విషయానికి వెళ్ళండి

ఆమరణ దీక్షలు నిషేధించండి.

09/10/2013

ప్రస్తుతం రాష్ట్రంలోని రెండు ప్రముఖ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఢిల్లీలో చంద్రబాబు, హైదరాబాదులో జగన్, సీమాంధ్ర ప్రజలకి జరిగిన అన్యాయానికి వ్యతిరేఖంగా ఉద్యమిస్తున్నారు. ఈ నాయకులు చేస్తున్న ఉద్యమాన్ని సమర్ధించవచ్చు కాని, ఇలా నిరవధికంగా నిరాహార దీక్ష చేయడాన్ని మాత్రం సమర్ధించలేము.

ఉద్యమాలు చెయ్యడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈ రోజు సీమాంధ్ర మొత్తం ఉద్యమం చేస్తోంది. ఈ నాయకులు కూడ ప్రజలకి మద్దతు ఇచ్చి, ఊరూ వాడా, శాంతి ప్రదర్శనలతో ప్రభుత్వాన్ని దిగి వచ్చేలా చెయ్యాలి కాని, ఇలాంటి తీవ్రమైన దీక్షలతో ప్రభుత్వాన్ని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేయడం పధ్ధతి కాదు. ఒకవేళ ఈ దీక్షలో వాళ్ళకి ప్రాణాపాయం కలిగితే, జరిగే దుష్పరిమాణాలకి ఎవరు బాధ్యత వహిస్తారు? నిజానికి ఈ దీక్షలకి ఆమరణ దీక్షలు అని పేరుపెడతారు కాని ప్రాణం పోయేంతవరకూ వస్తే, ఆ నాయకులని బలవంతంగా ఆసుపత్రులకి తరలించి వైద్యం చేయిస్తారని అందరికీ తెలుసు.

గతంలో కె సి ఆర్, అణ్ణా హజారే ఇలాగే ఆమరణదీక్షలు చేసి ప్రభుత్వాన్ని దిగివచ్చేలా చేసారు కాని, సమస్యలు పరిష్కారం అవలేదు. అయినా ఆమరణ దీక్షలు లాంటివి స్వాతంత్ర్య పోరాటం నాటి కాలంలో చేసినా అర్థం ఉంది కాని, ఈ ఆధునిక యుగంలో, ప్రజాస్వామ్య దేశంలో చేయడంలో అర్థం లేదు. ఈ దీక్షలు రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే అనుకున్నా, ఒక వ్యక్తి తన శరీరాన్ని హింసించుకుంటూ, నిరవధికంగా నిరాహారదీక్ష చేయడం అమానుషం కాదా? ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా? అందుకే ఆమరణ (లేదా నిరవధిక) నిరాహారదీక్షలని నిషేధించాలి.

మన దేశ చట్టాల ప్రకారం, ఆత్మహత్య నేరం అంటారు. ఆ నేరానికి చట్టం ఇచ్చే నిర్వచనం నాకు తెలియదు కాని, మూడు రోజులకి మించి నిరాహారదీక్ష చేసేవాళ్ళని ఆత్మహత్యానేరం కింద అరెస్టు చేస్తే, ఇలాంటి తీవ్రమైన దీక్షలు భవిష్యత్తులో ఎవరూ చెయ్యరు.

అలాగే ఇలాంటి ఉద్యమాలు జరిగేటప్పుడు, అభిమాన రాజకీయ నాయకులు చనిపోయినప్పుడు, కొంతమంది సామాన్య ప్రజలు కూడ ఆత్మహత్యలకి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వ్యక్తులని అమరజీవులని, త్యాగధనులని, వాళ్ళవి బలిదానాలని పొగడకుండా, అలాంటి వాళ్ళ ఆత్మహత్యా ప్రయత్నాలని నిరుత్సాహపరిచి వెంటనే సరైన మానసిక చికిత్స చేయించాలి. ఇలాంటి ఆత్మహత్యా ప్రయత్నాలు చేసే వ్యక్తులలో కొంతమందినైనా అరెస్టు చేసి, మానసిక చికిత్స చేయిస్తే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆపగలుగుతాము.

 

One Comment leave one →
  1. Rangarayan k permalink
    09/10/2013 23:50

    100percent correct

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: