Skip to content

మొదటి ముఖ్యమంత్రి

05/05/2014

 

prakasam

 

1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. నిజాయితీపరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు మరియు మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు.

ఈ రోజు రాష్ట్రం విడిపోయిన తరువాత మనం మళ్ళీ 1953 నాటి పరిస్థితికి వచ్చాము. కొత్త రాష్ట్రాన్ని పరిపాలించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఈ నెల 7వ తారీఖున అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.

మరి ఇప్పుడు మన రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఎవరు అవబోతున్నారు? ఆనాడు ఆంధ్రకేసరి కూర్చున్న కుర్చీలో ఇప్పుడు ఎవరు కూర్చోబోతున్నారు? ప్రకాశం గారి స్థాయి నాయకులు ఇప్పుడు ఎవరూ లేరు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో అలాంటి వారు ఇమడలేరు కూడ.

కాని అలాంటి మహనీయుడు అలంకరించిన పదవిని అందుకోబోయే వ్యక్తి అంతటి గొప్పవాడు కాకపోయినా, ఆ పదవికి, ప్రకాశం గారికి అవమానం కలిగించేలా ఉండకూడదని నా అభిప్రాయం. సింహం స్థానంలో గుంటనక్కలకి అవకాశం ఇవ్వకూడదు.

ఇప్పుడు రాజకీయాలలో ఉన్నవాళ్ళు ఇంచుమించు అందరూ దొంగలే కావచ్చు. కాని అందుబాటులో ఉన్నవాళ్ళలో మెరుగైన వాళ్ళని ఎన్నుకోవడమే మనం చెయ్యగలిగింది. వ్యవస్థలలోని లోపాలు సవరించబడేవరకు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అద్భుతాలు జరగవు. రామరాజ్యం రాకపోయినా పరవాలేదు కాని రౌడీరాజ్యం రాకుండా ఉంటే చాలు.

పోలింగ్ జరిగే ఒక్క రోజు ఓటర్లు మేలుకొని ఉంటే, తరువాత అయిదేళ్ళూ నాయకులు, అధికార్లూ నిద్రపోకుండా ఉంటారు.

అందుకే అవినీతి చీకటిని తిడుతూ కూర్చోకండి. ఓటు దీపం వెలిగించండి.

 

BEST OF LUCK TO ANDHRA PRADESH.

 

మరి కొంత: ఈ టపా వ్రాసిన రెండురోజుల తరువాత అంటే ఎన్నికల రోజున “ఈనాడు” పత్రిక తన సంపాదకీయంలో ఇదే విషయాన్ని ఈ క్రింది విధంగా ప్రస్తావించింది.

untitled1

ప్రకటనలు
No comments yet

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: