Skip to content

AAP – ఒక ప్రజాస్వామ్య విప్లవం.

28/12/2013

ఈ రోజు ఢిల్లీ రాష్ట్ర ఏడో ముఖ్యమంత్రిగా శ్రీ అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేసారు. ఇంతవరకు శంకర్ తీసిన “ఒకే ఒక్కడు” లాంటి పొలిటికల్ ఫాంటసీ సినిమాలలోనే చూసిన సన్నివేశాలని కేజ్రీవాల్ నేడు నిజం చేసి చూపించాడు. ఇకముందు ఆయన ఎలా పని చేస్తాడో చూడాలి. ఎన్నికలకి ముందు ఆదర్శాలు వల్లించడం, పాటించడం సులువే కాని, అధికారంలోకి వచ్చాక అవన్ని చేసి చూపించడం పూర్తిగా సాధ్యం కాదు. ఎన్నికలకి ముందు ప్రజలకు మరీ ఎక్కువగా ఆశలు కల్పించడం కూడ ప్రమాదమే. ఏ మాత్రం తేడా వచ్చినా, అదే ప్రజలు తీవ్రంగా ప్రతిస్పందిస్తారు. ఫాంటసీలతో ప్రపంచాన్ని మార్చలేము అని AAP గుర్తుంచుకోవాలి.

ఎటువంటి రాజకీయ వారసత్వం, సినీ గ్లామర్ లేని సామాన్య పౌరుడిని, ముఖ్యమంత్రిని చేసారంటే, ప్రస్తుత రాజకీయ వ్యవస్థమీద ప్రజలు ఎంత విసిగిపోయి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో మూడో ప్రత్యామ్నాయం లేకపోవడం కూడ AAPకి కలిసివచ్చింది. కాని అరవింద్ కేజ్రీవాల్‌ గారికి అధికారం కోసం, కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకోవలసిరావడం దురదృష్టకరం. అణ్ణా హజారే కొంచెం పెద్దమనసుతో ఎన్నికల సమయంలో కూడ మద్దతు ఇచ్చి ఉంటే, AAPకి పూర్తి మెజారిటీ వచ్చి ఉండేది. అయినా AAP కాంగ్రెస్ మద్దతు తీసుకోకుండా వేచి చూసి ఉంటే బాగుండేది. ఇప్పుడు అధికారం కోసం తొందరపడినట్టుగానే భావించాల్సివస్తోంది. మరోసారి ఎన్నికలు వచ్చినా, పోటీకి సిద్ధపడి ఉంటే, ఈ సారి పూర్తి మెజారిటీ వచ్చేది.

జనలోక్‌పాల్ కోసం అణ్ణా చేసిన పోరాటానికి దేశవ్యాప్తంగా వచ్చిన మద్దతుని కేజ్రీవాల్ ఒక కొత్త రాజకీయానికి మద్దతుగా మళ్ళించే సాహసం చేసాడు. ఇలాంటి ప్రయోగం కోసమే ఎదురు చూస్తున్న ప్రజలు, ఆ ప్రయత్నాన్ని స్వాగతించి ఆదరించారు. ఇటీవలి రాజకీయ చరిత్రలోనే ఇది ఒక అపూర్వ ప్రయోగం. ప్రజాస్వామ్యంలోనే ఇది ఒక విప్లవం. ప్రజలు కులం, మతం పట్టించుకోకుండా, ధనబలం, కండబలం ఉన్న పార్టీలని కాదని, ఒక కొత్త పార్టీకి పట్టం కట్టడం అభినందనీయం. ఇకముందు మిగతా పార్టీలు కూడ, ఎంతో కొంత తమ మామూలు పంథాని మార్చుకు తీరాల్సిన పరిస్థితిని ప్రజలు కల్పించారు.

ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వానికి ఎంతకాలం మద్దతు ఇస్తుందో కేజ్రీవాల్‌కి కూడ తెలియదు. AAPకి మద్దతు ఇచ్చి, తాము కూడ అవినీతి వ్యతిరేఖ పోరాటానికి మద్దతు ఇస్తున్నామని ప్రజలని నమ్మించాలనుకొంటోంది కాంగ్రెస్ పార్టీ. లోక్‌సభ ఎన్నికల తరువాత దాని అసలు రంగు బయటపడుతుంది. లోక్‌సభ ఎన్నికల తరువాత బిజెపి కూడ, వాళ్ళ గేమ్‌ప్లాన్ మార్చుకోవచ్చు.

ఎప్పుడూ “మై హు ఆమ్ ఆద్మీ” అని వ్రాసి ఉన్న టోపీ ధరించే కేజ్రీవాల్ ఈ రోజు “ముఝే చాహియె పూరీ ఆజాది” అని వ్రాసి ఉన్న టోపీ పెట్టుకున్నారు. పూర్తి మెజారిటీ లేకుండా, సంపూర్ణ స్వేచ్చ ఎలా వస్తుంది కేజ్రీవాల్ గారు?

kejriwal

ప్రకటనలు
No comments yet

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: