విషయానికి వెళ్ళండి

లోక్‌సభలో ప్రాంతీయపార్టీలు ఎందుకు?

11/08/2012

కాంగ్రెస్, బిజెపి లకు చెందని నాయకుడు రాబోయే ఎన్నికల తరువాత కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తాడని బిజెపి అగ్రనేత అద్వాని ఇటీవల తన బ్లాగులో వ్రాసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వంత కూటమిలోనివాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కూడా వ్యతిరేఖించినా, ఆయన చెప్పింది నిజం. జరగబోయేది అదే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కూటమి గెలుపు చాలా కష్టం. అలాగే బిజెపి కూడా అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది. సంకీర్ణ ప్రభుత్వం తప్ప పూర్తి మెజారిటీ తెచ్చుకునే సత్తా ఏ కూటమిలోనూ లేదు. గతంలో నరసింహారావు, వాజ్‌పేయి లాంటి గొప్ప అనుభవం గల నేతలు ఇలాంటి ప్రభుత్వాలని చాకచక్యంగా నడిపించగలిగారు. కాని ఇప్పుడు ఆ స్థాయి నాయకులు ఎక్కడ?

అసలు ఈ దేశం ఎన్నాళ్ళిలా సంకీర్ణ ప్రభుత్వాలని భరించాలి? ఇప్పటికైనా మనం మేలుకుని సంకీర్ణ ప్రభుత్వాలని నిరోధించగలిగే ప్రక్రియ కోసం అన్వేషించాలి. లేకపోతే మన దేశ భవిష్యత్తు మారడానికి చాలా తరాలు పడుతుంది.

నాలుగు దశాబ్దాల స్వాతంత్ర్యం తరువాత ఆర్ధిక సంస్కరణలు అమలుచేసి భారతదేశం అభివృధ్ధిపథంలో ప్రయాణించడం ప్రారంభించింది. కాని,ఇంతేనా మనం సాధించగల అభివృధ్ధి? వేగంగా నిర్ణయాలు తీసుకుని ప్రాజెక్టులని ముందుకు నడిపిస్తే ఇంకా మంచి వృధ్ధి రేటు సాధ్యమే. రెండంకెల వృధ్ధి రేటు సాధించగలమని ఆశలు కల్పించి, రెండంకెల ద్రవ్యోల్బణాన్ని సాధించారు.

కేంద్ర ప్రభుత్వం ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే సత్తాని ప్రాంతీయ పార్టీలు కట్టడి చేస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ, రైల్వే చార్జీలు పెంచాలనుకున్న స్వంత పార్టీ మంత్రినే, మమతా బెనర్జీ ఇంటికి పంపించడం. రెండంకెలు కూడా దాటని సంఖ్యాబలం ఉన్న పార్టీలు కూడా ఇంతటి పెద్ద దేశాన్ని పాలించే ప్రభుత్వాలని వణికిస్తున్నాయి. చాలావరకు ప్రాంతీయ పార్టీలకి తమ ప్రాంతం సమస్యలు తప్ప జాతీయ సమస్యలు పట్టవు. మరి కొన్ని ప్రాంతీయ పార్టీలకి వ్యక్తి పూజ, కుటుంబ సేవే ముఖ్యం. ఈ ప్రాంతీయపార్టీల నేతలకి ఏ మాత్రం కోపం వచ్చినా, మద్దతు ఉపసంహరిస్తామని బెదిరిస్తుంటారు. ఒకోసారి అన్నంతపనీ చేస్తారు కూడా. గతంలో జయలలిత ఇలాగే వాజ్‌పేయి ప్రభుత్వాన్ని కూలగొట్టింది.

ఇలాంటి పరిస్థితిని వదిలించుకోవాలంటే, అసలు ప్రాంతీయ పార్టీలని లోక్‌సభలోకి రానివ్వకుండా చూడాలి. కేవలం జాతీయ పార్టీలు మాత్రమే లోక్‌సభకి పోటీ చేసేలా చట్టాలని మారిస్తే ఈ సమస్య చాలావరకు పరిష్కారమవుతుంది. మనకు ఉన్నవి ఆరు జాతీయ పార్టీలే కాబట్టి, ఒకవేళ సంకీర్ణం తప్పనిసరి అయినా, మరీ ఇంత అతుకులబొంత ప్రభుత్వం ఏర్పడదు. జాతీయ పార్టీలు అన్ని ప్రాంతాలకీ ప్రాతినిధ్యం వహిస్తాయి కాబట్టి చిన్న పార్టీలకన్నా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయి.

 ఇలాంటి చట్టం చేయడం రాజ్యాంగపరంగా సాధ్యం కాకపోతే, ఇప్పుడున్న కూటములలోని పార్టీలన్నీ ఒక అంగీకారానికి రావచ్చును. అదేమిటంటే, కూటమిలోని ప్రాంతీయపార్టీలు కేవలం శాసనసభకి మాత్రమే పోటీ చేయడం, జాతీయపార్టీలు కేవలం లోక్‌సభకి మాత్రమే పోటీ చేయడం చెయ్యవచ్చు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్థిరంగా ఉంటాయి.

ఇది కూడా జరగని పక్షంలో కాంగ్రెస్, బిజెపి ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకుని ఒంటరిగా, అన్ని సీట్లకీ పోటీ చెయ్యాలి. అప్పుడు ప్రజలకి కూడా ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం వస్తుంది కాబట్టి, నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు.

ప్రాంతీయపార్టీలు తమ వాణిని వినిపించడానికి రాజ్యసభని ఎప్పటిలానే ఉపయోగించుకోవచ్చును. 

కనీసం ఈ విషయంలోనైనా, కాంగ్రెస్, బిజెపి కలిసి పనిచేస్తే, దేశానికి ఒక సుస్థిర ప్రభుత్వం వచ్చి, అభివృధ్ధి చెందుతుంది. మనదేశ అంతర్జాతీయ ప్రతిష్టకి కూడా కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఎంతో అవసరం.

 

No comments yet

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: