Skip to content

ప్రతిపక్ష యాత్రలు

30/04/2015

అధికారంలో ఉన్నన్నాళ్ళూ ప్రజలకోసం పనిచేయకుండా, అధికారం పోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత మళ్ళీ అధికారం కోసం పాదయాత్రలు చెయ్యడం మన దేశనాయకులకి అలవాటుగా మారింది.

రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పార్టీకి ఈ దేశప్రజలు చక్కగా పదేళ్ళు పరిపాలించే అవకాశం ఇచ్చారు. అప్పుడు ఏ మంత్రి పదవీ తీసుకోకుండా, కేవలం MP గా ఉంటూ యువరాజులా భాద్యతలు లేని అధికారాన్ని అనుభవించిన రాహుల్ గాంధికి ఇప్పుడు పాదయాత్రలు, జనరల్ బోగీలో ప్రయాణాలు చెయ్యవలసిన అగత్యం ఏర్పడింది. ఆ పదేళ్ళు అవినీతిని అదుపు చేసి, జాగ్రత్తగా ప్రజలకోసం పరిపాలన చేసి ఉంటే, ప్రజలే మళ్ళీ కాంగ్రెసుని గెలిపించేవారు కదా!

2014 కి కనీసం రెండు మూడేళ్ళు ముందుగానైనా రాహుల్ గాంధి ప్రధానమంత్రి పదవి చేపట్టి పరిపాలనని గాడిలో పెట్టగలిగి ఉంటే, కాంగ్రెసుకి చరిత్రలో లేని ఘోరపరాజయం తప్పేది. ఆ రెండు మూడేళ్ళు ఆయన తన సామర్థ్యాన్ని నిరూపించుకుని ఉండుంటే, ప్రజలు బహుశా కాంగ్రెసుకి మరో అవకాశం ఇచ్చి ఉండేవారు. భవిష్యత్తులోనైనా కాంగ్రెసుకి ఓటు వెయ్యడానికి ప్రజలకి ఏ విధంగా భరోసా ఇస్తారు? లేక ఎప్పటిలాగే, కాంగ్రెసేతర పార్టీల వైఫల్యం మీదే ఆశలు పెట్టుకున్నారా?

మన రాష్ట్రంలో కూడ గతంలో ప్రతిపక్షంలో ఉన్న రాజశేఖరరెడ్డి ఇలాగే పాదయాత్రలు చేసారు. అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు రైతుల సమస్యలని పట్టించుకోకుండా 2004 ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. మళ్ళీ చంద్రబాబు కూడ ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చారు.

అంటే మన నాయకులెవ్వరికీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గోడు పట్టదు. ప్రజలకోసం పరిపాలన చెయ్యరు. అధికారం పోయాకే వీళ్ళకి ప్రజలు గుర్తొస్తారు. అప్పుడే ప్రజల తరపున మాట్లాడతారు. అధికారంలోకి వచ్చాకా మళ్ళీ కథ మామూలే.

ప్రకటనలు
No comments yet

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: