Skip to content

బెంగళూరులో మెట్రోదయం.

21/10/2011

బెంగళూరు వాసులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న శుభ ఘడియ ఇన్నాళ్ళకి వచ్చింది.
నిన్న అంటే అక్టోబర్ 20న నమ్మ మెట్రో (బెంగళూరు మెట్రో) శుభారంభమయింది.

 

First day first ride చెయ్యాలని అనుకుని, నిన్న రాత్రి ఏడు గంటలకు మెట్రో స్టేషన్ చేరుకున్నాను. ఎం జి రోడ్ స్టేషనులో రష్ బాగా ఎక్కువగా ఉందని హలసూరు స్టేషనుకి వెళ్ళాను. అక్కడ నుంచి బయ్యప్పనహళ్ళి వరకు ప్రయాణించి మళ్ళీ హలసూరుకి తిరిగి
వచ్చాను. మొదటిరోజే ప్రయాణించాలన్న కోరిక ఢిల్లీ మెట్రోలో తీరకపోయినా, ఇక్కడ తీరింది. స్టేషనులన్నీ వరల్డ్ క్లాసో కాదో కాని, ఎస్కలేటర్లు లాంటి సదుపాయాలతో ఆధునికంగానే ఉన్నాయి.

 


ప్రస్తుతం సుమారు 7 కిలోమీటర్లు మాత్రమే మొదలవ్వడం వలన మెట్రో ప్రభావం అంతగా కనపడకపోయినా, మరిన్ని మార్గాల్లో కూడా ప్రారంభమయితే ట్రాఫిక్ కష్టాలు కొంత తీరవచ్చు. బైకులూ, బస్సులూ తగ్గ వచ్చు. ఆటోల అవసరం కూడా తగ్గుతుంది. నిజానికి ఇదే మెట్రో పది, పదిహేనేళ్ళక్రితం మొదలయివుంటే, ఈ రోజు ఇంత ట్రాఫిక్ సమస్య ఉండేది కాదు.

 

కోల్ కతా, ఢిల్లీ మెట్రోల తరువాత మొదలైన నమ్మ మెట్రో, దక్షిణాదిలో మొదటి మెట్రో.
ముంబయి, చెన్నయి, జైపూర్ లలో కూడా మెట్రోల నిర్మాణం జరుగుతోంది. వీటికంటే ముందు ముంబయి మోనోరైలు ప్రారంభమవవచ్చు.
కాని హైదరాబాద్ మెట్రో పరిస్థితి మాత్రం కొన్ని సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఉంది. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం Metro Man శ్రీధరన్ సలహా విని ప్రభుత్వ పరంగా నిర్మాణం చేపట్టి ఉంటే ఈపాటికి కొంత మార్గమయినా ప్రారంభమయిఉండేది.
నవీ ముంబయి, కొచ్చి, పూణే లాంటి చిన్న నగరాలలో కూడా మెట్రోల నిర్మాణానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ వైజాగ్, విజయవాడల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోరు.

 

 

 

ప్రకటనలు
No comments yet

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: