విషయానికి వెళ్ళండి

బుద్ధవిగ్రహాన్ని కూడ ఇచ్చేస్తారా?

01/10/2014

టాంక్‌బండ్‌మీద ఉన్న మహనీయుల విగ్రహాలలో ఆంధ్ర ప్రాంతానికి చెందినవారి విగ్రహాలని తొలగించి భద్రంగా లారీలో ఆంధ్రప్రదేశ్‌కి పంపిస్తామంటున్నారు. మంచిదే! వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ రాజధాని, వాళ్ళ ఇష్టం. ఎవరి విగ్రహాలు ఉంచాలో, ఎవరి విగ్రహాలు తొలగించాలో నిర్ణయించే హక్కు, అధికారం వాళ్ళకి ఉంది. కాని ఆంధ్రప్రాంతానికి చెందిన ప్రముఖుల విగ్రహాలను ఎవరో తెలియని వారివి, అక్కరలేనివి, పనికిరానివి అని వ్యాఖ్యానించడం, మొత్తం వ్యవహారాన్ని సభలో నవ్వులాటగా మార్చడం, ఉన్నతపదవులలో ఉన్నవాళ్ళ స్థాయికి తగ్గట్టుగా లేదు.

ఆ మహనీయుల విగ్రహాలు ప్రస్తుతం పరాయి రాష్ట్రానికి చెందిన వారివైనా, మొన్నటివరకు ఒకే రాష్ట్రానికి చెందినవారివని, ఇప్పటికీ స్వంత దేశానికి చెందిన వారివే అని గుర్తుంచుకోకపోవడం దురదృష్టం. కొంతమంది ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకులు తెలంగాణాకి అన్యాయం చేసి ఉండవచ్చు, అంత మాత్రాన వారితో సంబంధం లేని మహనీయులని అవమానించడం అన్యాయం. కొన్ని విగ్రహాలని ఎంపిక చేసి తొలగించే బదులు, ఒకేసారి మొత్తం విగ్రహాలని తొలగించి, తరువాత వాళ్ళకి ఇష్టమయిన వ్యక్తుల విగ్రహాలను ఇష్టమయిన పద్ధతిలో మళ్ళీ ప్రతిష్టించుకుంటే ఇంకా బాగుంటుంది.

మరో మాట, ఈ విగ్రహాల్ని తొలగించి ఇచ్చేస్తామని అంటున్నారు కాబట్టి, హుస్సేన్‌సాగర్‌లో ఉన్న బుద్ధవిగ్రహాన్ని కూడ ఆంధ్రోల్లకి ఇచ్చేస్తారా? ఆ విగ్రహాన్ని స్థాపించింది కూడ ఆంధ్రోల్లే కదా! ఆ విగ్రహాన్ని కూడ ఆంధ్రోల్లకి ఇచ్చేస్తే విజయవాడలో కృష్ణానదిలోని భవానిద్వీపంలో ప్రతిష్టించుకుంటారు. ఒకప్పుడు బౌద్ధ సంస్కృతి వర్ధిల్లిన అమరావతికి సమీపంలోనే భవానీ ద్వీపం ఉంది కాబట్టి, బుద్ధ విగ్రహాన్ని అక్కడ స్థాపించడం సముచితమే అవుతుంది.

 

2 వ్యాఖ్యలు leave one →
  1. Simhadri Rao permalink
    01/10/2014 21:16

    మీరు చెప్పింది బాగుంది

  2. SIVARAMAPRASAD KAPPAGANTU permalink
    02/10/2014 10:12

    Well said.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: