Skip to content

కోటిపల్లి రేవు

14/04/2012

 

గత వారం స్వాతి వార పత్రికలో వంశీ కొత్త సీరియల్ ‘రంగులరాట్నం’ ప్రారంభమయింది. నగరాల్లో పెరిగిన కొంతమందికి వంశీ రచనలు అంతగా నచ్చకపోవచ్చు కాని, మా గోదారోళ్ళకి మాత్రం వంశీ ఏమి వ్రాసినా ఆసక్తికరంగానే ఉంటుంది. ఆ సీరియల్ కోటిపల్లి రేవు దగ్గర మొదలవుతుంది. ఇది చదువుతున్నప్పుడు గత సంవత్సరం నేను నా స్నేహితులతో కలిసి కోటిపల్లి రేవుకి వెళ్ళిన సంగతులు గుర్తుకొచ్చాయి.

నా చిన్నప్పుడు ప్రతీ ఏడాది, అంతర్వేది తీర్థానికి వెళ్ళేవాళ్ళం. కాని తరువాత ఉద్యోగరీత్యా, చాలా ఏళ్ళు వెళ్ళటం కుదరలేదు. క్రిందటి సంవత్సరం ఎలాగైనా వెళ్ళాలని నా ఇంటర్ నాటి స్నేహితులతో ప్లాన్ చేసుకుని నలుగురు స్నేహితులం అంతర్వేది తీర్థానికి వెళ్ళాము. మర్నాడు కోనసీమ చూద్దామని నరసాపురం నుంచి బయలుదేరాము. చించినాడ వద్ద వశిష్ట బ్రిడ్జి, గన్నవరం వద్ద డొక్కా సీతమ్మ అక్విడెక్టు చూసుకుని అంబాజీపేట సెంటరు దగ్గర ఆగాము. అక్కడ ఒక హోటల్లో కోనసీమ స్పెషల్ పొట్టక్కలు కడుపునిండా తిని ముక్తేశ్వరం చేరుకున్నాం.

సీరియల్లో ముక్తేశ్వరం దగ్గర పడవ మీద రేవు దాటి లంకలో నడిచి వెళితే అవతలి వైపు రేవు వస్తుందని వ్రాసాడు. కాని మేము వెళ్ళినప్పుడు లంకలోకి కూడా కారులోనే వెళ్ళిపోయాము. నదిలో నీరు తక్కువ ఉండటం వలన, నదిలోనే కచ్చా రోడ్డు వేసారు. లంకకి అటువైపు చేరుకుని, కోటిపల్లి రేవుకి టిక్కట్టు తీసుకుని పడవకోసం వెయిట్ చేసాము.

కొంతసేపటికి ఒక ఇంజను బోటు నిండా ప్రయాణికులతో అటువైపునుండి వచ్చింది. వాళ్ళందరూ దిగాకా, ముందుగా మోటార్ సైకిళ్ళని ఎక్కించడం మొదలుపెట్టాడు పడవ వాడు. వాళ్ళకి మనుషులకంటే మోటార్ సైకిళ్ళే ముఖ్యం అన్నట్టుగా ఉంది. మామూలు సైకిళ్ళ కంటే, మోటారు సైకిళ్ళూ ఎక్కువ ఉండడం కొత్తగా అనిపించింది. సైకిళ్ళన్నీ ఎక్కాకా, జనం పడవ ఎక్కారు. కొంతమంది జనం ఎలాగో సర్దుకు కూర్చున్నారు. కొంతమంది నిలబడే ప్రయాణించారు. వచ్చినవాళ్ళందరినీ ఎక్కిస్తూనే ఉంటే, ఈ బోటు కెపాసిటీ ఎంత అని పడవ వాడిని అడిగాము. అతను అలాంటివేమీ తనకి తెలియదని అన్నాడు. మాకైతే భయం వేసింది, క్షేమంగా అవతలి ఒడ్డుకి చేరతామా, లేదా అని. పడవలో లైఫ్ జాకెట్లు కూడా ఏమీ లేవు. అప్పుడు అర్థమయ్యింది ప్రతీ ఏడాదీ, మన దేశంలో పడవప్రమాదాల్లో అంతమంది ఎందుకు చనిపోతున్నారో. హుస్సేన్ సాగర్ లాంటి చోట్ల పర్యాటకులకి లైఫ్ జాకెట్లు తప్పనిసరి చేసిన ప్రభుత్వం ఇలాంటి చోట్ల ఏ విధమైన రక్షణ చర్యలు ఎందుకు తీసుకోదు? ఫ్రమాదం జరిగాక నాయకులు తీరిగ్గా వచ్చి మొసలి కన్నీళ్ళు కారుస్తారు.

ఎలాగైతేనేమి, కోటిపల్లి రేవుకి చేరుకుని సోమేశ్వరుడిని దర్శించుకుని, మళ్ళీ అలాంటి బోటుమీదే క్షేమంగా ముక్తేశ్వరం వైపుకి తిరిగి వచ్చాము. అక్కడినుండి ముక్తేశ్వరం, అయినవిల్లి దేవాలయాలు దర్శించుకుని, రావులపాలెం చేరుకున్నాం. చీకటిపడే వేళకి లొల్ల లాకులు చూసి, తరువాత ఆత్రేయపురంలో పూతరేకులు కొనుక్కుని తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము. అదండీ మా ఒక రోజు కోనసీమ యాత్ర. ఎప్పుడో మళ్ళీ ఇంకోసారి మిగతా ప్రదేశాలు కవర్ చెయ్యాలి.

 

ప్రకటనలు
4 వ్యాఖ్యలు leave one →
 1. 15/04/2012 12:42

  cool

 2. 17/06/2012 09:05

  యాత్రా విశేషాలు బాగున్నాయండి.
  పడవలో అంత ఎక్కువమంది ఎక్కటం ప్రమాదమని తెలిసి కూడా ప్రజలు పట్టించుకోకుండా ప్రయాణించటం బాధాకరం.

 3. 26/06/2012 18:27

  మీ యాత్ర చదువుతుంటే 14 సం: క్రితం మేము కోటిపల్లి వెళ్ళిన రోజులు గుర్తు వచ్చాయి

 4. 14/05/2013 21:51

  కోటిపల్లి ట్రిప్ విశేషాలు బాగున్నాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: