విషయానికి వెళ్ళండి

లడ్డూ నిమజ్జనం.

21/09/2013

ఖైరతాబాద్ గణనాథుడి చేతిలో ఉంచిన సుమారు నాలుగు టన్నుల భారీ లడ్డూని తినడానికి పనికిరాదని తేలడంతో హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు. నిమజ్జనం రోజున కురిసిన భారీ వర్షానికి లడ్డూ పూర్తిగా తడిసి, పాడైపోయింది. దీంతో లడ్డూని ప్రసాదంగా పంపిణీ చేయలేదు. లడ్డూ తయారు చేసి 15 రోజులు గడవడం వల్ల నెయ్యి, పంచదార, శెనగపిండి మొదలైన దినుసుల్లో సూక్ష్మజీవులు చేరి లడ్డు పనికి రాకుండా పోయిందట. 12 లక్షల రూపాయల ఖర్చుతో తయారుచేయించిన ఈ లడ్డూను 80వేల మందికి ప్రసాదంగా పంచిపెట్టే అవకాశం లేకుండా పోయింది.

laDDU

నేను ఖైరతాబాదు గణేశుడిని దర్శించి 20 సంవత్సరాలు దాటింది. అక్కడ పాటిస్తున్న సాంప్రదాయాలు, ఆచారవ్యవహారాలు నాకు తెలియవు కాని, దేవుడి ప్రసాదాన్ని అన్ని రోజులు ఎందుకు నిలువ ఉంచుతారో నాకు అర్థం కాలేదు. ఒకవేళ ఇలా ఉంచడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉంటే ఎవరైనా నాలాంటివాళ్ళకి తెలియచేయగలరు.

నా ఉద్దేశంలో వినాయక చవితి రోజే, గణేశుడికి పూజ అయిన తరువాత నుండి లడ్డూ ప్రసాదం భక్తులకి పంపిణీ చేయవచ్చు కదా! ప్రసాదం అనేది భక్తులు స్వీకరించడానికే కాని దేవుడి అలంకరణ కోసం కాదు కదా. నిమజ్జనం రోజు వరకు దాచి ఉంచడంవల్ల అంత కష్టపడీ చేసిన ప్రసాదం కేవలం అలంకారప్రాయమై, ఇప్పుడు నీళ్ళపాలయింది. ప్రసాదం కోసం ఎంతో ఆసక్తిగా వచ్చిన భక్తులు నిరాశకు గురయ్యారు. సాంప్రదాయాలు, ఆచారాలు అనుమతిస్తే పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని వృధా చేయకుండా, ఇకముందైనా మొదటిరోజునుండి భక్తులకు పంచిపెట్టాలని నిర్వాహకులని కోరుతున్నాను. నేను వ్రాసినదానిలో ఏమైనా తప్పు ఉంటే మన్నించగలరు.

 

2 వ్యాఖ్యలు leave one →
  1. shankar voleti permalink
    21/09/2013 19:35

    ఇదంతా పేరు గొప్ప కోసం చేసే పనులు. అందుకే దేవుడికి కూడా కోపం వచ్చి పాడయ్యేలా చేసాడు.. ఏ ఆడంబరాలు లేని పూజలకే ఏ దేవుడైనా ఇష్టపడతాడు..

  2. 29/09/2013 19:59

    లడ్డు విషయం పక్కన పెడితే అసలు వినాయకుడు వాళ్ళు పెట్టీ పాటలు విని ఎలా ఉంటున్నాడా అనిపిస్తుంది.
    మరీ Open gangnam style, Naatrumukka వంటి పాటలు పెడుతుంటే కస్తం కదా !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: