Skip to content

నవ్యాంధ్ర రాజధాని – శ్రీరామనగర్

04/09/2014

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధానికి NTR జ్ఞాపకార్థం తారకరామనగర్ అని పేరు పెట్టాలని కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుతున్నారు. ఈ పేరు కంటే శ్రీరామనగర్ అనే పేరు బాగుంటుంది. ఎందుకంటే శ్రీరామనగర్ పేరులో ముగ్గురు ప్రముఖ తెలుగు వ్యక్తుల పేర్లు కలిసి ఉన్నాయి.

ఒకరు – ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణకై ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు.
రెండోవారు – బ్రిటీష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి తెలుగువారి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు(అసలు పేరు శ్రీరామరాజు).
మూడోవారు – తెలుగుజాతి, తెలుగుభాషల ఉనికిని దేశానికి, ప్రపంచానికి సగర్వంగా, ప్రత్యేకంగా చాటి చెప్పిన తెలుగువారి అన్న నందమూరి తారక రామారావు.

ఈ ముగ్గురు ప్రముఖుల పేర్లు కలిసివచ్చేలా శ్రీరామనగర్ అని కొత్త రాజధానికి పేరు పెట్టడం సముచితమని నా అభిప్రాయం.

రాజధాని ఎలా ఉండాలి అంటే హైదరాబాదులా ఉండాలనే అభిప్రాయం మార్చుకుంటే సగం సమస్యలు తీరిపోతాయి. రాజధాని కోసం అటవీ భూములని ఎంచుకోవడం కూడ మంచిది కాదని నా అభిప్రాయం. మన రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం తక్కువగా ఉంది. బియ్యం తక్కువైతే దిగుమతి చేసుకోవచ్చు కాని పర్యావరణాన్ని దిగుమతి చేసుకోలేము కదా!

మన రాష్ట్రానికి గుజరాత్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు కాకుండా కేరళ లాంటి రాష్ట్రాలు ఆదర్శం కావాలి. ఇంచుమించు అన్ని మానవ అభివృధ్ధి సూచీలలోనూ కేరళ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉంది. మన రాష్ట్రానికి, కేరళకి సముద్రతీరప్రాంతం, పర్యాటక ప్రదేశాలు, విదేశాలనుండి వచ్చే డబ్బు లాంటి చాలా పోలికలు కూడ ఉన్నాయి.

రాజధాని విజయవాడ వద్ద పెట్టినా, లేదా మరో ప్రాంతంలో పెట్టినా, పరిపాలనా అవసరాలకు కావలసిన అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉంటే బాగుంటుంది. అంటే అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, రాజ్‌భవన్, కన్వెన్షన్ సెంటర్లు మొదలైన ముఖ్య భవనాలతోపాటు, ఇతర ప్రభుత్వ, కార్పొరేషన్ల కార్యాలయాలు, మంత్రులు, MLAలు, ఉద్యోగుల నివాస సముదాయాలు అన్నీ ఒకే చోట ఉంటే పరిపాలన సులభంగా సాగుతుంది. ఏటా ఒక అసెంబ్లీ సమావేశం కర్నూలులో జరిగేలా, అక్కడ రెండో అసెంబ్లీ భవనాన్ని నిర్మించుకుంటే మంచిది.

ఈ పరిపాలనా కార్యాలయాలు తప్ప వివిధ విద్యా సంస్థలతో సహా మిగతా సంస్థలు, పరిశ్రమలని రాష్ట్రంలోని వేరువేరు ప్రాంతాలలో నెలకొల్పితే అన్ని ప్రాంతాల వారికీ న్యాయం జరుగుతుంది. విశాఖలో IIT, కర్నూలులో IIM, నెల్లూరులో NIT, రాజమండ్రిలో AIIMS, విజయనగరంలో Fine Arts University, కాకినాడలో పెట్రోలియం యూనివర్సిటీ మొదలైనవి నెలకొల్పి అన్ని ప్రాంతాలలో అభివృద్ధి జరిగేలా చూడాలి. ఇక తిరుపతిలో నెలకొల్పదలుచుకున్న సంస్థలని చిత్తూరులో పెడితే, చిత్తూరు అభివృధ్ధి చెందడంతో పాటు ఆధ్యాత్మికనగరం తిరుపతి జనసమ్మర్దం పెరగకుండా ప్రశాంతంగా ఉంటుంది.

అలాగే బెంగళూరుకి దగ్గరగా ఉన్న లేపాక్షి భూములలో, విశాఖపట్నం వద్ద ITIR లు అభివృధ్ధి చేయవచ్చును. వాన్‌పిక్ భూములలో ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ ఉత్పత్తి చేసే పరిశ్రమలు స్థాపించవచ్చును. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే రాయలసీమలో, ఉత్తరాంధ్రలో ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్ తదితర రంగాల పరిశ్రమలు తీసుకురావచ్చు. ఇతర రాష్ట్రాలలో ఆంధ్రులు నడుపుతున్న పరిశ్రమలు, హెడ్ ఆఫీసులు మొదలైన సంస్థలని మన రాష్ట్రానికి తరలించే ప్రయత్నం కూడ చేస్తే రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు పెరగడమే కాకుండా ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కూడ పెరుగుతుంది. ఈ సంస్థలని రాష్ట్ర రాజధానిలోనే కాకుండా వీలైనంతవరకు ఆయా యజమానుల స్వంత జిల్లాలలోనే ఏర్పాటు చేస్తే స్థానికంగా అభివృధ్ధి జరుగుతుంది. తెలుగు సినిమాలకి నేపధ్యం ఎక్కువగా గోదావరి ప్రాంతమే ఉంటుంది కాబట్టి సినీ పరిశ్రమని రాజమండ్రిలో, విశాఖలో అభివృధ్ధి చేయవచ్చును. 

ప్రకటనలు
2 వ్యాఖ్యలు leave one →
  1. 04/09/2014 12:02

    Fine

  2. Kamakshi permalink
    11/09/2014 18:07

    Well said sir.. very impressive.. really a nice thought but our politicians won’t think in this manner.. all they want is their power!! Shame on them!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: