Skip to content

చిరంజీవిని రైల్వే మంత్రి చేయాలి.

11/05/2011

ఈ మధ్యే కాంగ్రెసులో చేరిన చిరంజీవికి ముఖ్యమైన పదవినిచ్చి సంతృప్తపరచడానికి అధిష్టానం ఆయనని ఢిల్లీకి పిలిచింది. ఆయనకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలొ సభ్యత్వం ఇస్తారని అంటున్నారు. కాని చిరంజీవికి పార్టీ పదవుల కంటే మంత్రి పదవిమీదే ఆసక్తి ఎక్కువ ఉందని వార్తలు వచ్చాయి. కొత్తగా పార్టీలో చేరిన వ్యక్తికి పార్టీలో అంత ప్రాముఖ్యం ఏముంటుంది? అనుభవం కూడా వస్తుంది కాబట్టి చిరంజీవి మంత్రి పదవి తీసుకోవడమే మంచిది.

బెంగాల్ ఎన్నికలలో మమతా బెనర్జీ భారీ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి అవబోతున్నారు కాబట్టి, కేంద్రంలో రైల్వే మంత్రి పదవి ఖాళీ అవుతుంది. ఆ పదవిని మళ్ళీ తృణముల్ కి కట్టబెట్టకుండా మన రాష్ట్రానికి చెందిని నాయకుడికి వచ్చేలా UPA పై ఒత్తిడి తేవాల్సిన భాద్యత మన రాష్ట్ర నాయకులందరిమీదా ఉంది. అంతమంది MP లు ఉన్నా కేంద్ర మంత్రివర్గంలో మన రాష్ట్రానికి ఏ మాత్రం ప్రాధాన్యం లేదు. ఇప్పుడు రైల్వే శాఖని మన రాష్ట్రానికి చెందిన నాయకుడికి ఇస్తే కొంతైనా న్యాయం జరుగుతుంది.

చాలా ఏళ్ళుగా రైల్వే శాఖ ఉత్తరాది వ్యక్తుల చేతిలో ఉండి దక్షిణాదికి, అందులోనూ మన రాష్ట్రానికి చాలా అన్యాయం జరుగుతోంది. ఎప్పుడో పి వి నరసింహా రావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన గేజ్ కన్వర్షన్ ప్రాజెక్టుల తర్వాత చెప్పుకోతగ్గ ప్రాజెక్ట్ ఏదీ మన రాష్ట్రానికి రాలేదు. ఇప్పటికే అమోదం పొంది, ప్రారంభమైన పనులు కూడా నత్తనడక నడుస్తున్నాయి. ప్రతీ రైల్వే బడ్జెట్ లోనూ మనకి కొత్త ఆశలే తప్ప వాస్తవంలో ఏమీ జరగడంలేదు.

ఇప్పుడు మమతా బెనర్జీ నిష్క్రమణతో రైల్వే మంత్రి పదవి ఖాళి అవుతోంది కాబట్టి ఈ అవకాశం మనం వదులుకోకూడదు. UPA చిరంజీవికి గౌరవప్రదమైన పదవి ఇవ్వాలనుకుంటే రైల్వే మంత్రిని చేయడం చక్కని అవకాశం. మిగిలిన భేదాలన్నీ పక్కన పెట్టి రాష్ట్ర నాయకులంతా ఈ విషయంలో చిరంజీవికి మద్దతు ఇవ్వాలి. చిరంజీవి కూడా ఏ పదవి వచ్చినా, గతంలో చేసిన తప్పులు చేయకుండా స్వంత డైరక్షన్లో పని చేస్తాడని ఆశిద్దాం.

 

ప్రకటనలు
One Comment leave one →
  1. kittu permalink
    12/05/2011 17:25

    ఈ పదవి వస్తే ఏముంది సిట్లు అమ్ముకున్నవాల్లు రేపు రైల్లను అమ్ముకున్న అస్చర్యం ఏమి లేదు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: