విషయానికి వెళ్ళండి

కృష్ణం వందే జగద్గురుం

05/09/2015

ఈ రోజు రెండు పండుగలు కలసి వచ్చాయి. ఒకటి కృష్ణాష్టమి. రెండు గురుపూజోత్సవం. అంటే ఈ రోజు ఇద్దరు గురువుల జన్మదినం. ఈ రోజు శ్రీకృష్ణుని జన్మదినం కదా! భగవద్గీతను మానవాళికి బోధించిన శ్రీకృష్ణుడి కంటే గొప్ప గురువు ఎవరు ఉంటారు? అలాగే ఈ రోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు కూడ. ఇద్దరూ కృష్ణులే అవడం కూడ విశేషమే.

ప్రతి ఒక్కరి జీవితాన్ని ఎవరో ఒక గురువు ప్రత్యేకంగా ప్రభావితం చేస్తారు. అలాగే నా జీవితాన్ని మిగిలినవారికన్నా ఎక్కువగా (టేలర్ ఉన్నత పాఠశాల, నరసాపురం) మాకు 9, 10 తరగతుల్లో గణితం బోధించిన శ్రీ కె వి సుబ్రమణ్యం (KVS) గారు ప్రభావితం చేసారు. ఆ రోజుల్లో కాంపోజిట్ మాథ్స్‌లో సిద్ధాంతాలు (theorems) అంటే అందరూ భయపడేవారు. కాని KVS గారు అందులోని లాజిక్‌ని వివరంగా చెప్పేవారు. ఒకసారి లాజిక్ అర్థమయితే సిద్ధాంతాలని పరిష్కరించడం, లెక్కలు చెయ్యడం ఈజీగా ఉండేది. తరువాతి కాలంలో నేను ఇంజనీర్ అయ్యానంటే, దానికి మూలం శ్రీ KVS గారు చెప్పిన గణితమే. అందుకు ఆయనకి నేను ఎప్పటికీ కృతజ్ఞుడినై ఉంటాను. మా గురువుగారి ఫొటో నాకు పంపిన గురువు గారి పుత్రుడు, నా సహాధ్యాయి, మిత్రుడు కామేశ్వరరావుకి కృతజ్ఞతలు. మా గురువు గారు ఉపాధ్యాయుడిగా రిటైరైన తరువాత న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేసారని నా మిత్రుడు తెలియచేసాడు. శ్రీ KVS గారు మా పాఠశాల NCC యూనిట్‌కి నిర్వాహకుడిగా కూడ పని చేసేవారు.

KVS

అలాగే మాకు ఇంగ్లీష్ బోధించిన శ్రీ N సూర్యనారాయణగారు (NSN) మేము తెలుగు మీడియం విద్యార్థులమైనా, మమ్మల్ని స్వంతంగా ఇంగ్లీషులో వ్యాసాలు వ్రాయమని ప్రోత్సహించేవారు. తెలుగు పాఠాలు ఎంతో ఆసక్తికరంగా చెప్పిన శ్రీమతి కృష్ణవేణి గారు, శ్రీ D కృష్ణమోహన్ గారు(DKM), జీవశాస్త్రాన్ని బోధించిన శ్రీ K రామచంద్రరావు గారు, సాంఘిక శాస్త్రాన్ని బోధించిన శ్రీ L హరనాథ్ బాబా గారు లాంటి అధ్యాపకులని ఎప్పటికీ మరిచిపోలేము. నాకు సరిగ్గా ఊహ కూడ తెలియని వయసులో అంటే 4 వ తరగతిలో ఉండగా నన్ను మొట్టమొదటిగా గుర్తించిన మా టీచర్ గారికి నమస్సుమాంజలి. నాకు ఇప్పుడు ఆవిడ పేరు కూడ గుర్తు లేదు.

ఈ రోజు గురుపూజోత్సవం సందర్భంగా నాకు విద్య నేర్పిన గురువులందరికీ ప్రణామం చేస్తున్నాను. చదువులోనే కాకుండా, వృత్తిలో నాకు మార్గదర్శనం చేసిన గురుతుల్యులకి కూడ వందనం.

 

ప్రకటనలు
2 వ్యాఖ్యలు leave one →
  1. శివరామప్రసాద్ కప్పగంతు permalink
    06/09/2015 05:55

    మీ మాష్టారి ఫోటో దొరకటం మీ అదృష్టం. నాకు అలాంటి అదృష్టం లేదు. నా మనస్సులో ఉన్న వాళ్ళ రూపాలే కాని, ఫోటోలు దొరకలేదు. ఉపాధ్యాయ ఉత్సవం సందర్భంగా అలనాటి మన గురువులను తలుచుకోవటం ఎంతైనా అవసరం.

  2. G.v rama mohan permalink
    05/09/2017 22:18

    గురువు గారు శ్రీ కె వి సుబ్రమణ్యం (KVS) గారు మ కుటుంబలో విశిషః గురువు ,వారి కి నా వందనం. గోపరాజు వేంకట రామ మెహన్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: