Skip to content

బిజినెస్‌మేన్ – వై దిస్ కొలవెరి, కొలవెరి, పూరీ..

21/01/2012

బిజినెస్‌మేన్ సినిమా చూసాకా, నాకు ముందుగా ఈ కొలవెరి పాట గుర్తొచ్చింది. పూరీ జగన్నాథ్, ప్రతీ సినిమాకీ ప్రేక్షకులు ఊహించని షాకులు ఇస్తాడని తెలుసు కానీ, ఇన్ని షాకులు ఇస్తాడని ఊహించలేదు. దర్శకుడు తనలోని ఆవేశాన్నీ, కసిని (కొలవెరి అనచ్చా?) ఇంత రఫ్‌గా, నెగటివ్‌గా చూపించడం అవసరమా? ఈ సినిమా ఎలా ఉందంటే, పోసాని డైలాగులు వ్రాసిన రాంగోపాల్‌వర్మ సినిమాలా ఉంది. ఈ సినిమా తమిళ వెర్షన్‌కైనా కొలవెరి అని పేరు పెడితే బాగుండేది.

ఇంత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రని మహేష్ ఒప్పుకోవడం ఆశ్చర్యమే. ఇలాంటి పాత్రలు పక్కా మాస్ హీరోలైన రవితేజ, గోపీచంద్ లాంటి వాళ్ళకి పరవాలేదేమో. నాకైతే పూరీ, తన సినిమాలన్నీ రవితేజ కోసం వ్రాసుకున్నట్లే అనిపిస్తుంది.

తెలుగు సినిమా కథకి పెద్దగా లాజిక్కులుండవు కానీ, మరీ ఇంతగా లాజిక్, రీజనింగ్ ఏమీ లేని సినిమాని ఈ మధ్య చూడలేదు. ఇందులో హీరో ఏమి చేయాలనుకుంటే అది, తన ఇష్టమొచ్చినట్టు చేసేస్తాడు. ఎందుకు చేస్తున్నాడో, దానికీ అర్థముండదు. ఈ సినిమాలో ఎడిటర్ ఎక్కువ పని చేసాడో, సెన్సార్ వాళ్ళు ఎక్కువ పని చేసారో చెప్పడం కష్టం. సెన్సార్ వాళ్ళు ఇదివరకు మాటలనే మ్యూట్ చేసేవాళ్ళు. ఇప్పుడు దృశ్యాలని కూడా బ్లర్ చేయాల్సివస్తోంది.

మిల్క్ బాయ్ లాంటి మహేష్ ఏమిటి? ఆ డైలాగులేమిటి? అభిమానులు ఎలా ఒప్పుకుంటారు?
మహేష్ బాబూ, ఇలాంటి డైలాగులు आप को शोभा नहीं देता.

ఇందులో కొన్ని స్ఫూర్తివంతమైన డైలాగులు ఉన్నా, అవి కూడా బూతుల్లో కొట్టుకుపోయాయి. హీరో చివరలో ఇచ్చే సందేశం ( ఏ లక్ష్యం లేని వాళ్ళు చచ్చిపోండి, సమాజానికి మీ అవసరం లేదు ) బాగున్నా, అది పాత్రోచితంగా లేదు. ఈ సందేశం విన్నాకా, నేను నా మొట్టమొదటి టపా ఆరంభం లో వ్రాసుకొన్న ఈ వాక్యం ( ఏమీ సాధించని జీవితం కంటే మృత శిశువుగా జన్మించడం ఉత్తమమా? ) గుర్తొచ్చింది.

ఖలేజా సినిమాలో ఇలాగే మహేష్ చేత అతిగా వాగించినందువల్లే ఎవడూ రెండోసారి చూడలేదు. దూకుడు సినిమాలో ఎక్కువ డైలాగులు ఉన్నా, శృతి మించలేదు కాబట్టి అందరికీ నచ్చింది. నిజానికి బిజినెస్‌మేన్ సినిమాకి దూకుడు అని పేరు పెట్టాల్సింది. ఇందులో మహేష్ ప్రతీ సీనులోనూ దూకుడుగానే ఉంటాడు.

పూరీ జగన్నాథ్ గారూ, మీలోని ఆవేశాన్నీ, కసినీ ఇలా కాకుండా పాజిటివ్‌గా ప్రజంట్ చేస్తే ఒక శంకర్ లాగా గ్రేట్ అనిపించుకొంటారు. మున్నా భాయి లాంటివాళ్ళు గాంధీగిరి చేస్తుంటే, మీ సూర్య, భాయి అవడం బాగుందా? మీరు కసితో లగాన్, చక్ దే ఇండియా లాంటి పాజిటివ్ సినిమాలు తియ్యండి. అందరూ మిమ్మల్ని అభినందిస్తారు.

యువతకి బ్రాండ్ అంటే అబ్దుల్ కలాం, అన్నా హజారే లాంటి వాళ్ళు కాని సూర్యా భాయ్ కాదు సార్. రాంగోపాల్‌వర్మ సినిమాలు తెలుగువాళ్ళు చూడడం మానేసారు. మీరూ ఇంకా అలాంటివే తీస్తే ఎలా? ఇందులో మహేష్ హీరో కాబట్టి ఒంటిచేత్తో సినిమాని లాక్కొచ్చాడు. మరో హీరో అయితే ఇంత హైప్ వచ్చేదే కాదు.

 

ప్రకటనలు
10 వ్యాఖ్యలు leave one →
 1. 21/01/2012 22:26

  పోసాని డైలాగులు వ్రాసిన రాంగోపాల్‌వర్మ సినిమాలా..

  😀

  దర్శకులుంగారు వ.రాం.గో (వర్మ, రాం గోపాల్) గారికి ధన్యవాదాలు చెప్పుకున్నప్పుడే ఎడమకన్నదిరిందండీ. డైలాగులన్నీ జనాంతికంగా చెప్పినట్లుంటాయ్. అవికూడా చెత్తే. మీరన్నది నిజం ఎడిటర్ తక్కువగానూ, సెన్సారువాళ్ళు ఎక్కువగానూ చేశారు (నావరకునాకు సెన్సారువాళ్ళ పనితనం నచ్చింది).

 2. 21/01/2012 23:16

  Last but one paragraph కేకండి..

 3. 22/01/2012 00:22

  /*కసితో లగాన్, చక్ దే ఇండియా లాంటి పాజిటివ్ సినిమాలు తియ్యండి. అందరూ మిమ్మల్ని అభినందిస్తారు.*/
  డబ్బులు రావు………
  మంచి సినిమాలు ఎన్ని కొట్టుకుపోలేదు……
  1947 లో ఒక గ్రామం సినిమాను ఎవడు కొన్నాడు. ఒకరిద్దరు కొన్నా కలెక్షన్లు వచ్చాయా? నిన్న వచ్చిన విరోధి , ప్రస్తానం ఎవడు చూసాడు. మంచి సబ్జెక్ట్ , స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ తో వచ్చిన మంచి సినిమాలు చాలానే విడుదలకు నోచుకోకుండానే టప్పా గట్టాయి…. మనకు ఎలాగూ మంచి చెడులు తెలుసు . ఒకడు చెడు చెయ్యమని చెబితే మనం చేస్తామా. వినదగునెవ్వరు చెప్పిన పద్యం గుర్తుకు తెచ్చుకుంటాం. గాంధీ సినిమాలే చెయ్యాలని రూల్ ఉందా? సినిమాలు దర్శకుని ప్రతిభకు ప్రతిబింబాలు. అది ఎలా ఉంది అన్నది మనకు అనవసరం. కానీ కోట్లు ఖర్చు చేసి తీసే సినిమాలకు సెటైర్లు వెయ్యకండి.
  మహేష్ తీసిన సైనికుడు, అర్జున్ ప్లాప్…. పూరీ జగన్నాద్ నేనింతే కూడా ప్లాప్….. మంచి సినిమాలు ఆదరించనపుడు ఇంకెందుకు తియ్యాలి సినిమా? అవార్డులు ముఖ్యం కాదు డబ్బులు. ఒక్క సినిమా మీద వేల మంది భవిష్యత్తు ఆధారపది ఉంటుంది.

 4. bonagiri permalink
  22/01/2012 07:43

  Indian Minerva గారు, Girish గారు, ధన్యవాదాలు.

  vinod1092 గారు, నేనేమీ అవార్డ్ సినిమాలు తియ్యమని చెప్పటం లేదు. దూకుడు లాంటి వినోదభరితమైన సినిమాలు తీసినా పరవాలేదంటున్నాను.
  అయినా ఆమీర్ ఖాన్ తీసిన మంచి సినిమాలు జనం బాగానే చూసారు కదా!

 5. 22/01/2012 09:30

  [కానీ కోట్లు ఖర్చు చేసి తీసే సినిమాలకు సెటైర్లు వెయ్యకండి.]
  ante kotlu petti tiste anni muskoni chudala ? andaru ?
  lakshalu petti tisina cinemalamide vimarsalu cheyyala ?
  ardhavamtamaina vimarsani accept cheyyalenappudu cinema tiyyadam waste.

 6. CVRAO permalink
  22/01/2012 19:03

  బిజినెస్స్ మ్యాన్ గురించి మీరు వ్రాసినది చాల బాగుంది. ఈ రోజుల్లో ఎవరయినా పెద్ద హీరోల సినిమాల గురించి విమర్శిస్తే వాళ్ళని ఏకి పారేసేందుకు చాలామందే సిద్దంగా ఉంటారు. నిజం చెప్పాలంటే, ఇప్పుడు ఇటువంటి డైలాగులు దట్టించిన సినిమాలు తప్ప మామూలు సినిమాలు ఎవరికీ ఎక్కవు కూడా. యధా ప్రజా తదా సినిమా. చాలామంది సినిమా ప్రభావం మన మీద ఉండదని బ్రమిస్తుంటారు. గాని అది నిజం కాదు. నేటి యువత సినిమాలని అక్షరాల అనుసరించ బట్టే, ఇప్పడు మనమంత ఒక వింత ప్రపంచంలో బ్రతుకుతున్నాము. మన భాష మనకి రాదు, అర్ధం కాదు, దాని పట్ల మనకి మమకారం లేదు. మన సంస్కృతీ కన్నా పరాయిదే గొప్ప మనకి.అనుసరించడం, అనుకరించడంలో మనం చూపే నేర్పు మరెందులోను లేదు మనకి. అక్కడ ఎక్కడో అమెరికాలోనో, అస్త్రేలియలోనో కుర్రాళ్ళు పిల్లి మొగ్గలు వేసి అదే డ్యాన్స్ అంటే మనకి అదే ప్రామాణికం అవుతుంది. ఎన్ని బూతులు ఉంటె అంత గొప్ప సినిమా, హీరో ఎంత మందిని నరికేతే అంత గొప్ప. ఇదే మనకి ప్రామాణికం ఇప్పుడు. అందుకే, కోట్లు కర్చు పెట్టి తీసే ప్రతి నిర్మాత తన సినిమాలో ఇవన్ని ఉండేలా తప్పక చూసుకొంటాడు.
  ఇక, మనకి నచ్చితే చూడటం, లేకపోతె మానుకోవడం.అంటే మనం చేయ గలిగేది. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం.

 7. 22/01/2012 21:58

  బాగా రాశారండి బోనగిరిగారు…!

  vinod గారు..!
  కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తున్నారు.., వేలమంది ఆధారపడి ఉన్నారు.. ఇలాంటివన్నీ అనవసరం.
  “ఆ నలుగురు”, గోదావరి లాంటి సినిమా ఉన్నాయి కదండి..! అవి ఆడింది బూతుల వల్లన కాదుగదా..! దర్శకుని ప్రతిభ అంటే చూపించాల్సింది ఇటువంటి సినిమాలమీద అంతేగానీ “బూతు” మీద కాదు..
  సరే.. “ఆ నలుగురు” సినిమాలో ఒక డైలాగ్‌ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్‌ ది.. విలువలకి కట్టుబడని పత్రిక ఉంటే ఎంత మూసేస్తే ఎంత అని..! ఇది కూడా అంతే.. ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది.. విలువలకి కట్టుబడకపోతే సినిమా తీయడం ఎందుకు..? దండగ .. శుద్ధ దండగ..!

 8. bonagiri permalink
  23/01/2012 10:08

  Dvn Sravan Kumar, CVRAO, వామనగీత గారూ, ధన్యవాదాలు.

  నిజానికి నేను వ్రాసింది చాలా తక్కువ.

  Girish గారి బ్లాగులో ఇంకో రెండు మాటలు వ్రాసాను.

  మాఫియాకి అశ్వమేధయాగానికీ పోలికా?

  “యుద్ధం చేయలేనివాడే ధర్మం గురించి మాట్లాడతాడు”

  ….. అసలు యుద్ధం చేయాల్సిందే ధర్మం కోసమని మరిచిపోతే ఎలా?

  మరో మాట.
  20 ఏళ్ళ క్రితం విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన “పరిందా” చూసినపుడు ఇలాగే అనుకున్నాను. అంత హింస అవసరమా? అని.
  అదే విధు వినోద్ చోప్రా తరువాత నిర్మాతగా మారి రాజ్ కుమార్ హీరాణీ తో మున్నాభాయ్ సినిమాలు, 3 ఇడియట్స్ తీసాడు.

 9. Saamaanya permalink
  14/02/2012 10:03

  Baagundandee…

 10. Ananymous permalink
  01/05/2012 16:36

  Manchi charcha…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: