Skip to content

అణ్ణా, అన్ శన్ మానండి.

18/08/2011

నిరవధికంగా, “అన్ శన్” అంటే నిరాహార దీక్ష చేయడానికి అణ్ణా హజారే సిధ్ధమయ్యారు. యావద్దేశం ఆయనకు మద్దతుగా నిలవడంతో కేంద్రం దిగివచ్చి దీక్షపై అన్ని షరతులకూ ఒప్పుకుంది. ఇక రేపటి నుండి రాం లీలా మైదానంలో అణ్ణా నిరవధిక నిరాహారదీక్ష చేయబోతున్నారు.

అణ్ణాని దేశప్రజలంతా సమర్ధిస్తున్నారు, కొన్ని పార్టీలవారు తప్ప. స్వాతంత్రానంతరం దేశానికి, కేంద్ర ప్రభుత్వానికీ, మరోసారి సత్యాగ్రహం శక్తి ఏమిటో అణ్ణా చూపించారు. ఆయనమీద ఆరోపణలు చేసినా ప్రజలు పట్టించుకోలేదు. ఎందుకంటే ఆరోపణలు చేసే స్థాయి అధికారపార్టీలో, ఆమాట కొస్తే ఈనాటి రాజకీయనాయకులలో ఎవ్వరికీ లేదు. ఇప్పుడు చాణ్ణాళ్ళ తరువాత విదేశీ హస్తం అనే పాత అస్త్రాన్ని బయటకు తీసారు.
అణ్ణా ఒక వేళ తప్పు చేసినా, అది తప్పు అని చెప్పే నైతిక బలం ఉన్న నాయకులు మనకు లేకపోవడం దురదృష్టం. మన నాయకులు మనకి చెప్పేదేమిటంటే, నిర్ణయాలు, శాసనాలు అన్నీ వాళ్ళే చేస్తారు. ఎవరూ నోరు విప్పి ఎందుకూ అని అడగకూడదు. పన్నులు మాత్రం నిక్కచ్చిగా కట్టాలి.
VOTE & FORGET అనేది వీళ్ళు మనకిచ్చే నినాదం.

అణ్ణా ఉద్యమం ప్రజాస్వామ్యానికి వ్యతిరేఖం అంటున్నారు. ప్రజలు ఉద్యమిస్తే తప్పు అనడం ఏ విధమైన ప్రజాస్వామ్యం? మరి ప్రజాస్వామ్య వ్యవస్థలు సరిగా పని చేస్తే ఇంత అవినీతి ఎందుకు జరుగుతోంది? ద్రవ్యోల్బణం ఎందుకు పెరుగుతోంది? కోర్టులు కలుగచేసుకొనేదాకా అవినీతిపరులకి శిక్ష ఎందుకు పడటం లేదు?
ఈ సమస్యలమీద ఉద్యమం చేయవలసిన ప్రతిపక్షం ఎందుకు సీరియస్ గా చేయడంలేదు? ఈ రోజు ప్రతిపక్షం చేయాల్సిన పనిని అణ్ణా చేస్తున్నారు. ప్రజలు అణ్ణాకు ఇంత మద్దతు ఇవ్వడానికి కారణం జన లోక్ పాల్ బిల్లు మీద ఆసక్తి కన్నా అవినీతిపై వ్యతిరేఖతే. 

నేను అణ్ణా ఉద్యమాన్ని సమర్ధిస్తాను. కాని ఇలా నిరవధికంగా నిరాహార దీక్ష చేయడాన్ని మాత్రం సమర్ధించను. ఉద్యమం చెయ్యడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈ రొజు దేశం మొత్తం ఆయనతో కలిసి నడుస్తోంది. ఇలాగే ప్రజలని చైతన్యపరిచి ఊరూ వాడా, శాంతి ప్రదర్శనలతో ప్రభుత్వాన్ని దిగి వచ్చేలా చెయ్యాలి కాని తీవ్రమైన దీక్షలతో ప్రభుత్వాన్ని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేయడం పధ్ధతి కాదు. ఒకవేళ ఈ దీక్షలో అణ్ణాకి ప్రాణాపాయం కలిగితే, జరిగే దుష్పరిమాణాలకి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎక్కువరోజులు దీక్ష చెయ్యడం కన్నా, మెరుగైన లోక్ పాల్ బిల్లు తీసురావడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
అణ్ణా కోరుకునే జన లోక్ పాల్ బిల్లు యధాతధంగా అమలులో తేవడానికి ఏ రాజకీయ పక్షమూ సహకరించదు కాబట్టి ఇచ్చి పుచ్చుకునే పధ్ధతిలో వ్యవహరిస్తేనే రెండు పక్షాలవారికీ విజయం లభిస్తుంది.
 

  

ప్రకటనలు
No comments yet

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: