Skip to content

పుష్పక మంత్రివర్గం.

19/06/2013

కేంద్ర కేబినెట్‌ని మళ్ళీ విస్తరించారు. పునర్వ్యవస్థీకరించారని కూడ అనొచ్చనుకుంటా. నేను మీడియాకి చెందినవాడిని కాదు, సామాన్య పౌరుడిని కాబట్టి ఇప్పటికి ఎన్నిసార్లు విస్తరించారో, ఎన్నిసార్లు పునర్వ్యవస్థీకరించారో, ఆ గణాంకాలు నాకు తెలియదు.

కేబినెట్ పుష్పక విమానంలా తయారయ్యింది. ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. దిగేవాళ్ళు దిగుతున్నారు. ఎవరు పని చేస్తున్నారో, ఎవరు నిద్రపోతున్నారో మనకు తెలియదు. ఎవరు మంత్రిపదవులకి అర్హులో, ఎవరు అనర్హులో మనకు తెలియదు. మ్యూజికల్ చైర్ ఆటలోలా శాఖలు మారిపోతున్నాయి. మంత్రులు మారిపోతున్నారు.

స్కాములు చేసి చాలా మంది దిగిపోయారు. స్కాములు చేసిన కొంతమంది బయటికి గెంటివేయబడ్డారు. కొంతమంది బయటకు వెళ్ళి, కొన్నాళ్ళ తరువాత వేరే శాఖకి తిరిగి వచ్చారు. కొన్ని మిత్రపక్షాలు అలిగి వెళ్ళిపోయాయి. కొంతమంది దెబ్బలాడి వెళ్ళిపోయారు. అలిగిన మిత్రులని వదిలించుకుంటూ, అవసరార్థం కొత్త మిత్రులని చేర్చుకుంటూ, వట్టిపోయిన వాళ్ళని బలిపశువులు చేస్తూ, విస్తరణలు కొనసాగుతున్నాయి. సామ, దాన, భేద, దండోపాయాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.

దేశంలో అన్ని వస్తువుల ధరలూ విపరీతంగా పెరిగాయి. రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. పారిశ్రామిక ఉత్పత్తి తగ్గుతోంది. ఇంతమంది మంత్రులున్న ప్రభుత్వం పనిచేస్తోందో లేదో ఎవరికీ తెలియదు. దేశం ఏదో దైవాధీనంగా నడుస్తున్నట్టుంది.

క్రికెట్ టీములో 11 మంది మాత్రమే ఉంటారు. 10 మంది ఔటయితే ఇన్నింగ్స్ ముగుస్తుంది. కాని ఇక్కడ ఎంతమంది ఔటయినా, ఇంకా కొత్తవాళ్ళని తీసుకొచ్చి ఆడిస్తున్నారు. ఎంతమంది మంత్రులు ఔటయినా, కేబినెట్ నాటౌట్‌గానే నడుస్తోంది. ఒక హిందీ సినిమాలో షారూఖ్ ఖాన్ చెప్పినట్టు “పిక్చర్ అభీ బాకీ హై” అన్న్నట్టు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.

WHEN THERE IS NO ALTERNATIVE, CONGRESS IS THE ONLY ALTERNATIVE అన్న సూత్రాన్ని నమ్ముకుని అధికారపార్టీ బండి లాగిస్తోంది. కర్నాటక, హిమాచల ప్రదేశ్‌లలో అలాగే అధికారానికొచ్చింది. అదే విధంగా 2014లో కూడ అధికారంలోకి వస్తామని ఆశిస్తోంది.

ప్రకటనలు
One Comment leave one →
  1. Harsha Konagalla permalink
    21/06/2013 17:17

    నేను వార్తా పత్రికలలో రాజకీయాలు చూడటం మానేసాను. భారతీయులకు ఇది మాములు విషయం ఐపోయింది కూడా

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: