Skip to content

“స్వరబ్రహ్మ” ఎవరు?

28/02/2011

నా దృష్టిలో “స్వరబ్రహ్మ” అంటే కె. వి. మహదేవన్ మాత్రమే. నేను మహదేవన్ గారికి చాలా. చాలా.. వీరాభిమానిని. ఆయన సంగీతం అందించిన సినిమాలు వీలైనంతవరకు చాలా చూసాను. ఒక “శంకరాభరణం” చేసినా, ఒక “అడవి రాముడు” చేసినా ఆయన ప్రతిభకి దగ్గరగా రాగలిగేవాళ్ళు ఇళయరాజా తరువాత ఎవరూ లేరు. ఆనాటి “మూగమనసులు” నుండి మొన్నటి “సిరివెన్నెల” దాకా ఎన్నో ఆణిముత్యాలు అందించారు మామ. మహదేవన్ ఇచ్చినన్ని మ్యూజికల్ హిట్లు మనదేశంలో ఎవరూ ఇచ్చి ఉండరు. విశ్వనాథ్, బాపు లాంటివాళ్ళ సినిమాలు అంత గొప్పగా ఉండడానికి మహదేవన్ సంగీతం ఒక ముఖ్య కారణం.

   
కాని నిన్న “మా” టి వి లో వచ్చిన “శక్తి” ఆడియో రిలీజ్ ఫంక్షన్లో మణిశర్మ గారిని “స్వరబ్రహ్మ” అని పదే పదే సంభోదించడం నాకు నచ్చలేదు. మణిశర్మ గారు ఈ రోజు తెలుగులో నంబర్ ఒన్ సంగీత దర్శకుడు కావచ్చు. ఆయన చాలా హిట్ సినిమాలు చేసి ఉండవచ్చు. అంతమాత్రాన ఆయనని స్వరబ్రహ్మ అనడం నాకు భాద కలిగించింది.

సాలూరి, విశ్వనాథన్, మహదేవన్ లాంటి మహానుభావులతో ఇప్పటి సంగీత దర్శకులని కనీసం పోల్చలేము కూడా. అయినా కీరవాణి తరువాత వచ్చిన వాళ్ళలో ఇళయరాజా బాణీలని రీమిక్స్ చెయ్యడం తప్ప సొంతంగా చేసేవాళ్ళు ఎంతమంది? మనలని మనం గౌరవించుకునేముందు పెద్దవాళ్ళ గౌరవం కూడా కాపాడితే బాగుంటుంది.

   
 
        
 

ప్రకటనలు
7 వ్యాఖ్యలు leave one →
 1. 28/02/2011 18:59

  ఇలాంటి ఫంక్షన్లలో అతిశయోక్తులూ, పొగడ్తలూ మామూలేగా! అంతగా మనసుకు పట్టించుకోకండి. అయినా మహదేవన్ సంగీతం సమకూర్చిన మధుర గీతాలే ఆయన పేరును చిరస్మరణీయంగా ఉంచుతాయి. ఇలాంటివారు ‘బిరుదుల’కూ, భుజకీర్తులకూ అతీతమైన అపార ప్రతిభామూర్తులు.

 2. Snkr permalink
  28/02/2011 19:36

  I agree

 3. 28/02/2011 21:44

  chaalaa saarlu.. nenu ilaage baadha paddaanu. sangeetha vineelakaashamlo.. maama.. aayanaki saati yevaru!!!!! ippati vaari vaachaalathwam ..idhi.. yem cheddaam cheppndi.!?

 4. 01/03/2011 01:33

  మహదేవన్ గారికి స్వరబ్రహ్మ అనే బిరుదు ఉందో లేదో నాకు తెలియదు కానే ఆయన ఆ బిరుదుకి అర్హులే. అజరామరం గా ఉండేదే సంగీతమనుకుంటే మహదేవన్, రమేష్ నాయుడు, సాలూరి (క్షమించాలి ఈయన పేరు నేను ముందు ఉంచాలి కానీ రమేష్ నాయుడు గారి మీద అభిమానంతో వెనక్కు నెట్టేశా) లాంటి వాళ్ళ పాటలతో పోలితే మణి శర్మ ఎన్ని పాటలు సినిమా వెళ్ళిపోయిన కూడా గుర్తుంటాయంటే ఆ సంఖ్య పదుల్లో ఉంటుందేమో. మణిశర్మని స్వర బ్రహ్మ అనడంలో మీ అభిప్రాయం తో ఏకీభవిస్తున్నా.

  ఏమో కొన్నాళ్ళకి గాన గంధర్వుడు బాబా సెహగల్ అన్నా అంటారేమో:)

 5. 22/03/2011 09:22

  మణిశర్మకో బిరుదు ఉందండీ… మెలొడీ బ్రహ్మ(!) అని. మర్చిపోయి “స్వరబ్రహ్మ” అని పొగిడేసి ఉంటారు. 🙂

 6. bonagiri permalink
  24/03/2011 13:36

  వేణు, Snkr, వనజ, శంకర్, బాలు గారు, అందరికీ ధన్యవాదాలు.

 7. 25/03/2011 23:09

  నాకు మణిశర్మ గారిని స్వర బ్రహ్మ అనగానే కొంచెం నవ్వు వచ్చింది. అయన మంచి సంగీతమే అందించినా , మరీ బ్రహ్మ అయితే అసలు కాదు.ఈ ఆడియో ఫంక్షన్లు ఎక్కువైపోయి సంగీత దర్శకుడిని ఎన్ని పదాలు ఉంటె అన్ని పదాలతో పొగిడేస్తున్నారు…:)
  ఇప్పటిలో మళ్ళీ యువన్ శంకర్ రాజా, ఇళయరాజా పేరు నిలబెడుతూ మంచి బాణీలు ఇస్తున్నారని నా అభిప్రాయం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: