Skip to content

ఇలాంటి అద్దం నిజంగా ఉంటే…

24/01/2014

ఈ వీడియో యాడ్ చూడండి. ఇందులో చూపించిన అద్దం నిజంగా ఉంటే ఎంత బాగుంటుందో కదా! ఇది చూసిన వెంటనే గజల్ శ్రీనివాస్ పాడిన ఈ పాట గుర్తుకొచ్చింది.

“ఉందో లేదో స్వర్గం, నా పుణ్యం నాకిచ్చేయ్
సర్వస్వం నీకిస్తా, నా బాల్యం నాకిచ్చేయ్”

ఈ గజల్ తటపర్తి రాజగోపాలం గారు వ్రాసారని ఫేస్‌బుక్‌లో ఉంది.

చిన్ననాటి జ్ఞాపకాలు తలుచుకున్నా, చిన్నప్పటి ఫొటోలు, పాత వీడియోలు చూసినా, బాల్య స్నేహితులని కలుసుకున్నా, ఆనాడు ఆడుకున్న ప్రాంతానికి వెళ్ళినా, చందమామ మళ్ళీ చదివినా, మనం టైమ్ మెషీన్లో వెళ్లినట్లు మన మనస్సులోనే బాల్యానికి వెళ్ళిపోతాం.

ఇప్పుడైతే, ఫోన్లతో కూడ ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు కాని, ఒక తరం వెనక్కి వెళితే, ఫొటో తీయించుకోవడం కూడ గొప్ప విషయమే! టెంత్ క్లాస్ హాల్ టికెట్ కోసమే మొదటిసారి ఫొటో తీయించుకునేవాళ్ళు బోలెడంతమంది. అలాంటి చాలమందికి చిన్ననాటి ఫొటోలు ఉండవు. వాళ్ళకి ఇలాంటి అద్దం దొరికితే పండగే మరి.

 

ప్రకటనలు
One Comment leave one →
  1. 24/01/2014 14:41

    Really wonderful.awesome

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: