విషయానికి వెళ్ళండి

ప్రమాణస్వీకారం నిమ్మకూరులో చెయ్యండి.

28/05/2014

ఈ రోజు తెలుగువారి ప్రియతమ నాయకుడు, తెలుగు తెర ఇలవేల్పు NTR జన్మదినం. తెలుగుజాతి, తెలుగుభాషల ఉనికిని దేశానికి, ప్రపంచానికి సగర్వంగా, ప్రత్యేకంగా చాటి చెప్పిన తెలుగువారి అన్న, మన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు.

 

NTR1

పది సంవత్సరాల విరామం తరువాత NTR స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికలలో ఘనవిజయం సాధించి అధికారంలోకి రాబోతోంది. రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర (అవశేష ఆంధ్రప్రదేశ్) రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.

అయితే కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం ఎక్కడ జరుగుతుందో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. తాత్కాలిక ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాదులో కాకుండా సీమాంధ్ర ప్రాంతంలోనే ప్రమాణస్వీకారం చేస్తానని కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రమాణస్వీకారం జరిగే ప్రాంతం తిరుపతి అని, విజయవాడ అని, గుంటూరు అని రకరకాల పేర్లు మీడియాలో వస్తున్నాయి. తాజాగా విజయవాడ, గుంటూరు మధ్యలో గతంలో యువగర్జన సభ జరిగిన ప్రాంతంలో ప్రమాణస్వీకారం జరుగుతుందని వార్తలు వస్తున్నాయి.

అయితే ఇంకా రాజధాని నిర్ణయం జరగని ప్రస్తుత పరిస్థితులలో అక్కడా, ఇక్కడా ప్రమాణస్వీకారం చేసే బదులు నందమూరి తారక రామారావు గారి జన్మభూమి అయిన కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో నూతన రాష్ట్ర తొలి మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేస్తే స్వర్గీయ NTRకి ఘనమైన నివాళి ఇచ్చినట్లు అవుతుందని ఒక NTR అభిమానిగా నా అభిప్రాయం.

ఈ రోజు NTR జన్మదినం సందర్భంగా ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో ఈ విషయాన్ని చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ నాయకులని కోరుతున్నాను.

No comments yet

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: