Skip to content

జైలు యాత్రలు

10/09/2011

గతంలో పాదయాత్రలు, రథ యాత్రలు చేసినట్టు ప్రస్తుతం మన నాయకులు ఒకరి తరువాత ఒకరు జైలు యాత్రలు చేస్తున్నారు.

ఏ ముహుర్తాన సత్యం రామలింగరాజు తన కుంభకోణాన్ని తానే బయటపెట్టుకుని జైలుకెళ్ళాడో కాని అప్పటినుంచి వరుసగా స్కాములే, స్కాములు వెలుగు చూస్తున్నాయి.

గత సంవత్సరం నుంచీ ఈ స్కాముల రన్ రేట్ పెరిగితే ఈ మధ్య అరెస్టుల రన్ రేట్ పెరుగుతోంది.
ముందు రాజా తరువాత కనిమోళి, కల్మాడి, ఇలా అరెస్టుల లిస్టు పెరుగుతూనే ఉంది. కొద్దిరోజులక్రితమే జనార్ధన రెడ్డి సోదరునితో సహా జైలుపాలయ్యాడు. ఆ తరువాత అమర్ సింగ్, ఇంకో ఇద్దరు బి జె పి కి చెందిన మాజీ ఎం పి లతో తీహార్ బాట పట్టాడు.

ఇక్కడ బెంగుళురులో కట్టా వారి తండ్రీ, కొడుకులు జైలులో ఉన్నారు. లేటెస్టుగా ప్రముఖ కన్నడ హీరో దర్శన్ ని జైలులో పెట్టారు. లక్కీగా కుమారస్వామి దంపతులకి బెయిల్ దొరికింది.
ఇంకా వాళ్ళనీ, వీళ్ళనీ అరెస్టు చేస్తారని ఊహాగానాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల అరెస్టుల మీద బెట్టింగులు కూడా జరుగుతున్నాయని ఈ రోజు TOI లో వ్రాసారు. ఇంకా ఎంతమంది జైలుపాలవుతారో, ఏమైనా కొత్త జైళ్ళు కట్టాలో ఏమిటో.
మరి కొంతమంది స్కాములు చేసిన నాయకులు “మేరా నంబర్ కబ్ ఆయేగా” అని పాపం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ముందుగానే చిప్పకూడు, కటిక నేల అలవాటయ్యేలా ప్రాక్టీసు చేసుకోవడం బెటర్. లేకపోతే సడన్ గా అరెస్ట్ అయితే తట్టుకోవడం కష్టం.

ప్రకటనలు
No comments yet

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: