Skip to content

జెంటిల్ మేన్ ఆఫ్ క్రికెట్.

10/03/2012

సచిన్, గంగూలీ, లక్ష్మణ్ స్టైల్‌గా కొడతారు.
సేహ్వాగ్, ధోనీ బలంగా కొడతారు.
కాని ద్రవిడ్ మాత్రం శ్రద్ధగా కొడతాడు.
‘అతడు’ సినిమాలో తనికెళ్ళ భరణి చెప్పినట్టు శ్రద్ధగా, పధ్ధతిగా, జాగ్రత్తగా, గోడ కట్టినట్టు బాటింగ్ చెయ్యడం ఒక్క ద్రవిడ్‌కే సాధ్యం.

పద్మశ్రీ రాహుల్ శరద్ ద్రవిడ్

ద్రవిడ్‌కి ముందు వెంగ్‌సర్కార్‌ని ఇలాగే ‘మిస్టర్ డిపెండబుల్’ అనేవారు.

రాహుల్  ద్రవిడ్ అంతకన్నా గొప్పగా ‘ది వాల్’ అనిపించుకున్నాడు.

ద్రవిడ్ బాటింగ్‌లో అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే ఎవరో ఒకరితో మంచి భాగస్వామ్యాన్ని నిర్మించడం. భారత జట్టు విజయాలకి ఈ భాగస్వామ్యాలే ఎంతో ఉపయోగపడ్డాయి. ఒకోసారి ఈ భాగస్వామ్యాలలో ద్రవిడ్‌కి పేరు రాకపోవచ్చు, కాని ఒకవైపు ద్రవిడ్ భరోసా లేకపోతే అవతలి బాట్స్‌మెన్ గొప్ప ఇన్నింగ్స్ ఆడలేడు.

ద్రవిడ్ టెస్టుల్లో చేసిన 36 సెంచరీలలో భారత జట్టు ఓడిపోయింది కేవలం 4 టెస్టుల్లోనే. ఆ నాలుగింటిలో కూడా మూడు గత ఏడాది ఇంగ్లండ్ సిరీస్‌లో చేసినవే. ఆ సిరీస్‌లో మిగిలిన భారత ఆటగాళ్ళు ఎంత చెత్తగా ఆడారో మనకు తెలుసు. ఈ ఒక్క లెక్క చాలు ద్రవిడ్ భారత జట్టుకి ఎంత నిస్వార్థంగా సేవచేసాడో చెప్పడానికి.

జట్టుకి అవసరమైనప్పుడు వికెట్ కీపర్‌గా, ఓపెనర్‌గా, ఏ స్థానంలోనైనా, ఈగోలు లేకుండా ఆడడం ద్రవిడ్ లాంటి జెంటిల్ మేన్ మాత్రమే చేయగలడు. తనకు నచ్చని పరిస్థితుల్లో ఎవరూ అడగకుండానే, కెప్టెన్సీకి రాజీనామా చెయ్యడం కూడా ద్రవిడ్‌కే సొంతం. ఇప్పుడు కూడా సీనియర్లు ఆటకి గుడ్‌బై చెప్పాలని అందరూ విమర్శిస్తుంటే, ఒక ద్రవిడ్ మాత్రమే హుందాగా తప్పుకుంటున్నాడు.

ద్రవిడ్‌ని యువ క్రికెటర్లు ఆదర్శంగా తీసుకుని భారత జట్టుకి సేవలు అందించాలని కోరుకుందాం.

హాట్సాఫ్ ద్రవిడ్.

 

 

ప్రకటనలు
No comments yet

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: