విషయానికి వెళ్ళండి

యశ్వంతపూర్ గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్

02/02/2015

యశ్వంతపూర్ సికింద్రాబాదుల మధ్య వారానికి మూడు రోజులు నడిచే ఈ గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ ఈ మధ్య వరకూ ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. కాని సుమారు 10 రోజుల క్రితం నుండి రైల్వే శాఖ ఈ రైలు నడిచే వేళలని అర్థం పర్థం లేకుండా మార్చేసి, ఈ రైలుని ఎందుకూ పనికిరాకుండా చేసారు. ఇప్పుడు ఈ రైలుని ఎవరైనా ఎక్కుతారా అనేది నా సందేహం! విచిత్రం ఏమిటంటే, రైలు వేళలని మార్చిన మొదటి రోజు, చాలా మంది ప్రయాణికులు మార్పు తెలియక స్టేషన్‌కి వస్తే అప్పటికే రైలు వెళ్ళిపోయిందని తెలిసి గొడవ చేసారట. ప్రయాణికులకు ఒక SMS కూడ పంపించలేరా? ఇదీ మన డిజిటల్ ఇండియా.

కొన్నేళ్ళ క్రితం ఈ రైలుని ప్రారంభించినపుడు, యశ్వంతపూర్‌లో రాత్రి 8.50 కి ఈ రైలు బయలుదేరేది. ఆ తరువాత కొన్నాళ్ళకి ప్రయాణ సమయం పెంచి ఈ రైలుని రాత్రి 7.15 కి బయలుదేరేలా మార్చారు. ఈ సమయం కూడ పరవాలేదు. కాని ఇప్పుడు ఈ రైలు మధ్యాహ్నం 1.30 కి బయలుదేరి మర్నాడు తెల్లారి 4.00 కి సికింద్రాబాదు చేరుతుంది. అంటే ప్రయాణ సమయం మళ్ళీ పెంచారు. కాని ఒక పూట వృధా అవుతుంది కాబట్టి ఎవరికీ ఉపయోగపడదు.

ఈ రైలు తరువాత ఇంకో గంటకి అంటే 2.30 కి ఒక ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్ కూడ ఉంది. అది కూడ ఈ రైలు నడిచే రోజుల్లోనే నడుస్తుంది. ఈ రెండింటినీ ఆల్టర్‌నేటివ్ రోజుల్లో నడపాలనే ఆలోచన కూడ లేదు రైల్వే శాఖకి. మరో గంటకి అంటే 3.30 కి ఇంకో డైలీ ఎక్స్‌ప్రెస్ కూడ ఉంది. ఈ రెండు రైళ్ళకి సెలవుల్లో తప్ప మిగిలిన రోజుల్లో పెద్దగా డిమాండ్ ఉండదు. అలాంటి సమయంలో ఈ గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ నడిపి ఏం సాధిస్తారో వాళ్ళకే తెలియాలి.

ఈ మార్పుకి రైల్వే శాఖ చెప్పిన కారణం ఏమిటంటే, యశ్వంతపూర్ బీదర్ ల మధ్య నడిచే ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ని డైలీ ఎక్స్‌ప్రెస్‌గా మార్చడమట. నాకైతే బస్ ట్రావెల్స్ లాబీయింగ్ మీద అనుమానం. ఈ మార్పు వల్ల ట్రావెల్స్ వాళ్ళకే లాభం. రైల్వే శాఖ మరియు ప్రయాణికుల ప్రయోజనాలు ముఖ్యమనుకుంటే, ఈ రైలుని మళ్ళీ పాత వేళలకే మార్చాలి. మరో సలహా ఏమిటంటే గుంటూరు – కాచిగూడ – తిరుపతిల మధ్య నడుస్తున్న డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ నష్టాలలో నడుస్తోంది కాబట్టి, ఈ రెండు రైళ్ళని జత చేసి సగం గరీబ్‌రథ్, సగం డబుల్ డెక్కర్ బోగీలతో బెంగళూరు (వైట్ ఫీల్డ్) మరియు కాచీగూడల మధ్య ప్రతి రోజూ నడిపితే ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది.

 

One Comment leave one →
  1. kvsv permalink
    03/02/2015 08:49

    @ నాకైతే బస్ ట్రావెల్స్ లాబీయింగ్ మీద అనుమానం….
    హమ్మా…నిజమేనండోయ్…సందేహం లేదు…అఫీషియల్స్ చేసే ప్రతీ పనిలో…కాసులు రాబట్టుకునే తంత్రం ఉంటుంది…దబ్బు చేతులు మారితేనే…ఏ నిర్ణయాలయినా జరిగేది…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: