Skip to content

IPL టెలికాస్ట్‌లో సుత్తి ప్రకటనలు.

21/04/2012

ఈ నెల మొదటివారంలో IPL అయిదో సీజన్ మొదలయ్యింది. ఇప్పటి వరకు మ్యాచులన్నీ ఆసక్తికరంగానే ఉన్నాయి కాని, టెలీకాస్ట్ మధ్యలో వచ్చే ప్రకటనలే చాలా బోరు కొడుతున్నాయి. అంతంత డబ్బులు ఖర్చుపెట్టి అలాంటి చెత్త యాడ్‌లు ఎలా ప్రసారం చేస్తున్నారో అర్థం కాదు.

ముఖ్యంగా వొడాఫోన్ ప్రకటనలు చూడండి. ఇదివరకటి IPL సీజన్లలో వొడాఫోన్ వాళ్ళ జుజు ల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూసేవారు. జుజుల చిన్న చిన్న హాస్య సన్నివేశాలు ఎంతో సరదాగా ఉండేవి. ఇప్పుడు ఏవో కొన్ని పురాతన దృశ్యాలు లాంటివి తీసుకొచ్చి ప్రకటనలు అని చూపిస్తున్నారు.

అలాగే ఐడియా వాళ్ళ ప్రకటనలు కూడా చాలా చిరాగ్గా ఉన్నాయి. ఈ అర్థం పర్థం లేని స్వర్గలోక సన్నివేశాలని చేయడానికి అభిషేక్ బచ్చన్ ఎలా ఒప్పుకున్నాడో? ఇది నిజంగా స్టుపిడ్ ఐడియా అని చెప్పాలి.

ఇంకోటి టాటా డొకోమో వాళ్ళ రెస్టారెంట్ యాడ్లు. యువకుడైన రణబీర్ కపూర్‌ని ముసలివాడిగా మార్చేసి సిల్లీగా ఉండే ప్రకటనలు రూపొందించారు. కస్టమర్లు మరీ అంత అమాయకంగా ఉంటారా ఎక్కడైనా?

మరొకటి కాడ్‌బరీస్ 5 స్టార్ చాకొలెట్ల దర్జీ ప్రహసనం. ఇది కూడా అతిగా ఉంది.

ఇలాంటి చెత్త ప్రకటనల వల్ల వాళ్ళ ప్రొడక్టులకి మేలు జరగకపోగా, నెగటివ్ రిజల్ట్ కూడా రావచ్చు. ఇలాంటి చెత్త యాడ్ల మధ్యలో మన తెలుగు సూపర్‌స్టార్ మహేష్ బాబు థమ్స్ అప్ యాడ్ చూడడం కాస్త రిలీఫ్. “ఆజ్ కుచ్ తూఫాన్ కర్తే హై” అంటూ మహేష్ అదరగొట్టాడు. ఇన్నాళ్ళకి ఒక తెలుగు హీరో నేషనల్ మీడియాలో, ప్రైం టైములో కనపడడం గొప్ప విషయమే. బెస్ట్ ఆఫ్ లక్ మహేష్..

ప్రకటనలు
3 వ్యాఖ్యలు leave one →
  1. Dev permalink
    26/04/2012 01:50

    I dont understand what is the meeaning in 5 Star ad

  2. 25/06/2012 00:39

    బాగున్నయ్!!మంచి పోస్ట్ లు ఇవ్వండీ..ఆ సుత్తి రాజకీయాలు కాకుండా…!ప్లీజ్!

  3. merajfathima permalink
    15/07/2012 15:30

    బోనగిరి గారూ , నిజమే యాడ్లు అర్ధం పర్దం లేకుండా ఉంటున్నాయి, కొన్ని ప్రకటనలు నైతిక విలువలను దిగజారుస్తున్నాయి ఇలాంటివి ఖండించాలి అందరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: