విషయానికి వెళ్ళండి

MPMLACET కౌన్సిలింగ్

15/04/2014

ఈసారి ఎన్నికల సమయంలో మన రాష్ట్ర రాజకీయాలు అత్యంత హీన స్థితికి దిగజారిపోయాయి. ఏ రాజకీయ నాయకుడు (రానా) ఎప్పుడు, ఏ పార్టీలో ఉంటాడో తెలియని పరిస్థితి తయారయింది. మ్యూజికల్ చైర్స్ ఆటలోలా రానాలు పార్టీలు మారుతున్నారు. అన్ని పార్టీలలోనూ ఊసరవెల్లులే ఎక్కువగా టికెట్లు దక్కించుకుంటున్నారు.

పార్టీలకి అభ్యర్థుల గుణగణాలతో పని లేదు. గెలిచే అభ్యర్థులే కావాలి. అభ్యర్థులకి పార్టీ సిధ్ధాంతాలతో పని లేదు. గెలిచే పార్టీయే కావాలి. సంప్రదాయ పార్టీలతో పాటు కాస్తో కూస్తో సైధ్ధాంతిక నిబధ్ధత కలిగిన పార్టీల పరిస్థితి కూడ ఇలాగే ఉంది.

ఇటీవల పార్టీ టికెట్ రాని ఒక అభ్యర్థి ఎంతో గొప్పగా, నేను ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తాను కాని ఇంకో పార్టీలో చేరనని ప్రకటించాడు. అతను మర్నాడే ఇంకో పార్టీలో చేరాడు. వాళ్ళు కూడ టికెట్ ఇవ్వకపోయేసరికి ఆ మర్నాడు మరో పార్టీలో చేరాడు.

అలాగే ఇంక టికెట్ రాదని తెలుసుకున్న అభ్యర్థులు ఆత్మహత్యా ప్రయత్నాలు చెయ్యటం, పార్టీపై తిరుగుబాటు చేసి, పార్టీ ఆఫీసులవద్ద విధ్వంసం సృష్టించడం, ధర్నాలు చెయ్యటం ఈసారి చాలా మామూలయిపోయింది.

అందుకే ఈ గొడవలన్నీ లేకుండా పార్టీలు, రానాలు తమ తమ టికెట్ సమస్యలని శాంతియుతంగా పరిష్కరించుకోవాలంటే ఈ క్రింది విధంగా చెయ్యచ్చు.

వివిధ పార్టీల తరపున పోటీ చెయ్యాలనుకునే ఆశావహులందరికీ ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టాలి. దీన్ని MPMLACET అనుకుందాం. అంటే మన విద్యార్థులు ప్రతి ఏటా వ్రాసే EAMCETలా అన్న మాట. ఈ CET నిర్వహణ కోసం అన్ని పార్టీలు కలిసి ఒక JEC ఏర్పాటు చేసుకోవాలి. అంటే జాయింట్ ఎలక్షన్ కమిటి అన్న మాట. ఎన్నికలలో పోటీ చెయ్యాలనుకునే రానాలందరూ వాళ్ళ వాళ్ళ బయోడేటాలని ఈ JEC కి పంపించాలి. ఈ JECలో ఉండే అన్ని పార్టీల పెద్దలు అంటే వృధ్ధ రానాలు అభ్యర్థుల విద్యార్హత, గత అనుభవం, అంగబలం (అంటే కండబలం), అర్థబలం (అంటే డబ్బు బలం), సామాజికవర్గ సమీకరణాలు వగైరాల ఆధారంగా వాళ్ళకి మార్కులు వేసి రాంకులు నిర్ణయిస్తారు.

రాంకులు నిర్ణయించిన తరువాత రాజధానిలో రాంకులు వచ్చిన అభ్యర్థులందరికి MPMLACET కౌన్సిలింగ్ నిర్వహించాలి. కౌన్సిలింగ్‌లో మొదటి రాంక్ వచ్చిన రానా ముందుగా తనకిష్టమైన పార్టీలో, తనకి నచ్చిన నియోజకవర్గంలో పోటీ చేసేందుకు బి ఫాం తీసుకోవచ్చు. అలాగే వరుసగా మిగతా రాంకర్లందరూ వాళ్ళకి అందుబాటులో ఉన్న సీట్లలో, వాళ్ళకి నచ్చిన నియోజకవర్గంలో, నచ్చిన పార్టీలో పోటీ చేసేందుకు బి ఫాం తీసుకోవచ్చు. అంటే విద్యార్థులు తమకిష్టమైన కాలేజిలో, ఇష్టమైన బ్రాంచిలో ఎడ్మిషన్ తీసుకొన్నట్టన్నమాట. ఇలా పధ్ధతిగా టికెట్ల పంపకం జరిగిపోతే ఇంక టికెట్ల కోసం ఎవరూ ఎవరిని తిట్టుకోనక్కర్లేదు, కొట్టుకోనక్కర్లేదు. రోజుకో పార్టీ మారడాలు, గొడవలు, ధర్నాలు చెయ్యక్కర్లేదు. శాంతియుతంగా ఎన్నికలలో నామినేషన్ వెయ్యచ్చు. ఇక ఆ తరువాత ఎన్నికల యుధ్ధంలో గొడవలు మామూలే అనుకోండి.

 

NOTE: ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదు. వ్యంగ్యం కోసం మాత్రమే.

 

 

2 వ్యాఖ్యలు leave one →
  1. 19/04/2014 11:30

    రామయ్య కోచింగ్ సెంటర్లో మరో కోర్సు… అభ్యర్థులు ఉదయం నాలుగు గంటలకే రావాలి. వాళ్లు రాగలరా

  2. bonagiri permalink*
    19/04/2014 11:39

    వాళ్ళకి ఏ కోచింగూ అక్కర్లేదండి.
    డైరెక్టుగా CETకి అప్ప్లై చెయ్యటం, కౌన్సిలింగుకి వెళ్ళడం అంతే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: