చట్టం తన పని తాను చేసుకుపోతుంది.
05/12/2012
‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది.’
మనదేశంలో రాజకీయనాయకులు తరచు ఉపయోగించే మాటలు ఇవి. కాని నిజానికి మన చట్టాలు అధికారంలో ఉన్న నేతల మాటల ప్రకారమే పని చేస్తాయి. ఏ అధికారీ తనంత తానుగా ఏ నిర్ణయం తీసుకోడు. అస్మదీయులకి అనుకూలంగా, తస్మదీయులకి వ్యతిరేఖంగా మన చట్టాలు పని చేస్తాయి.
కాని నార్వేలో చూడండి. నిజంగానే చట్టం తన పని తాను చేసుకుపోయింది. అది మంచి చట్టమా, కౄరమైన చట్టమా అనేది పక్కన పెట్టండి. కాని చట్టం పని చేసింది.
మన దేశంలో కూడ బాలల రక్షణకి అనేక చట్టాలు ఉన్నాయి. పిల్లలు కార్మికులుగా పనిచేయకుండా నిషేదించారు. కాని ఎన్నో హోటళ్ళలో, దుకాణాలలో, చిన్న చిన్న పరిశ్రమలలో, ఆఖరికి ఎంతోమంది ఇళ్ళల్లో బాలలు శక్తికి మించిన పని చేస్తూనే ఉన్నారు. వీళ్ళని పని చేయించుకునేవాళ్ళే కాకుండా, ఇతరులు కూడా మాటలతో, చేతలతో హింసిస్తూ ఉంటారు. వీళ్ళందరినీ మన చట్టాలు ఎందుకు కాపాడలేకపోతున్నాయి?
స్వంత తల్లిదండ్రులయినా, పిల్లలని కొట్టడం, వాతలు పెట్టడం ఖచ్చితంగా తప్పే. స్వంత ఇంట్లో స్వంత తల్లీ, తండ్రీ పిల్లలని కొడితేనే జైలు పాలయ్యారు. మరి ఇక్కడ పరాయివాళ్ళు బాలల చేత చట్టవిరుద్ధంగా పని చేయించుకోవడమే కాకుండా వాళ్ళని అమానుషంగా హింసించినా చట్టం తన పని తాను చెయ్యదు.
నాయకులారా, ఇంకెప్పుడూ అనవసరంగా ‘చట్టం తనపని తాను చేసుకుపోతుంది’ లాంటి పడికట్టు పదాలు వాడకండి.
ప్రకటనలు
One Comment
leave one →
True