Skip to content

కొత్త రైళ్ళు కావాలి.

10/02/2013

మరి కొద్ది రోజుల్లో రైల్వే బడ్జెట్ రాబోతోంది. గత బడ్జెట్లలో మన రాష్ట్రానికి ఎప్పుడూ అన్యాయమే జరిగింది. మన రాష్ట్రం నుండి అధికారపార్టీకి 30కి పైగా MPలు ఉండి, UPA ప్రభుత్వాన్ని ఓ కాపు కాస్తున్నారు. అయినా చాలామంది MPలు వాళ్ళలో వాళ్ళు కలహించుకోవడం, స్వంత వ్యాపారాలు చక్కపెట్టుకోవడం మినహా రాష్ట్రానికి ఒరగపెట్టిందేమీలేదు. కాని ఈ సారి రైల్వే శాఖలో ఒక సహాయమంత్రి మనవాడే కాబట్టి ఎంతో కొంత న్యాయం జరుగుతుందని ఆశిద్దాం.

ప్రతి బడ్జెట్లో లాగే ఈసారి కూడ మనకి ఏవో కొన్ని కొత్త రైళ్ళు ప్రకటిస్తారు. కాని అవి ప్రజలకి ఎంతవరకూ ఉపయోగపడుతున్నాయి? ఎప్పుడో దశాబ్దాల క్రితం నడిపిస్తున్నట్టే ఇప్పటికీ రైళ్ళని నడిపిస్తున్నారు. ఇప్పుడు కాలం మారింది. ప్రజల అవసరాలు మారాయి. ఇప్పుడు డైలీ ఎక్స్‌ప్రెస్‌ల కంటే వీకెండ్ ఎక్స్‌ప్రెస్‌ల అవసరం పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు చిన్న పట్టణాలనుండి మహానగరాలకి వలస వెళ్ళి పనిచేసేవాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. వీళ్ళు తమ కుటుంబాలతో సహా వారాంతపు సెలవులకి నెలకో, రెణ్ణెల్లకో స్వంత ఊరికి వెళ్ళి వస్తుంటారు. చాలా IT కంపెనీలకి, MNC తరహాలో పని చేసే ఇతర కంపెనీలకి శనివారం, ఆదివారం సెలవు కాబట్టి వీటిలో పనిచేసేవాళ్ళు శుక్రవారం సాయంత్రం బయలుదేరి, సోమవారం ఉదయం తిరిగి వచ్చేట్టు ఇంటికి వెళుతున్నారు. వీళ్ళు ప్రస్తుతం తత్కాల్ కోటాలో కూడ టికెట్ దొరక్కపోతే, ఎక్కువ చార్జీలు చెల్లించి పిల్లా జెల్లాతో అసౌకర్యంగానే, బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.

అందుకని శుక్రవారం సాయంత్రం నుండి సోమవారం ఉదయం వరకు ప్రయాణించే వీకెండ్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళని కొత్తగా ప్రారంభిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. వీటిని సూపర్ ఫాస్ట్, ఇంటర్ సిటీ, ఓవర్ నైట్, నాన్ స్టాప్ రైళ్ళలా నడపాలి. నాన్ స్టాప్ కాకపోయినా లిమిటెడ్ హాల్ట్ అయినా పరవాలేదు కాని నానా స్టాప్ కాకూడదు. ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం సాయంత్రం 5 గంటల తరువాత బయలుదేరి మర్నాడు ఉదయం 10 గంటలలోపు గమ్యం చేరుకోవాలి. వీటి కోసం అవసరమైతే కొన్ని వీక్లీ రైళ్ళు, గూడ్సు రైళ్ళు వీక్ డేస్ లో నడిచేలా మార్చుకోవాలి. ఈ రైళ్ళు గరీబ్ రథ్ తరహాలో లేదా జనశతాబ్ది తరహాలో 20కి పైగా బోగీలతో ఉండాలి. డబుల్ డెక్కర్ రైళ్ళయితే ఇంకా ఎక్కువమంది ప్రయాణించవచ్చు. ఈ రైళ్ళు సగటున గంటకి 70 – 80 కిలోమీటర్ల వేగంతో నడిపితే త్వరగా గమ్యం చేరుకోవచ్చు.

ఉదాహరణకి ఈ క్రింది రూట్లలో (వ్యతిరేఖ దిశలో కూడ) ఇలాంటి రైళ్ళు వీకెండ్ మూడు రోజులూ నడిపితే ప్రయాణికులకి, రైల్వేకి ఎక్కువ ఉపయోగం.

సికింద్రాబాద్ – విజయవాడ – విశాఖపట్నం
సికింద్రాబాద్ – విజయవాడ – చెన్నై
సికింద్రాబాద్ – బెంగళూరు – చెన్నై
సికింద్రాబాద్ – పూణే – ముంబయి
విశాఖపట్నం – విజయవాడ – తిరుపతి – బెంగళూరు
విశాఖపట్నం – విజయవాడ – చెన్నై

కాని ప్రస్తుతం ఈ రూట్లలో ప్రైవేట్ ట్రావెల్స్ బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు కాబట్టి లాబీయింగ్ చేసి అడ్డుకోవచ్చు. రైల్వే ప్రయాణికుల సంఘం అని ఒకటి ఉంది కాబట్టి వాళ్ళు ఇందు కోసం పని చేస్తారని ఆశిద్దాం.

ప్రకటనలు
One Comment leave one →
  1. 09/03/2013 22:48

    Chala manchi aalochana baagunidi

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: