Skip to content

జననీ – జన్మభూమి

10/05/2015

అనగనగా ఒక అమ్మ. ఆ అమ్మకి ఓ ముగ్గురు పిల్లలు. ఆమె ఇంట్లో విలాసాలు లేకపోయినా, తినడానికి లోటు లేదు. ఒక రోజు ఆమె దగ్గర బియ్యం కొంచెం తక్కువగా ఉన్నాయి. ఆ ఉన్న బియ్యంతోనే ఆమె వంట పూర్తి చేసింది. వండిన అన్నం ముగ్గురు పిల్లలకీ బొటాబొటిగా సరిపోతుంది. కాని ముగ్గురికీ కడుపు నిండదు. అప్పుడు ఆ అమ్మ ఏమి చేసింది?

ఆ ముగ్గురినీ ఆకలితో ఉండగానే ఎండలో నిలబెట్టింది. వాళ్ళకి 100 మీటర్ల దూరంలో ఒక గీత గీసి ముగ్గురికీ పరుగు పందెం పెట్టింది. పందెంలో మొదటి స్థానంలో వచ్చిన వాడికి ముందుగా అన్నం తినే అవకాశం ఇచ్చింది. వాడు తినగలిగినంత తిన్నాడు. కడుపు నిండిపోయినా ఇంకా తింటూనే ఉన్నాడు. ఎందుకంటే మర్నాడు వాడికి తినే అవకాశం వస్తుందో రాదో తెలియదు. రెండో స్థానంలో వచ్చిన వాడు, ఎప్పుడు అవకాశం వస్తుందో అని ఎదురు చూస్తున్నాడు. మూడో వాడైతే అసలు తనకు ఆ రోజు అవకాశం వస్తుందో రాదో అని భయపడుతూ ఉన్నాడు.
కొంతసేపటికి మొదటివాడు ఇంక తినలేక ఆపేసాడు. ఎంతైనా అన్నం కదా, డబ్బు కాదు కదా! అందుకే రెండో వాడికి అవకాశం వచ్చింది. వాడూ కడుపునిండా తిన్నాడు. కాని మూడోవాడికి కడుపునిండా తినే భాగ్యం కలగలేదు. వాడు ఆ రోజుకి అర్థాకలితోనే ఉన్నాడు.
ఇలా ఏ అమ్మ అయినా చేస్తుందా? చేస్తే ఆమె అమ్మ అవుతుందా?
అమ్మ అయితే అసలు ఏం చేస్తుంది? ఉన్న అన్నాన్ని ముగ్గురికీ వాళ్ళ ఆకలికి తగ్గట్టు సర్ది పెడుతుంది కదా! (ఇక్కడ భారతంలోని కుంతి, పంచపాండవుల కథ గుర్తు చేసుకోండి. ప్రతి రోజు పాండవులు సంపాదించిన భోజనంలో సింహభాగం భీముడికి ఇచ్చి తరువాత మిగతా నలుగురికీ పంచి పెట్టేది) 

janani

ఇప్పుడు మనం జన్మభూమి విషయంలోకి వద్దాము. ఇప్పుడు అమ్మ అంటే భూమాత అనుకుందాము. పిల్లలు అంటే మానవులు అనుకుందాము. భూమాత తన బిడ్డలు అందరికీ కావలసినంత ఆహారం, సంపద ఇచ్చింది. భూమాత కూడ తన బిడ్డలు అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటుంది కాని, వాళ్ళు రన్నింగ్ రేసు పెట్టుకుని, కొంతమంది విలాసంగా, కొంతమంది దైన్యంగా ఉండిపోవాలని కోరుకోదు కదా! కాని మనం ఏం చేస్తున్నాము? భూమాత ఇచ్చిన ఆహారాన్ని, సంపదనీ అందరూ పంచుకుని ఆనందంగా ఉండకుండా మనలో మనకి పరుగు పందెం పెట్టుకున్నాము. ఎవరో పెట్టిన పందెంలో కూడ చిక్కుకున్నాము. ఈ పందెంలో కొంతమంది మానవత్వం కూడ మరిచిపోతున్నారు. తోటి మానవుల వాటాని దోచుకుంటున్నారు. ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు. భూమాతకి విషాదం మిగులుస్తున్నారు.

మన ఆదిమానవుడు మనుగడ కోసం పోరాటం చేసాడు. ఇప్పుడు మనం ఆధిక్యం కోసం పోరాటం చేస్తున్నాము. అందరు కష్టపడుతున్నారు. కాని కొంతమందే గెలుస్తున్నారు. గెలిచినవాళ్ళు మహరాజభోగం అనుభవిస్తున్నారు. ఓడినవాళ్ళు దొరికినదానితో సర్దుకుపోతున్నారు. కాని ఎవరూ సంతోషంగా లేరు. అందరూ ఒత్తిడిలోనే ఉంటున్నారు.
అభివృద్ధి అంటే కొంత మందే విలాసంగా బతకడం కాదు. అందరూ ఆనందంగా బతకడం. అదే భూమాతకి ఆనందం. అలాంటి అభివృద్ధి ఎప్పటికైనా చూస్తామా?

 

ప్రకటనలు
2 వ్యాఖ్యలు leave one →
  1. 10/05/2015 17:08

    జనాభాకి ప్రపోర్షనల్ గా పెరిగిపోతున్న కోరికలు, విలాసాలు ఎప్పటికప్పుడు రిచ్-పూర్ గాప్ పూడకుండా వుంచినంత కాలం మీరన్న టైపు అభివృద్ధి సాధ్యం కాదేమో. అందువల్ల
    “కలవారలు, లేనివారి కష్టాలను తీర్చుదారి కనిపెట్టి మేలు చేయగలిగినప్పుడే” ఆర్తుల జీవితాలు మారేది అని ఎప్పుడో అన్న కవి వాక్యం ఇప్పటికీ రైటే.

  2. bonagiri permalink
    11/05/2015 12:41

    ప్రజల ఆశలు, అకాంక్షలు పెరగడం నిజమే. అయినా చిన్నదో, పెద్దదో అధికారం చేతిలో ఉన్నవాళ్ళు, మిగిలినవారి వాటాని దోచుకోకుండా ఉంటే ఇంత తేడా రాదని నా అభిప్రాయం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: