Skip to content

మేగీ, రేవంత్ – దొరికిన దొంగలు?

17/06/2015

maggi

revanth

 

 

 

 

 

 

 

 

మేగీ నూడుల్స్‌లో ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలు ఉన్నాయంటూ దేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మేగీ అమ్మకాలని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసాయి. చివరికి మేగీ తయారీదారైన నెస్లే కూడ ఈ ఉత్పత్తులని మార్కెట్ నుండి వెనక్కు తీసుకుంది. ఎన్నో ఏళ్ళ నుండి అమ్మబడుతున్న ఈ మేగీలో హానికారక పదార్థాలు ఈ మధ్యనే కలపడం మొదలుపెట్టారా లేక ఇన్నాళ్ళుగా వాడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదా అన్నది తేలాలి. అలాగే మార్కెట్లో మేగీతో పాటు ఇలాంటి అనేక ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. మరి అవి అరోగ్యానికి హాని చెయ్యవా? వాటినన్నింటిని కూడ పరిక్షించారా? లేదా? అలాగే ఇన్నాళ్ళుగా మేగీ తింటూ ఆరోగ్యం పాడు చేసుకున్నవాళ్ళకి ఏమైనా నష్టపరిహారం ఇస్తారా? ఇస్తే ఎవరు చెల్లిస్తారు?

ఇంతకు ముందు కూడ ఇలాగే కూల్‌డ్రింకులలో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లు హడావిడి చేసి మళ్ళీ పట్టించుకోలేదు. అసలు తల్లి పాలలోనే పురుగుమందుల అవశేషాలు ఉన్నప్పుడు, కూల్‌డ్రింకులలో ఉండడంలో ఆశ్చర్యం ఏముందీ? మునిసిపాలిటీలు ప్రజలకు అందించే మంచినీటిలో ఎన్ని హానికారక పదార్థాలు ఉంటున్నాయి? అయినా మనం పన్నులు చెల్లించి ఆ నీటిని వాడటం లేదా? చట్టం తన పని తాను చేసుకుపోతుందని నీతులు చెప్పే నాయకులు ఇలాంటి విషయాలలో ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు ఎందుకు నాణ్యతా పరీక్షలు చేసి చర్యలు తీసుకోరో సమాధానం చెప్పాలి.

ఓటుకు నోటు వ్యవహారంలో TDP MLA రేవంత్ రెడ్డి ACBకి చిక్కి అరెస్టయ్యాడు. ఈ కేసులో ఇంకా చాలామంది TDP నేతల ప్రమేయం ఉందనీ, వారిని కూడ వదిలిపెట్టమని తెలంగాణా నాయకులు చెపుతున్నారు. చట్టవ్యతిరేఖ కార్యకలాపాలు చేసినవాళ్ళని తప్పకుండా శిక్షించాలి. ఎవరూ కాదనరు. కాని అలాంటి పనులు చేసే వాళ్ళని ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా చూపించకుండా అందరినీ చట్టానికి అప్పగిస్తేనే సరి అయిన చర్య అవుతుంది. అంతే కాని అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షనాయకులపై కక్ష సాధించడానికి, వాళ్ళకి నచ్చని వాళ్ళని మాత్రమే చట్టానికి పట్టించడం నైతికంగా సరి కాదు. ప్రతిపక్షనాయకులని కేసులతో ఇబ్బంది పెట్టడం, జైళ్ళకి పంపించడం మన దేశంలో కొత్తేమీ కాదు. కాని ఆ కేసులు తేలడానికి ఎన్ని ఏళ్ళు పట్టింది? ఎంతమంది బెయిలుపై తిరుగుతున్నారు? అసలు ఎంతమందికి శిక్ష పడింది? అయినా ఇక్కడ కూడ మన నాయకులు చట్టం తన పని తాను చేసుకుపోతుందని కౄర పరిహాసం చేస్తారు. అసలు చట్టం తన పని తాను సరైన సమయంలో సరిగా చేస్తే ఇన్ని అవినీతి పనులు ఎందుకు జరుగుతాయి? మేగీ, రేవంత్‌లు చట్టానికి దొరికారు కాబట్టి నేరస్తులు, దొంగలు అంటున్నారు, మరి దొరకని వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళందరూ నీతిమంతులు, బుద్ధిమంతులు అని ఖచ్చితంగా చెప్పగలమా?

మన దేశ రాజకీయాలలో అవినీతి ఎంత సామాన్యమైపోయిందంటే, చట్టానికి పట్టుబడి, కేసులు పెట్టబడినవాళ్ళపై ప్రజలు సానుభూతి చూపించేంతగా. అసలు ఓటుకు నోటు ఇచ్చే నాయకులందరినీ, తీసుకునే ఓటరులందరినీ చట్టానికి పట్టిస్తే, మన దేశంలో ఎన్ని కోట్లమంది నేరస్తులవుతారో మనం ఊహించగలమా?

 

ప్రకటనలు
No comments yet

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: