విషయానికి వెళ్ళండి

కోటిపల్లి – నరసాపురం రైల్వే లైను

10/01/2015

త్వరలో రైల్వే బడ్జెట్ రాబోతోంది. కొత్త ప్రతిపాదనల కోసం ఈ మధ్య రైల్వే అధికారులతో మన రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు హైదరాబాదులో సమావేశమయ్యారు. కొత్త రాష్ట్రానికి కొత్తగా ఏం చేయబోతున్నారో కాని, చాలా పాత ప్రాజెక్టయిన కోటిపల్లి – నరసాపురం రైల్వే లైనుకి మోక్షం కలిగించి ఈ సారైనా బడ్జెట్‌లో అవసరమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. బాలయోగి గారు చనిపోయిన తరువాత ఈ ప్రాజెక్టు గురించి ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు.

ఇప్పుడు కేంద్రంలో కొత్తగా BJP అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ APలో బలం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఇతర పార్టీల నాయకులని పార్టీలో చేర్చుకునే బదులు ఇలాంటి ప్రజలకి ఉపయోగపడే ప్రాజెక్టులు పూర్తి చేస్తే, BJP రాష్ట్రంలో బలపడుతుంది. ప్రస్తుతం నరసాపురం MP కూడ బిజెపికి చెందినవారే. గతంలో కూడ బిజెపికి చెందిన కృష్ణంరాజు గారిని నరసాపురం ప్రజలు గెలిపించారు. ఆయన కేంద్రంలో మంత్రిగా కూడ పని చేసారు. కాని ఈ రైల్వే ప్రాజెక్టు కాని, నరసాపురం వంతెన కాని కార్యరూపం దాల్చలేదు. గత ఎన్నికలలో ప. గో. జిల్లా మొత్తం TDPని గెలిపించింది. ఇప్పటికైనా BJP, TDP పార్టీలకి చెందిన నాయకులు చొరవ తీసుకుని ఈ ప్రాజెక్టుని పూర్తి చెయ్యాలి.

అలాగే నరసాపురం వద్ద వశిష్ట గోదావరిపై రోడ్డు వంతెన కూడ NTR కాలం నుండి పెండింగ్‌లో ఉంది. అనేకసార్లు శంఖుస్థాపనలు కూడ జరిగాయి. ఎప్పటికైనా ఈ వంతెనని నిర్మించవలసిన అవసరం కూడ ఉంది. కాబట్టి ఈ రెండు ప్రాజెక్టులని కలుపుతూ నరసాపురం వద్ద రైల్ రోడ్ బ్రిడ్జి నిర్మిస్తే రెండు పనులూ ఒకేసారి జరుగుతాయి. రైలు, రోడ్డు వంతెనలు విడివిడిగా నిర్మించే బదులు కలిపి నిర్మిస్తే సమయం, ఖర్చు కూడ తగ్గుతాయి.

మన దేశంలో అత్యాధునిక CABLE STAY BRIDGES కోల్‌కతా, అలహాబాదు, ముంబయి లాంటి కొన్ని చోట్ల మాత్రమే పెద్దవి ఉన్నాయి. బెంగళూరు, గోవా, పాట్నాలలో చిన్నవి ఉన్నాయి. దిల్లీలో ఇలాంటి బ్రిడ్జిని యమునా నదిపై నగరానికి SIGNATURE BRIDGE గా నిర్మిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి వంతెనలు లేవు. గోదావరిపై మూడవ రైలు వంతెన ఆధునికమైన, అందమైన నిర్మాణమే అయినా, అది కేబుల్ స్టే వంతెన కాదు.

 

untitled

YAMUNA BRIDGE AT ALLAHABAD

నరసాపురం వద్ద రైలు రోడ్డు వంతెనని ఇలాంటి కేబుల్ స్టే పద్ధతిలో నిర్మిస్తే కోనసీమ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధికి కూడ మేలు జరుగుతుంది. గోదావరి ప్రాంతానికి ఇది ఒక SIGNATURE BRIDGE గా ఉంటుంది. గోదావరి మధ్యలో సుమారు 500 అడుగులు ఎత్తు ఉండే పైలాన్ మీద చుట్టూ తిరిగే REVOLVING RESTAURANT నిర్మిస్తే కోనసీమ అందాలని, సాగరసంగమాన్ని విహంగ వీక్షణం చెయ్యవచ్చును.

ఇలాంటి CABLE STAY RAIL ROAD BRIDGES ప్రపంచంలోనే చాలా తక్కువగా ఉన్నాయి. నరసాపురంలో ఇలాంటి వంతెన నిర్మించడం మన రాష్ట్రానికి, దేశానికి కూడ గర్వకారణం అవుతుంది. ఈ బ్రిడ్జి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే, ఉదాహరణకి ఈ క్రింది వీడియో చూడండి.

 

5 వ్యాఖ్యలు leave one →
 1. 20/01/2015 18:15

  అవును బోనగిరిగారు… మన నరసాపురం అభివృద్ధి చెంద్రాలంటే గోదవరిమీద బ్రిడ్జ్ తప్పకుండా కట్టాలి..

 2. 23/01/2015 04:49

  చిట్టవరం దగ్గర బ్రిడ్గి చూడలేనేమో అనుకున్నా. చూశాను. ఈ జీవిత కాలంలో ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా చూసేస్తే…..కోన సీమకి రైలు……గొప్ప అనుభూతే..చూద్దాం ఏం చేస్తారో…

 3. bonagiri permalink
  23/01/2015 09:37

  నాగశ్రీనివాస గారు, ధన్యవాదాలు.

  కష్టేఫలే శర్మ గారు, ధన్యవాదాలు. ఇప్పుడు ఉన్న వంతెన చిట్టవరం వద్ద కాదండి. చించినాడ దగ్గర.

 4. 25/01/2015 10:19

  Thank u sir, I v forgotten the name of the village ,remember now it is Chicinaada.

 5. kvsv permalink
  03/02/2015 08:59

  ఇవ్వేమయినా ‘పన్ను‘లా చక చకా వేసుకుపోటానికి?పనులు..ఒక పట్టాన వాళ్లకు శ్రద్ద ఉండదు మరీ…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: