Skip to content

“నస”లపూడి కథలు

22/01/2011

ముందుగా ఇలాంటి టైటిల్ పెట్టినందుకు వంశీ గారికి క్షమాపణలు. మంచుపల్లకి నుండి గోపి, గోపిక, గోదావరి వరకు ఇంచుమించు వంశీ సినిమాలన్నీ చూసాను. వంశీ కథలని అంతకంటే ఇష్టంగా చదివాను. వంశీగారిని విమర్శించే స్థాయి నాకు ఎంతమాత్రం లేకున్నా, ఒక అభిమానిగా, ప్రేక్షకుడిగా నా అభిప్రాయం వ్రాస్తున్నాను.

వర్ణన ప్రధానమైన ఈ కథలని టివిలో చూడడానికి అందరిలాగే, నేనూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసాను. కాని డైలీ సీరియల్ అనగానే అనుమానం వచ్చింది ఈ కథలకి ఆ ఫార్మాట్ ఎలా నప్పుతుందా అని. మాల్గుడీ డేస్ లా ఏ ఆదివారమో అవసరమైతే ఒక గంటసేపు వారానికో కథ చూపిస్తే బాగుండేది. ఒకో కథని సాగదీసి వారమంతా చూపించడం వలన నస ఎక్కువయ్యింది. కంటిన్యుటీ దెబ్బతింది.

ఈ సీరియల్ ని బాగా లో బడ్జెట్ లో తీసినట్టు ఉంది. పాఠకులు ఎంతో ఎక్స్ పెక్ట్ చేసి చూడడం వలన నిరాశ కలిగిస్తోంది. కోనసీమ అందాలని బాగానే చూపిస్తున్నా, సంభాషణలకన్నా దృశ్యాలకే ఇంకొంచెం ప్రాధాన్యం ఇస్తే బాగుండేది.

మా చిన్నప్పుడు హైస్కూల్లో తెలుగు పాఠాల్లో ఒకోసారి నాటకాలు కూడా ఉండేవి. అలాంటి పాఠం వచ్చినప్పుడు మా టీచర్ కొంతమంది స్టూడెంట్స్ ని ఎంపిక చేసి ఒక్కొక్కళ్ళకి ఒకో పాత్ర ఇచ్చి నాటకం చదివించేవారు. అందులో కొంతమంది పాత్రలకి న్యాయం చేద్దామని ఎంత ప్రయత్నించినా అది మాత్రం పాఠం అప్పచెప్పినట్లే ఉండేది. అదే విధంగా ఈ సీరియల్లో కొన్ని ప్రధాన పాత్రలు మినహా మిగతా అందరూ డైలాగులు అప్పచెప్పేస్తున్నారు.

వంశీ సినిమాలలో రెగ్యులర్ గా ఉండే కీ. శే. బట్టల సత్యం లాంటి వాళ్ళు లేని లోటు ఈ సీరియల్లో బాగా కనపడుతోంది. ఇంకా కోనసీమ యాస బాగా పండించే ఆహుతి ప్రసాద్ లాంటి వాళ్ళని కూడా తీసుకుంటే బాగుండేది.

ప్రకటనలు
4 వ్యాఖ్యలు leave one →
 1. సుజాత permalink
  22/01/2011 16:39

  ఒక ప్రాంతం ప్రాంతీయత, ఆ నేటివిటీ ప్రధానంగా సాగే సాహిత్యమైనా, దృశ్య కావ్యమైనా ఆ ప్రాంతం మాడలికం లేకపోతే శోభించదు. పసలపూడి కథలు పూర్తిగా గోదావరి జిల్లా సంస్కృతిని నింపుకుని సాగిన కథలు! అవి సాహిత్యంగా చదువుతున్నపుడు ఆ మాండలికాన్ని ఊహించుకుంటూ బాగా ఆనందించాం! కానీ సీరియల్ విషయానికొస్తే ఆ మాండలికాన్ని స్వఛ్ఛంగా అలాగే పలకే ఆర్టిస్టులు వాళ్ళకి దొరకలేదు. ఎంత ప్రయత్నించినా పాత్రధారులు గోదారి యాసతో డైలాగులు చెప్పలేక ఇటు మామూలు భాషలోనూ చెప్పలేక అభాసు చేశారు. ఈ యాసను పలికించగల నటులు సినిమా వాళ్ళలో ఉన్నప్పటికీ వాళ్ళ ధర వీళ్ళకు అందుబాటులో ఉండాలిగా పాపం! నెమలికన్ను బ్లాగులో రావుగారన్నమాట నేను అంగీకరించను.

  ఆంధ్ర ప్రదేశ్ లో అంతా చూస్తారు కాబట్టి యాస తగ్గించడం అనేది ఇలాంటి నేటివిటీ ని ప్రతిబింబించే కథలకు వర్తించదు. అలాటి అడ్జస్ట్ మెంట్స్ చేయాలనుకునే కంటే ఈ కథల్ని సీరియల్ గా తీసుకోడం మానాలి. ఈ కథలకు ఆ యాసే జీవం! అది లేకుండా ఆ కథలే లేవు. ఆ విషయంలో ఈ సీరియల్ పూర్తిగా విఫలమే!

  వాటిని కథలుగానే ఉంచితే బాగుండనే అభిప్రాయం సీరియల్ చూశాక గట్టిగా కలిగింది నాకు!

 2. 29/01/2011 19:57

  సత్యం శంకరమంచి రాసిన అమరావతి కధలు టీవీలో (doora darshan) ప్రసారమైనప్పుడు ఒక్కో కథా ఒకటి లేదా మహా అయితే రెండు ఎపిసోడ్లలో అయిపోయేవి. బడ్జెట్ పరంగా కూడా మరీ పెద్ద ఖర్చుపెట్టేసినట్టు గుర్తులేదు. ఇంకా చెప్పాలంటే పసలపూడి కదల కన్నా తక్కువ బడ్జెట్ లోనే చుట్టేసుంటారు. అయితే దర్శకత్వం కధలో ఆత్మని యధాతధం గా ఉంచడం వలన అవి అంతగా ఆకట్టుకున్నాయేమో. పసలపూడి కధలు చదువుతూ ఉంటే ఆ పాత్రలు కళ్ళముందుకు వచ్చి ఇచ్చిన కిక్కు సీరియల్ గా చూపించినా రావటం లేదంటే బహుశా దర్శకత్వ లోపం , టీఆర్పీ మోజులో కధలు ఎపిసోడ్లకు ఎపిసోడ్లు సాగదీయాలనుకోవడం కారణం కావచ్చు. బహుశా వంశీయే దర్శకత్వం వహించి ఉంటే న్యాయం చేసేవాడేమో.

 3. b v rao permalink
  31/08/2011 15:35

  same opinion

 4. 21/10/2011 21:19

  పాపం, తీసింది వంశీ కాదు కదండీ! మీరు కథలు చదవండి, చాలా బాగుంటాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: