ఇట్లు, మీ గాంధీ.
02/10/2010
నా ప్రియతమ ప్రజలారా, నా జాతిపుత్రులారా,
ఈ రోజు నా జయంతి అని మీరందరూ మొబైల్, ఇంటర్నెట్, ఎఫ్ ఎం రేడియో లాంటి కొత్త కొత్త మాధ్యమాల ద్వారా నన్ను తలుచుకుంటున్నందుకు, నా గురించి తెలుసుకుంటున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది.
కాని నేను మీతో ఇలా మాట్లాడాలనుకోవడానికి మాత్రం కారణం వేరే ఉంది.
రెండురోజులక్రితం జాతి యావత్తు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అయోధ్య వివాదానికి సంబంధించి తీర్పు వెలువడిన సంగతి మీకు తెలుసు.
తీర్పు బయటికి వచ్చిన తరువాత మతకల్లోలాలు జరుగుతాయని దేశమంతా అందరూ భయపడ్డారు.
కాని ఎలాంటి దుస్సంఘటనలు జరుగకుండా అన్ని మతాలవారు ప్రదర్శించిన సంయమనం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
నిజానికి ఈయేటి నా జయంతి నాడు నాకు భారతజాతి ఇచ్చిన అద్భుతమైన నివాళి ఇదేనని నేను భావిస్తున్నాను.
నేడు భారతజాతి ప్రదర్శించిన ఈ పరిణితికీ, స్థితప్రజ్ఞతకి కొత్త తరమే కారణమని అనుకుంటున్నాను.
“ఉన్న సంపదని కొట్టుకునైనా పంచుకుందామనుకునే” రోజులనుండి,
“ఉన్న సంపదని పెంచుకుని పంచుకుందామనే” రోజులకి కొత్త తరం పయనిస్తోంది.
ఇది ఎంతో ప్రగతిశీల దృక్పథం.
అయితే భౌతికమైన సంపదలతోపాటు మానసిక, ఆధ్యాత్మిక, నైతిక సంపదలు కూడా మీకు అవసరమని గుర్తుంచుకోండి.
మరో దశాబ్దానికి ఇప్పుడు మిగిలిన పాత నీరు కూడా కొట్టుకుపోయి పూర్తి నవతరం మన దేశాన్ని కొత్త శిఖరాలకి చేరుస్తుందని ఆశిస్తున్నాను.
“ప్రజాస్వామ్యమనెడి మేడిపండు
పొట్టవిప్పిచూడ రాజకీయనాయకులుండు”
అన్నట్టు తయారయింది మన రాజకీయం.
కాబట్టి మీరు తప్పనిసరిగా వోటు వేసి మన ప్రజాస్వామ్యాన్ని బతికించండి.
వచ్చే యేడాది నాజయంతినాడు మీరు మళ్ళీ నన్ను గుర్తుచేసుకుంటారు కాబట్టి అంతవరకు సెలవు.
సత్యమేవజయతే.
ఇట్లు
మీ గాంధీ.
5 వ్యాఖ్యలు
leave one →
gandhi gaaru cheppinatte undhi
It’s very good. New era is yet to begin. I think the transformation is started.
>>నిజానికి ఈయేటి నా జయంతి నాడు నాకు భారతజాతి ఇచ్చిన అద్భుతమైన నివాళి ఇదేనని నేను భావిస్తున్నాను.
అవును.. నాకూ ఈ విషయం చాలా బాగా అనిపించింది. బావుంది టపా.
గాంధీగారి ఆలోచనలను సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా బాగా చెప్పారు..
సమకాలీన పరిస్థితులను ప్రతిబింబించేలా గాంధీగారి సందేశాన్ని విన్పించారు. థాంక్స్.