విషయానికి వెళ్ళండి

విభజన ఫార్ములా

26/01/2014

అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.

ఏకాభిప్రాయం రావాలన్న సాకుతో ఏళ్ళతరబడి నానబెట్టిన తెలంగాణా సమస్యపై, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు, రాజకీయ లబ్ధి కోసం ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. ఇతర రాజకీయ పార్టీలు కూడ తమ తమ రాజకీయ ప్రయోజనాలకనుగుణంగా ఎప్పటికప్పుడు మాటలు మారుస్తున్నాయి.

మూడున్నర కోట్ల తెలంగాణా ప్రజల మనోభావాలని తప్పకుండా గౌరవించాలి. ఎవరూ కాదనరు. మరి అందులో సుమారు కోటి మంది దాకా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ ప్రాంత ప్రజల అభిప్రాయం సంగతేమిటి? అలాగే కోటిన్నరమంది ఉన్న రాయలసీమ ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా కోస్తా ఆంధ్ర ప్రాంతంతో కలిసి ఉండమని ఎలా నిర్ణయిస్తారు?

మన రాష్ట్ర సమస్యపై మనం, మన రాష్ట్ర అసెంబ్లీలో చర్చించుకుని నిర్ణయాలు తీసుకోవాలి కాని, ఎక్కడో ఉన్న జాతీయ పార్టీల నేతలు చేసే నిర్ణయాలని ఎందుకు ఒప్పుకోవాలి? అందుకే మన శాసనసభలోనే మన రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల శాసనసభ్యులు, లోక్‌సభ సభ్యులతో ఓటింగ్ నిర్వహించి రాష్ట్రాన్ని అసలు విభజించాలా వద్దా, విభజిస్తే ఎలా విభజించాలి అని నిర్ణయం తీసుకోవాలి.

ఇందుకోసం 2014 ఎన్నికల వరకు ఆగాలి. ఆ ఎన్నికల తరువాత ప్రత్యేక సమావేశంలో ఓటింగ్ ద్వారా మన రాష్ట్ర భవిష్యత్తుని మనమే నిర్ణయించుకోవచ్చును. ఎన్నికలకి ముందే అభ్యర్థులంతా తాము ఎన్నికయితే విభజన విషయంలో ఏ విధంగా ఓటు చేస్తామో పార్టీలకతీతంగా ప్రకటించాలి. అభ్యర్థుల అభిప్రాయాన్ని బట్టి ప్రజలు ఓట్లు వేస్తారు. అప్పుడు ప్రజలకే విభజన ఓటింగ్ సరళిని నిర్ణయించే అవకాశం వస్తుంది.

మన రాష్ట్రానికి 294 అసెంబ్లీ స్థానాలు, 42 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఒకో శాసనసభ్యునికి 1 ఓటు, ఒకో లోక్‌సభ సభ్యుడికీ 7 ఓట్లు, అనుకుంటే మొత్తం 588 ఓట్లు ఉంటాయి. ఈ 588 ఓట్లతో పారదర్శకంగా, పార్టీలకతీతంగా ఓటింగ్ నిర్వహించాలి. ఏ పార్టీ విప్ జారీ చెయ్యకూడదు. ఓటింగులో ఏ సభ్యుడు, ఏ విధంగా ఓటు వేసాడో ప్రజలకి తెలియపరచాలి.

ఈ మొత్తం ఓట్లని కలిపి AP అనుకుందాము. తరువాత ఈ ఓట్లని (సభ్యులని) 4 భాగాలుగా విభజించాలి. గ్రేటర్ హైదరాబాదు ప్రాంత ఓట్లని GH అని, మిగిలిన తెలంగాణ ప్రాంతాన్ని TG అని, రాయలసీమ ప్రాంతాన్ని RS అని, కోస్తా అంధ్ర ప్రాంతాన్ని CA అని అనుకుందాము. ఇప్పుడు క్రింది పటంలో చూపించిన విధంగా వరుసగా, ప్రాంతాలవారీగా ఓటింగ్ నిర్వహిస్తే తెలంగాణా సమస్యకి అందరికీ ఆమోదయోగ్యమైన, ప్రజాస్వామ్యబద్ధమైన పరిష్కారం లభించవచ్చును. పటం పైన క్లిక్ చేస్తే పెద్దగా కనపడుతుంది.

 

vibhajana

ఇది ఒక ప్రాధమిక సూచన (బేసిక్ ఐడియా) మాత్రమే. అనుభవజ్ఞులు, రాజ్యాంగ నిపుణులు, సీనియర్ రాజకీయ నాయకులు మొదలైనవాళ్ళు ఒక కమిటీగా ఏర్పడి ఓటింగ్ ఎలా నిర్వహించాలో విధివిధానాలు నిర్దేశించవచ్చును.

 

3 వ్యాఖ్యలు leave one →
 1. 26/01/2014 19:36

  Fair enough. All those who aren,t politicians and who are genuinely interested in the development of telugu people ought to follow this method.

 2. 03/02/2014 06:49

  మీ మెయిల్ ఐ.డీ ఇవ్వగలరు.

 3. Jai Gottimukkala permalink
  03/02/2014 10:33

  Looks interesting. A couple of points:

  1. Change the question on Hyderabad to “do you want Hyderabad to become UT”?
  2. Decide the capital of Seemandhra before asking RS & CA whether they should stay together

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: