విషయానికి వెళ్ళండి

కొవ్వొత్తులు కాదు – ఓట్లు వెలిగించండి.

30/12/2012

ఢిల్లీలో జరిగిన అత్యాచార సంఘటన తరువాత దేశమంతా యువత తీవ్రంగా స్పందించారు. ఈ ఆవేశం కేవలం ఈ ఒక్క అత్యాచారం మీదే కాదు. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేకానేక సంఘటనలమీద కూడ. ఈ మధ్య కాలంలో యువత ఇంతగా స్పందించటం మన నాయకులకి మింగుడుపడటంలేదు. ఎవరికి తోచిన అవాకులు, చవాకులు వాళ్ళు పేలుతున్నారు.

ముందుగా ఈ స్పందన విషయంలో ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అణ్ణా హజారేని అభినందించాలి. జన లోక్‌పాల్ కావాలంటూ దేశప్రజలని ఉత్తేజపరుస్తూ ఆయన దీక్షలు చేసాడు. సోఫాలకి శిలాజాల్లా అతుక్కుపోయి టి వి చూసే  వాళ్ళని రోడ్డుమీదకు తీసుకువచ్చాడు అణ్ణా. అదే స్ఫూర్తితో ఇప్పుడు ఢిల్లీలో జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ యువత దేశమంతా అద్భుతమైన పోరాటం చేసారు. కాని సుమారు రెండువారాలు జీవనపోరాటం చేసి ఆ యువతి కన్ను మూసింది. ఆమె మరణించిందని తెలియగానే మళ్ళీ దేశమంతా ప్రజలు ముఖ్యంగా యువత ఆమెకు నివాళులర్పిస్తూ, కొవ్వొత్తులు వెలిగించి తమ నిరసన, ఆక్రోశం తెలియచేస్తున్నారు.

candles

 

కాని కొవ్వొత్తులు వెలిగించినంతమాత్రాన మన నాయకుల బుర్రలు వెలుగుతాయా? అధికారుల తీరు మారుతుందా? ప్రజలు వాస్తవాలని అర్థం చేసుకుంటారా? కేవలం కొవ్వొత్తులు వెలిగిస్తే సరిపోదు. ఓట్లని వెలిగించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం ఓటు మాత్రమే. ఆ ఓటు అనే ఆయుధాన్ని అందరూ సరిగ్గా ఉపయోగించుకోగలిగితే మనం కోరుకున్న చట్టాలు వస్తాయి. మనం కోరుకున్న సమాజం వస్తుంది.

ఇప్పుడు కొవ్వొత్తులు వెలిగిస్తూ ప్రదర్శనలు చేస్తున్న వాళ్ళలో చాలామందికి అసలు ఓట్లు ఉండవు. ఉన్నవారిలో కొంతమంది ఓటుహక్కు వినియోగించుకోరు. చాలామంది యువతీయువకులు చదువుకోసమో, ఉద్యోగం కోసమో, వేరే ఊళ్ళకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళినచోట వాళ్ళకి ఓటుహక్కు ఉండదు. మొబైల్ ఫోన్లకి నంబర్ పోర్టబిలిటీ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం ఓటుహక్కుకి మాత్రం పోర్టబిలిటీ సౌకర్యం సులభంగా ఇవ్వదు. లైన్లలో గంటలతరబడి నిలబడి, వాళ్ళు అడిగిన పత్రాలు అన్నీ సమర్పించినా, ఓటర్ల జాబితాలో మన పేరు ఉంటుందన్న నమ్మకం లేదు. మీడియాలో మాత్రం చదువుకున్నవాళ్ళు ఓట్లు వెయ్యడం లేదని కామెంట్లు చేస్తారు.

ఈ విషయంలో యువత స్వచ్చంద సంస్థలతో కలిసి అందరికీ ఓటుహక్కు వచ్చేటట్లు కృషి చెయ్యాలి. అలాగే అందరూ ఓటుహక్కు వినియోగించుకొనేటట్లు చెయ్యాలి. పార్టీల సిద్ధాంతాలు చూసి, అభ్యర్థుల అర్హతలు చూసి ఓటెయ్యాలి. అప్పుడు కాని మనం కోరుకున్న సమాజం రాదు. అందుకే యువత కొవ్వొత్తుల కంటే ముందు ఓట్లని వెలిగించాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి నిజమైన దీపావళి వస్తుంది.
  

 
 

4 వ్యాఖ్యలు leave one →
 1. Venkat permalink
  30/12/2012 07:34

  Your post is very inspirational. They should provide a chance for the people who live in other countries, still Indian citizens.

 2. బోనగిరి permalink
  01/01/2013 10:01

  Thanks Mr. Venkat for your comment.
  I think the system failure in our country is a vicious circle. To correct the system, we have to break this circle starting with election reforms.
  Happy New Year.

 3. 06/01/2013 19:14

  hai, your feelings and giving suggestions for youth and people of this country are very valuable.but where is the real action plan?in democraticway it takes long time?think more ideas!

 4. 06/01/2013 19:16

  Reblogged this on ajjarapusatyanarayana.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: