంత్రించాలి. కాని ప్రోత్సహించేలా సదుపాయాలు కల్పించడం న్యాయం కాదు.
ఎంత కష్టమైనా గుజరాత్ లో మద్యనిషేధాన్ని ఇప్పుడు కూడా అమలు చేస్తున్నారు కదా.
అయినా ఆ రాష్ట్రం మనకంటే ఎంతో అభివృధ్ధి చెందింది.
దేశం అంతా మద్యాన్ని నిషేధిస్తేనే సరిగ్గా అమలు చేయడం సాధ్యం అవుతుంది.

ఒక్కో దుకాణాన్ని అన్నేసి కోట్లకు ఎందుకు తీసుకున్నారంటే కారణం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, రావచ్చుననుకొంటున్న మధ్యంతర ఎన్నికలునట.
అంటే రానున్న ఎన్నికలలో మద్యం ఏరులై పారనుంది. ఓటర్లను నాయకులు మద్యం మత్తులో ముంచుతారు.
ప్రజాస్వామ్యానికి పట్టిన ఈ దౌర్భాగ్యాన్ని అరికట్టాలంటే నేను గత టపాలో వ్రాసినట్టు ఎన్నికల సమయంలో ఒక నెలరోజులైనా తాత్కాలికంగా మద్యాన్ని నిషేధించాలి.  

తాగుడు వలన ఎన్ని నష్టాలున్నాయొ అందరికీ తెలుసు. రోడ్డు ప్రమాదాలు, గృహ హింస ఎక్కువ అవడానికి కారణం తాగుడే.
ఎన్నో పేద కుటుంబాలు ఆర్ధికంగా చితికిపోవడం, తాగుడు వలన రోగాల బారిన పడడం చూస్తున్నాం.
ఒక మందుసీసా లంచానికి ముఖ్యమైన ఫైలు బయటకు తీసుకువచ్చి, కాపీ కూడా ఇచ్చే ఉద్యొగులు ఉన్నారు.
ఎవరూ కూడా తాము కష్టపడి సంపాదించింది దురలవాట్లకు ఖర్చుపెట్టరు. దురలవాట్ల కోసం అడ్డదారులు తొక్కి సంపాదిస్తారు.
అన్ని అవినీతి పనులు,  అసాంఘిక కార్యక్రమాలు ఎలా చేయాలో నిర్ణయించేందుకు వేదికలు మందు పార్టీలే.

అసలు మద్యపానం దురలవాటు అని ప్రభుత్వం ఒప్పుకొన్నప్పుడు దాన్ని నిషేధించడమో, నిరుత్సాహపరచడమో చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా.
నాయకులకి నేను చేసే విజ్ఞప్తి ఒకటే. చట్టసభలలోకి అడుగు పెట్టేముందు ఒకసారి 80లలో వచ్చిన “మార్చండి మన చట్టాలు” సినిమా చూడండి.
 
 
    

 

2 వ్యాఖ్యలు leave one →
 1. 12/06/2010 09:10

  సినిమాలు చూసి నీతులు నేర్చుకుంటారు అనే అనుకుంటున్నారా?

 2. 12/06/2010 12:14

  “చంద్రబాబు ప్రభుత్వం బెల్టు షాపుల ద్వారా పేద ప్రజల రక్త మాంసాలను పీల్చుతోంది”
  “పేదల నోరు పగలదీసి మరీ మద్యం పోస్తున్నారు”.—-2004 లో రోశయ్య.
  “మంచి నీళ్లు దొరకని ప్రాంతంలో కూడా మద్యం దొరికేలా చేశారు.మద్యం విక్రయాలు విచ్చల విడిగా పెరిగిపోయాయి”- 2010 చంద్రబాబు నాయుడు.
  ‘రాష్ట్రంలో ఇంతమంది పేదలు ఉన్నారా? అని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ సందేహిస్తుంటే,’రాష్ట్ర ప్రజల ఆదాయం పెరిగింది,అందుకే మద్యం దుకాణాలకు గిరాకీ అంత భారీగా పెరిగింది అని రాష్ట్ర మంత్రులు అంటున్నారు.
  మద్యం విచ్చలవిడి వినియోగం వల్ల మానవ వనరులు నిర్వీర్యమై ప్రజలు తాగుడుకు బానిసలై సోమరిపోతుల్లా మారిపోతారు.మద్యం మత్తులో నేరస్తులుగా మారతారు.గుజరాత్ లో మద్య నిషే ధం అమలులో ఉన్నా, పారిశ్రామికీకరణ ద్వారా ఆదాయానికి లోటు లేకుండా చూసుకున్నారు.ఇతర రంగాలలో దుబారాను నివారించాలి.మద్యం పనిచేసే స్వభావానికి కష్టపడే మనస్తత్వానికి దూరంగా ప్రజలను నెట్టి వేస్తుంది.తాగుడుతోనే కాలక్షేపం చేస్తారు.భార్యలను పీడించి, వారి సంపాదనను కూడా తమ తాగుడుకే పురుషులు ఖర్చు చేస్తారు. ఫలితంగా సంసారాల్లో చిచ్చురేగి ఒకరినొకరు చంపుకొనే పరిస్థితికి దారి తీస్తుంది.రోడ్డు ప్రమాదాల్లో వేల సంఖ్యలో జనం మరణిస్తున్నారు.ఎక్కడ పడితే అక్కడ మద్యం లభించడం వల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది.ఎన్నో కుటుంబాలకు దిక్కు లేకుండాపోతున్నది.సమాజ హితం దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతమైన పౌర సమాజ నిర్మాణం కోసం మద్యాన్ని నిషేధించాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: