విషయానికి వెళ్ళండి

ఇంకా ఎన్నాళ్ళీ మూజువాణి ఓటు?

14/03/2015

 “బీమా బిల్లుకు రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది.” నిన్నటి దినపత్రికలోని ఒక ముఖ్యమైన వార్త ఇది. VOICE VOTE ని తెలుగులో ఎవరు అనువదించారో కాని, విచిత్రంగా మూజువాణి ఓటు అని పేరు పెట్టారు. ఈ పదాన్ని జాగ్రత్తగా వ్రాయకపోయినా, పలకకపోయినా మూజువాణి కాస్తా మేజువాణి అని అర్థం అవ్వగల ప్రమాదం ఉంది.

 మన దేశంలో ఇంతకుముందు ఎన్నో ముఖ్యమైన బిల్లులు కూడ ఇలాగే మూజువాణి ఓటుతో (అంటే VOICE VOTEతో) ఆమోదం పొందాయి. అందులో గత ఏడాది ఆమోదం పొందిన మన రాష్ట్ర విభజన బిల్లు కూడ ఒకటి. అప్పుడు పార్లమెంటులో కొంతమంది సభ్యులు ఎంత నిరశన తెలియచేస్తున్నా పట్టించుకోకుండా, మూజువాణి ఓటుతో బిల్లుకి ఆమోదముద్ర వేయించుకున్నారు. ఇంకొంత మంది సభ్యులు బిల్లుకి సవరణలు ప్రతిపాదించి డివిజన్‌కి పట్టుపట్టినా, ఆ గొడవలో డివిజన్ సాధ్యం కాదంటూ ఓటింగ్ జరపలేదు. అంతకుముందు అప్పటి రాష్ట్ర శాసనసభలో కూడ ఇలాగే మూజువాణి ఓటుతో విభజన బిల్లుని తిరస్కరించారు.

 టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిన ఈ హైటెక్ యుగంలో కూడ పార్లమెంటులో డివిజన్ (ఓటింగ్) లేకుండా ఇలా బిల్లులు ఆమోదింపచేసుకోవటంలో ఔచిత్యం ఉందా? ఒక పక్క దేశాన్ని డిజిటల్ ఇండియా చేస్తామంటున్నారు కాని ముందు పార్లమెంటుని పూర్తిగా డిజిటల్ చెయ్యండి. ఎన్నో కోట్లమంది పౌరుల జీవితాలని ప్రభావితం చేసే చట్టాలు, బిల్లులు ఇలా గౌరవనీయులైన స్పీకర్ గారి వినికిడి శక్తి మీద, విచక్షణా జ్ఞానం మీద ఆధారపడి ఆమోదం పొందడం నా దృష్టిలో సరికాదనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సుమారు 60 కోట్ల పౌరుల నుండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా వాళ్ళ అభిమతం సేకరించగలిగినప్పుడు, 545 మంది లోక్‌సభ సభ్యుల అభిమతాన్ని ఓటింగ్ యంత్రాల ద్వారా ప్రతి బిల్లుకూ (by default) తెలుసుకోలేరా? మొత్తం అందరిసభ్యుల అభిమతాన్ని, ప్రతీ బిల్లుపై తెలుసుకోవడం ద్వారా చట్టసభలకు మరింత పారదర్శకత వస్తుంది. అదే నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. అధికారపార్టీ సభ్యులలో కూడ ఎవరైనా బిల్లుని వ్యతిరేఖించాలనుకుంటే దీనివల్ల వీలవుతుంది కదా.

2 వ్యాఖ్యలు leave one →
  1. 15/03/2015 02:55

    మూ జుబానీ అంటే నోటిమాటగా అని అర్థం. ఈ మూ జుబానీ వాళ్ల నోట వీళ్ల నోట పడి చివరికి మూజువాణిగా మిగిలింది.

  2. bonagiri permalink
    15/03/2015 07:06

    పూర్ణప్రజ్ఞాభారతి గారు, ఆ మాటకు అర్థం తెలిపినందుకు ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: