Skip to content

ఆది – ఒక చిన్న కథ.

01/11/2011

అనగనగా ఒక తండ్రి. ఆయనకి ఇద్దరు పిల్లలు. భార్య చనిపోయినా, మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా పిల్లలని తనే కష్టపడి పెంచుతుంటాడు. పిల్లలు తండ్రి చెప్పిన మాట వినకుండా ఇబ్బంది పెడుతుంటారు. ముఖ్యంగా తిండి తినడానికి బాగా పేచీ పెడుతుంటారు.
ఒకరోజు అతను ఒక వేశ్యాగృహానికి ఫోను చేసి నాజూకైన ఒక అమ్మాయిని తన ఇంటికి పంపించమంటాడు. మర్నాడు ఉదయం ఒక సన్నని, మెరుపుతీగలాంటి అమ్మాయి వాళ్ళింటికి వస్తుంది. తండ్రి ఆ అమ్మాయిని కిచెన్‌లోకి వెళ్ళి పైదుస్తులు తీసివేసి, కేవలం లోదుస్తులతో డైనింగ్ రూములోకి రమ్మని చెపుతాడు. ఆ అమ్మాయి ఆశ్చర్యపోయినా, అతను చెప్పినట్టే డైనింగ్ రూముకి వస్తుంది. అక్కడ పిల్లలకి తిండి తినిపిస్తున్న తండ్రి ఆ అమ్మాయిని వాళ్ళకి చూపించి మీరు తిండి సరిగా తినకపోతే ఇదిగో ఈ అమ్మాయిలాగే సన్నగా, బక్కగా తయారవురతారని బెదిరించి ఆ అమ్మాయిని పంపించేస్తాడు.

ఏమిటి, ఈ కథ మాకు తెలుసు అంటున్నారా? “ఆది” సినిమాలోని ఎల్ బి శ్రీరాం ఎపిసోడ్ గుర్తొచ్చిందా? ఈ కథ “ఆది” సినిమాకి పరుచూరి బ్రదర్స్, వి వి వినాయక్ వ్రాసింది కాదండి. ఇది గెరాల్డ్ లిల్లీ అనే బ్రిటీషర్ వ్రాసిన “ఉపమానం” అనే విదేశీ కథ.
నేను కొన్ని నెలల క్రితం విజయవాడ వెళ్ళినపుడు ఏలూరు రోడ్డులో కొన్న పుస్తకాల్లో మల్లాది వెంకట కృష్ణమూర్తి అనువదించిన “విదేశీ కథలు” పుస్తకం ఒకటి. మొన్న ఈ పుస్తకంలోని కథలు చదువుతుండగా, ఈ కథ నా దృష్టిని ఆకర్షించింది. మన సినిమావాళ్ళు ఎక్కడెక్కడినుంచో ఇన్‌స్పైర్ అవుతున్నారు కదా అనిపించింది. ఈ పుస్తకంలో ఇలాంటి మంచి కొసమెరుపు కథలు చాలా ఉన్నాయి. నేనూ ఇంకా పూర్తిగా చదవలేదు. సగం కథలే చదివాను. విదేశీ కథలు కాబట్టి కొన్ని విచిత్రంగా, ఆశ్చర్యకరంగా ఉన్నాయి. కానీ ఇంట్రష్టింగానే ఉన్నాయి. వీలైతే ఈ చిన్న పుస్తకాన్ని చదవండి.

ప్రకటనలు
No comments yet

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: