Skip to content

108 హెలీకాప్టర్.

22/12/2012

ఏ రోజు వార్తలు చూసినా, మన దేశంలో అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగిన వార్తలు కనిపిస్తాయి. ఈ ప్రమాదాలలో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం, మరి కొంతమంది గాయపడడం మామూలే. ప్రభుత్వ లెక్కల ప్రకారం మన దేశంలో ఒక్క 2011 లోనే లక్షా నలభయి వేలమంది కేవలం రోడ్డు ప్రమాదాలలో చనిపోయారు. సుమారు 5 లక్షలమంది గాయపడ్డారు. ఒక్క ఆంధ్ర ప్రదేశ్‌లోనే సుమారు 15000 మంది చనిపోయారు. ఢిల్లీ మహానగరంలో ప్రతీయేటా సుమారు 2000 మంది రోడ్డు ప్రమాదాలలో చనిపోతుంటారు.

ఇవి కాకుండా అప్పుడప్పుడు రైలు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, తుఫాన్లు, అల్లర్లు, గొడవలు మొదలైనవాటివల్ల కూడా ఎంతోమంది చనిపోతున్నారు, మరెంతోమంది అంగవికలురవుతున్నారు. ఇలా ప్రమాదాల్లో, గొడవల్లో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తులకి సరైన సమయానికి సరైన వైద్యం అందించగలిగితే పెద్ద సంఖ్యలో ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఇందుకు ఉదాహరణ, ఇటీవల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యిన ప్రముఖ నాయకులు కీ. శే. యర్రం నాయుడు గారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి సరైన సమయంలో అంబులెన్స్ పంపించగలిగిఉంటే, బహుశా ఆయన బతికి ఉండేవారు.

ఏదైనా ప్రమాదం జరిగిన 60 నిముషాలలో వైద్యం అందిస్తే, వాళ్ళు బతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్నే గోల్డన్ అవర్ అంటారట. ఇంత త్వరగా ప్రమాదస్థలానికి చేరుకోవడం, మామూలు అంబులెన్సులతొ చాలాసార్లు సాధ్యంకాదు. అందుకు హెలీకాప్టర్లని ఉపయోగించాలి.

AirAmbulance

108 అంబులెన్స్ లా 108 హెలీకాప్టర్ అన్న మాట. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఇలాంటి ఎయిర్ అంబులెన్సులు నడుపుతున్నాయి కాని అవి చాలా ఖరీదు.
అలా కాకుండా, సామాన్యుడుకి కూడ అందుబాటులో ఉండే విధంగా రాష్ట్రంలో, మూడు నాలుగుచోట్ల ఈ హెలీకాప్టర్ అంబులెన్సులని 24 గంటలూ పనిచేసేలా అందుబాటులో ఉంచితే ఎంతోమంది ప్రాణాలు కాపాడవచ్చు. ప్రమాద దృశ్యాలని, బాధితుల పరిస్థితిని ఎవరైనా, మొబైల్ ఫోన్ ద్వారా షూట్ చేసి పంపిస్తే, పరిస్థితికి తగ్గట్టు హెలీకాప్టర్ సిబ్బంది ప్రిపేర్ అయి రావచ్చు.

ప్రజాసంక్షేమం కోసం వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వాలు, కొన్ని వందల కోట్లతో వేలాదిమంది ప్రాణాలు కాపాడుతూ, ఇంకా ఎంతోమంది శాశ్వతంగా అంగవికలురవ్వకుండా చూడవచ్చు. ప్రకృతి వైపరిత్యాలు జరిగినప్పుడు సైన్యం సహాయం తీసుకున్నట్టు, కొంతకాలం ఈ విషయంలో కూడ వాళ్ళ సహకారం తీసుకోవచ్చు. గాలి రెడ్డి గారి హెలీకాప్టర్ సీజ్ చేసారట. దాన్ని పొలీస్ స్టేషన్లో దుమ్ము కొట్టుకుపోయె బండిలా వదిలేయకుండా, ఇలాంటి మంచి పనులకి కూడ వాడుకోవచ్చు.
      

ప్రకటనలు
2 వ్యాఖ్యలు leave one →
  1. 24/12/2012 02:35

    కేవలం హెలికాప్టర్ దిగగానే ప్రాణాలు కాపాడ బడవు కదా ! మీరన్నట్టు , ప్రమాదాల ను అన్నింటినీ నివారించలేక పోయినా , చాలా వరకు తగ్గించే మార్గాల మీద దృష్టి పెట్టాలి. చాలా ప్రమాదాలలో మానవ ప్రమేయం ప్రధానం గా ఉంటుంది. మన దేశం లో రోడ్ల గురించీ, వాహనాలు నడిపే వారికి ఎట్లా లైసెన్సులు వస్తాయో కూడా వివరించ నవసరం లేదు కదా !

  2. 08/12/2014 06:12

    బోనగిరి గారు, పోస్టు బాగుంది. మంచి ఆలోచన. ఆ రోజులు వస్తాయి. కానీ చాలా సమయం పడుతుంది. మన పాలకులలో అత్యధికులు ఇంత లోతుగా ఆలోచించగలిగినవారు వస్తే ఇదేమీ అసాధ్యం కాదు. చాలా చాలా అవసరమైన అంశం. దీనితో పాటు అసలు ప్రమాదాలకు కారణాలను గుర్తించి వాటిని నివారించే చర్యలు చేపట్టాలి. ప్రజలలో రోడ్డు ప్రమాదాలపై డ్రైంగ్ సెన్స్ పై చైతన్యం పెంచేలా అవగాహన కార్యక్రమాలు పెంచాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: