Skip to content

కిరణ్ బేది కాదు, కరణ్ బేది.

18/02/2015

జీవితంలో ఎన్నో విజయాలు సాధించినవాళ్ళు, కేవలం ఒక తొందరపాటు నిర్ణయంతో కనీ వినీ ఎరుగని దారుణ పరాజయం చవి చూస్తే ఎలా ఉంటుంది?

కిరణ్ బేది మామూలు పంజాబీ వనిత కాదు. దేశంలోనే మొట్టమొదటి మహిళా IPS ఆఫీసర్. అంతకు ముందు మంచి టెన్నిస్ ప్లేయర్. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. ఇంకా ఎన్నో సంచలనాలు, ఎన్నో అవార్డులు, రివార్డులు, మరెన్నో విమర్శలు ఆమె సొంతం. విజయశాంతి నటించిన “కర్తవ్యం” సినిమా కిరణ్ బేదీ జీవిత కథ నుండి స్ఫూర్తి పొంది తీసినదే.

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి తరపున పోటీ చెయ్యడం, బహుశా ఆమె చాలా తక్కువ సమయంలో తీసుకున్న నిర్ణయం అయి ఉంటుంది. ఇది కర్ణుడు కౌరవుల తరపున కురుక్షేత్ర యుద్ధం చెయ్యడం లాంటిది. అంటే ఇక్కడ బిజెపి, కౌరవుల లాంటి పార్టీ అని నా ఉద్దేశం కాదు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల వరకు చూస్తే, ఆమె తనదైన బృందాన్ని వీడి, తనది కాని పక్షంలో చేరడం కర్ణుడు కౌరవుల పక్షంలో ఉండడం లాంటిదే. మహాభారతంలో కర్ణుడికి పెద్దగా ఆప్షన్లు లేవు. కష్టకాలంలో తనను ఆదరించినవారి కోసం తన జీవితాన్ని ధారపోసాడు. చివరికి తాను కుంతీపుత్రుడని తెలిసినా, తనను నమ్ముకున్నవాళ్ళ కోసం పార్టీ ఫిరాయించకుండా ఉండి పోయాడు. కాని కిరణ్ బేదీ అణ్ణా హజారే, కేజ్రీవాల్ లాంటి వారితో కలిసి, ఎంతో కాలం సాంప్రదాయ రాజకీయాల మీద అలుపెరుగని పోరాటం చేసి, ఎన్నికల ముందు ఒక్కసారిగా అదే తరహా రాజకీయ పార్టీ పంచన చేరడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దాని పర్యవసానంగా ఆమె ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. ముఖ్యమంత్రి కావటం సంగతి అటుంచి ఒక మామూలు MLAగా కూడ గెలవలేకపోయారు. తాను నమ్ముకున్న, తనను నమ్ముకున్న బిజెపికి ఘోర పరాజయం కట్టబెట్టారు.

ఆమె ఓటమికి, బిజెపి ఓటమికి కర్ణుడి చావుకి ఉన్నట్టుగా బోలెడన్ని కారణాలు ఉండవచ్చు. కాని ఇంత దారుణమైన ఓటమి వలన ఇద్దరి పరువూ పోయింది. బహుశా మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి పనిచెయ్యకపోవచ్చును. ఒకవేళ ఆమె BJPలో చేరకుండా, AAP తరపున పోటీ చేసి ఉంటే ముఖ్యమంత్రి కాకపోయినా, ఒక గౌరవనీయమైన స్థితిలో ఉండేవారని నా అభిప్రాయం.

ఈ మధ్య మరణించిన సినీ మాటల రచయిత గణేష్ పాత్రో “సీతారామయ్యగారి మనవరాలు” సినిమాలో అక్కినేని చేత ఒక మాట అనిపిస్తారు. “ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటేనే అందరికీ మంచిది” అని. నిజమే కదా!

ప్రకటనలు
2 వ్యాఖ్యలు leave one →
  1. 18/02/2015 17:04

    కేశములు,దంతములు,నఖములు, నరులు స్థానభ్రంశము చెందిన రాణించరు, ఇది చిన్నయ సూరి వాక్యం. బేడీ కూడా అంతే

  2. Venkatram Rao K permalink
    18/02/2015 20:37

    AAP is not a clean and different party. All politicians are same. This a link which proves the same. http://hindi.oneindia.com/news/india/minister-of-arvind-kejriwal-caught-with-garland-of-notes-342543.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: