Skip to content

తత్కాల్ – ఆపత్కాల్

29/06/2013

భారతీయ రైల్వే వారు ఈ అత్యవసర రిజర్వేషను విధానానికి తత్కాల్ రిజర్వేషన్ అని పేరు పెట్టారు కాని, దీనికి ఆపత్కాల్ అన్న పేరు సరిగ్గా సరిపోతుంది. ఈ తత్కాల్ పద్ధతిలో ప్రయాణానికి ముందు రోజు రిజర్వేషన్ చేయించుకోవలసిన అవసరం వచ్చిందంటే మనకి ఆపత్కాలం దాపురించినట్టే. అంతర్జాలంలో ఈ తత్కాల్ రిజర్వేషన్ మీద బోలెడన్ని జోకులు, సెటైర్లు, కార్టూన్లు వ్యాప్తిలో ఉన్నాయి.

తెల్లవారకముందే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద పడిగాపులు కాయడం, వయసులో ఉన్న కుర్రాళ్ళ వలన అవుతుందేమో కాని, మిగతా వాళ్ళ వల్ల కాదు. ఒకవేళ ఖర్మ కాలి, అత్యవసర పరిస్థితులలో అంత కష్టపడీ క్యూలో నిలబడ్డా, మనం కౌంటరు చేరుకునే వరకు బెర్తులు ఖాళీగా ఉంటాయన్న నమ్మకం లేదు. దొడ్డిదారుల్లోనే, దొంగదారుల్లోనో, మరో విధంగానో టిక్కెట్లు బుక్ చేసుకునేవాళ్ళు చేసుకుంటూనే ఉంటారు.

ఇక ఈ తత్కాల్ రిజర్వేషనుకి ఉన్న మరో పద్ధతి, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం. కాని ఈ ఆన్‌లైను విధానం మరీ అయోమయంగా తయారయింది. ఘనతవహించిన ఆ IRCTC సర్వర్ గారు ఎప్పుడూ బిజీగానే ఉంటారు. సర్వర్ల కెపాసిటీ పెంచుతామని చెపుతున్నారు కాని, మన దేశ జనాభాకి తగినట్టు వాటి కెపాసిటీ ఎప్పుడు పెంచుతారో తెలియదు. అసలు లాగ్ఇన్ అవ్వడానికే మనకు తల ప్రాణం తోకకి వస్తుంది. చాలాసార్లు మనం లాగ్ఇన్ అవ్వగలిగేటప్పటికి మొత్తం బెర్తులన్నీ ఖాళీ అయిపోతాయి. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి లాగ్ఇన్ అయినా, మన వివరాలు అన్నీ ఇచ్చిన తరువాత మళ్ళీ సర్వర్ బిజీ అని రావచ్చు. మరో ప్రయత్నంలో అదీ అయిందనిపించినా, బాంకు నుండి మన సొమ్ము బదిలీ అయ్యి, బెర్త్ కన్‌ఫర్మ్ అయ్యిందన్న మెసేజ్ వచ్చేవరకు మనకు టెన్షనే. ఈ మొత్తం విధానంలో ఎప్పుడైనా సర్వర్ బిజీ అయి రిజర్వేషన్ ఆగిపోవచ్చు. మన అదృష్టం బాగుండి అన్ని దార్లు సమయానికి తెరుచుకుని, అన్నీ కలిసొస్తేనే టికెట్ కన్‌ఫర్మ్ అవుతుంది.

ఒకవేళ ఏదైనా కారణంతో రిజర్వేషన్ ఫెయిలయితే బాంకువాళ్ళు మనసొమ్ము తిరిగి ఇవ్వడానికి కూడ కొన్ని రోజులు పడుతుంది. ఇలా సొమ్ము అప్పటికప్పుడు సర్వర్ బిజీగా ఉన్నప్పుడు వసూలు చేసుకునే బదులు డి మాట్ అకౌంట్‌లోలా ముందే కొంత సొమ్ము మన IRCTC అకౌంటుకి బదిలీ చేసుకునే సౌకర్యం కలిపిస్తే కొన్ని తిప్పలయినా తగ్గుతాయి. బాంక్ లావాదేవీలలోని లోపాల వల్ల రిజర్వేషన్ ఫెయిలయ్యే అవకాశం తగ్గుతుంది. ఒకో ప్రయాణికుడు ఆన్‌లైన్‌లో ఉండే సమయం కూడ తగ్గి సర్వర్లపై ఒత్తిడి కొంతైనా తగ్గుతుంది.

అలాగే ఇప్పుడు అన్ని క్లాసుల రిజర్వేషనూ ఒకే సమయానికి అంటే ఉదయం పదిగంటలకి ప్రారంభిస్తున్నారు. అలా కాకుండా సగానికంటే ఎక్కువమంది ప్రయాణించే స్లీపర్ క్లాసు రిజర్వేషన్ ఒక గంట ముందే అంటే తొమ్మిది గంటలకే ప్రారంభిస్తే సర్వర్లపై ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు మొబైల్ ఫొన్ ద్వారా కూడ బుకింగ్ ప్రారంభిస్తారట. ఇక ఆ లీలలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

 

ప్రకటనలు
No comments yet

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: