Skip to content

నిర్మాణ కార్మికులు

01/05/2015

“తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?”
అని మాత్రమే కాదు,
“మీ పడక గది కట్టడానికి ఇటుకలు మోసిన ఆడాళ్ళెవ్వరు?”
అని కూడ ఆలోచించండి.

 NK1

ఎండలో, వానలో, చలిలో,
దుమ్ములో, పొగలో, కాలుష్యంలో,
పగలనక, రాత్రనక,
నిరంతరం శ్రమించే శ్రమధీరులు వాళ్ళు. 

ఆకాశహర్మ్యాల ఎత్తుల్లో,
భూగర్భ మెట్రోల లోతుల్లో,
ప్రమాదాలకు భయపడకుండా, ప్రాణాలకు తెగించి,
ప్రతి రోజు బతుకు పోరాటం చేసే శ్రమ యోధులు వాళ్ళు. 

ఊరు కాని ఊరిలో, అయినవాళ్ళకు దూరంగా,
తనది కాని భాషతో, తనది కాని తిండితో,
చాలీ చాలని గదుల్లో సర్దుకుపోతూ, వీలైనంత పొదుపు చేసి,
ఇంటికి డబ్బు పంపించడమే వాళ్ళ జీవనలక్ష్యం. 

ఆ నిర్మాణ కార్మికుల శ్రమ ఫలితమే,
మన ఇళ్ళు, ఫ్లైఓవర్లు, మెట్రోలు, మాల్స్, ఫ్యాక్టరీలు, అన్నీను.

దేశ ప్రజలు, నాయకులు కలలుగంటున్న
నవ భారతాన్ని సృష్టించే, చిన్ని చిన్ని బ్రహ్మ దేవుళ్ళు వాళ్ళు.

వాళ్ళు ఆరుబయట, ఆరుగాలం కష్టపడితేనే,
మనం నాలుగు గోడల మధ్య అన్ని కాలాలు, క్షేమంగా బతకగలం.
వాళ్ళ శ్రమే మనకు సౌఖ్యంగా మారుతోందని గుర్తించి, గౌరవించండి. 

“తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?”
అని మాత్రమే కాదు,
“మీ పడక గది కట్టడానికి ఇటుకలు మోసిన ఆడాళ్ళెవ్వరు?”
అని కూడ ఆలోచించండి.

 NK2

ప్రకటనలు
3 వ్యాఖ్యలు leave one →
  1. 14/06/2015 13:31

    It is very good poem sir.

  2. 14/06/2015 13:32

    sir we request that we translate this poem into kannada.

  3. 21/12/2015 11:00

    ఈ పోష్టుని మన తెలుగు బ్లాగర్లు పెద్దగా చదవలేదు కాని, ఒక కన్నడ బ్లాగరు అభిమానంతో తన బ్లాగులో అనువదించి పోష్టు చేసుకున్నారు. అది ఇక్కడ.
    https://mssunilblog.wordpress.com/2015/10/20/%E0%B2%A8%E0%B2%BF%E0%B2%B0%E0%B3%8D%E0%B2%AE%E0%B2%BE%E0%B2%A3-%E0%B2%95%E0%B2%BE%E0%B2%B0%E0%B3%8D%E0%B2%AE%E0%B2%BF%E0%B2%95%E0%B2%B0%E0%B3%81/

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: